కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో మెగా ఫ్యామిలీ సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ అమిత్ షాను కలవడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఐటీసీ కాకతీయ హోటల్ వేదికగా జరిగిన ఈ భేటీ వెనుక అసలు కారణం ఏమిటి? ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనా? లేక దీని వెనుక ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా? అనే చర్చ మొదలైంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సహా పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు.
అనంతరం చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో అమిత్ షా ప్రముఖులతో సమావేశమయ్యారు.
ఈ క్రమంలో చిరంజీవి, రామ్‌చరణ్ ఆయనను కలిశారు. చిరంజీవి, రామ్‌చరణ్‌లు అమిత్ షాను కలవడం ఇదే తొలిసారి కాదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత వీరిద్దరూ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు.
అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమాకు గుర్తింపు రావడంపై అప్పట్లో అమిత్ షా వారిని అభినందించారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో ఈ ముగ్గురి భేటీ జరగడం ఆసక్తిని పెంచింది.
సుమారు అరగంట పాటు అమిత్ షాతో చిరంజీవి ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు, ఇటీవల విడుదలైన సినిమాలు, ప్రేక్షకుల నుంచి వాటికి లభిస్తున్న స్పందనతో పాటు తన తదుపరి ప్రాజెక్టుల గురించి చిరంజీవి వివరించినట్లు తెలుస్తోంది.
అలాగే రామ్‌చరణ్ సినిమా కెరీర్, రాబోయే చిత్రాల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మరో వైపు చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.
జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, రామ్‌చరణ్ సమావేశం కావడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. అయితే ఈ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయా? అనేది సస్పెన్స్ గా మారింది.
మొత్తానికి ఒకవైపు అమిత్ షా రాజకీయ పర్యటన, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లతో భేటీ.. ఈ రెండు అంశాలు హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడైతేనే భేటీ ఉద్దేశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Enduku anta tension GA… aa samavesham emitiante ipuduna kootami prabutvani bhartraf chesi , Annaya ni CM ki declare chyadaniki ee mugut skectch and netizens gusa gusa ladutunaru.
😁😁
“ప్యాలెస్ పతివ్రతా పెళ్ళాన్ని” ఆ పనికి ఒప్పించడానికి ఈ కీలక బేటి జరిగిందా?అని గుసగుసలు అంటా.
Now, all Mega fans are supporting Jana Sena. So, whether Chiranjeevi and Ram Charan openly extend their support or not, it won’t make much of a difference.
ఏపీలో తమ్ముడు, తెలంగాణాలో అన్న! ధర్మపరిరక్షణ కోసం షా గారు సైన్యం తయారీలో ఉన్నారేమో!