ఇక్కడకూడా.. ‘మా ప్రభుత్వం వచ్చాక..’ అనడమేనా జగన్..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి ఆ బాలికను పరామర్శించారు. కుటుంబసభ్యులను కూడా ఓదార్చి ధైర్యం చెప్పారు.

రాప్తాడులో ఒక ఉన్మాది దుర్మార్గానికి గురైన బాలికను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అత్యంత హేయమైన రీతిలో ఆ బాలిక దాడికి గురై గాయపడింది. బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ బాలిక కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది కూడా.

ఆమె చిన్నాన్న.. వైసీపీ మండల కన్వీనర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి ఆ బాలికను పరామర్శించారు. కుటుంబసభ్యులను కూడా ఓదార్చి ధైర్యం చెప్పారు.

తమ పార్టీకి చెందిన కుటుంబంలోని బాలిక అని చెప్పుకుంటూనే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆమెకు ఏ సాయమూ ప్రకటించకపోగా.. తమ ప్రభుత్వం వచ్చాక యాభై లక్షలు ఇస్తామని చెప్పడం కార్యకర్తల్లోనే విమర్శల పాలవుతోంది.

పాఠశాలలోకి ఒక వ్యక్తి ప్రవేశించి.. రంపం తీసుకువచ్చి.. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడం వెనుక ఉండగల ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగానే నిలదీశారు.

గంజాయి బ్యాచ్ లను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన అన్నారు. ప్రతిఊరిలోనూ పిల్లలకు కూడా అందుబాటులో ఉండేలా గంజాయి సంస్కృతి పెరిగిందని.. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయినందుకు చంద్రబాబు తలదించుకోవాలని జగన్ విమర్శించారు.

కూటమి ప్రభుత్వం గాయపడిన బాలిక కుటుంబానికి రూ.50 లక్షల సాయం అందించాలని, వైద్యానికి పూర్తి సాయం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి.

ప్రభుత్వం నుంచి సాయం రాకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ వైద్యం చేయిస్తుందని, అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని జగన్ చెప్పడం.. అలాగే.. కూటమి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బాలిక కుటుంబానికి 50 లక్షలు ఇస్తుందని జగన్ అనడం ఇంకా చిత్రంగా ఉంది.

కనీసం కొంత సాయమైనా ప్రస్తుతం అందించి.. ప్రభుత్వం గనుక పట్టించుకోకపోతే.. వైద్య అవసరాలు అన్నీ తమ పార్టీ భరిస్తుందని చెప్పి ఉంటే ఎంతో గౌరవప్రదంగా ఉండేదని కార్యకర్తలు అనుకుంటున్నారు.

చంద్రబాబునాయుడును నిందించే క్రమంలో.. ఈ కూటమి పాలనలో రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా సరే.. జగన్ వెళ్లి వారిని పరామర్శించడం, తమ ప్రభుత్వం వచ్చాక వారిని ఆదుకుంటామని చెప్పడం ఒక అలవాటుగా మార్చుకున్నారు.

చివరికి రాప్తాడు దుర్ఘటనలో గాయపడిన బాలిక విషయంలో కూడా అదే తీరుగా స్పందించడం కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. కొంత సాయం చేసి, తర్వాత ధైర్యం చెప్పి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు.

19 Replies to “ఇక్కడకూడా.. ‘మా ప్రభుత్వం వచ్చాక..’ అనడమేనా జగన్..”

  1. Now if the Govt doesn’t release AID for Hospital treatment, then YCP will give money for treatment. 

    This is a very very clear statement and good too. What is wrong ?

  2. Now “if the Govt doesn’t release money for treatment” , then ysrcp party will give money for treatment. 

    This is a very very clear statement and good too. What is wrong ?

  3. Now “if the Govt doesn’t release money for treatment” , then Jagan’s party will give money for treatment. 

    This is a very very clear statement and good too. What is wrong ?

  4. పిసినారి పెద్దన్న, రూపాయి తేడు జోబి లోంచి. నీ గవర్నమెంట్ నీ సొంత డబ్బులా అవి మావే కదా నే 

  5. మా ప్రభుత్వం వచ్చాక అనేది ఒక ఎమోషన్…బాగా ప్రాక్టీస్ చేసిన స్క్రిప్ట్….యూనివర్సల్ స్క్రిప్ట్. నువ్వు కొత్త స్క్రిప్ట్ పట్టుకూరమంటే ఎలా? ఇంత ప్రాక్టీస్ చేస్తేనే మీడియా తో ముచ్చట అంటే తు తు తు…. మే మే మే…కొత్త స్క్రిప్ట్ అంటే మీడియా గుడ్డలు చించుకుంటారు అర్ధం కాక

  6. మా ప్రభుత్వం వచ్చాక అనేది ట్రైడ్ అండ్ టెస్టెడ్ స్క్రిప్ట్….ఇప్పుడు నువ్వు కొత్త స్క్రిప్ట్ అంటే అన్న తో కష్టం

  7. ఈ useless fellow మేము వచ్చిన తరువాత రప్పా రప్పా అని మొరగటమే కానీ ఇదుగో మేము వస్తే ప్రజలకి ఈ మంచి చేస్తాం ఈవిధంగా అభివృద్ధి చేస్తాం అని ఒక్క రోజు కూడా అన్న పాపాన పోలేదు, పరమ వెధవ వీడు!!

  8. ఈ శుంఠ చెప్పిన వరద సహాయం కోటి రూపాయలు లాంటిదేనా ఇది కూడా, ప్రభుత్వం చేస్తుందో లేదో తరువాత నువ్వు ముందు ఇవ్వొచ్చు గా, ఇద్దరు ఇస్తే మాత్రం తప్పేముంది, ఇవన్నీ మభ్య పెట్టే మాటలు!!

  9. Pichi GA….mana anniyya gurinchi neeku inka ardam kaledu…kanna thalli ina, sontha chelli ina political ga use avutharu anukuntene…lekapothe pilliki bicham kudaa pettadu…

  10. we are very good at grabbing from others.

    we never give back.

    that’s anniyya’s moto.

    Dont expect anything better.

    Thank you GA for your advise to jagan.

    common people agree with your view.

Comments are closed.