తొందరగా నిద్రలేచి వేటకు బయల్దేరిన పిట్టకే ఆహారం (పురుగులు) పుష్కలంగా దొరుకుతాయనేది.. దొరల భాషలోని సామెత. early bird catches the worm అని అంటుంటారు.
వర్తమాన రాజకీయాల్లో విజయసాయిరెడ్డి పార్టీ గమనాన్ని గమనిస్తోంటే.. ఆ సామెత మరింత గట్టిగా నిజమనిపిస్తోంది. ఆయన పార్టీకి ఇంకా బొడ్డూడలేదుగానీ.. ఎర్లీబర్డ్ ఆఫర్లు ప్రస్తుతం నడుస్తున్నాయి.
ఎవరైనా.. విజయసాయి స్థాపించబోతున్న పార్టీలోకి వస్తానని ప్రకటిస్తే చాలు.. వారికోసం పార్టీ పదవులను కానుకగా అందించడానికి ఆయన రెడీగా కూర్చున్నట్టు కనిపిస్తోంది.
తిరుపతికి చెందిన కాపు నాయకుడు ఓవి రమణ తెలుగుదేశానికి రాజీనామా చేసి విజయసాయి పార్టీలో చేరుతానని ప్రకటించగానే.. ఆయనను తన పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ పోస్టులో నియమించబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు.
ఈనెల 11వ తేదీ ఉదయం విజయ సాయి పార్టీ పేరు, వివరాల ప్రకటన ఉంటుందని కొంతకాలంగా చెబుతున్నారు. జగన్ ను ఎద్దేవాచేయడం కాకుండా.. తన పేరుకు, పార్టీకి అద్భుతంగా కలిసి వచ్చే ముహూర్తబలం అదేనని వేదపండితులు సూచించినందువల్లనే ఆ సమయానికి పార్టీని ప్రకటించబోతున్నట్టుగా విజయసాయి వెల్లడించారు.
ఆ ముహూర్తంలో ప్రకటిస్తే.. పార్టీ 2029 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేస్తుందని ఆయన నమ్ముతున్నట్లుగా ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. పార్టీలోకి నాయకుల చేరిక గురించే ఇప్పుడు ప్రహసనం అంతా.
విజయసాయి గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న రోజుల్లో ఆయనతో పాటు తిరుపతికి చెందిన ఓవి రమణ అనే కాపు నాయకుడు కూడా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం టెక్నికల్ గా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.
తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి.. విజయసాయితో కలుస్తానన్నారు. వెంటనే ఆయనకు నేషనల్ జనరల్ సెక్రటరీ పదవి దక్కింది. వైసీపీ ప్రారంభించినప్పుడు తాను అదే పదవిలో ఉన్నాను గనుక.. ఓవి రమణకు తన పార్టీలో ఆ పదవి ఇవ్వబోతున్నా అని విజయసాయి తేల్చారు.
తన పార్టీలోకి రావడానికి అన్ని పార్టీల్లోనూ నాయకులు ఎగబడుతున్నారని, 11వ తేదీన పార్టీ ప్రకటన తర్వాత చేరికలు ఉంటాయని విజయసాయి చెప్పుకుంటన్నారు. అయితే వాస్తవంలోకి వస్తే.. ఎవరు వచ్చి ఆ పార్టీ తలుపుతట్టినా.. వారికి వెంటనే పార్టీలో కీలకపదవులు కట్టబెట్టేయడానికి ఆయన తహతహలాడుతున్నట్టుగా ఉంది.
ఎర్లీబర్డ్ ఆఫర్ కింద.. ఎవరు ముందుగా వస్తే వారికి కీలకపదవులు అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోందని ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఓవి రమణ తిరుపతిలో కాపు వర్గానికి చెందిన నాయకుడు. కర్ణాటకలోని మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి సన్నిహితుడు. వారి ప్రాపకంతోనే బోర్డు పదవి కూడా దక్కించుకున్నారు. బిజెపిలో కూడా కొన్నాళ్లున్నారు. తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి ఇప్పుడు రాజీనామా చేశారు. ఆయన పార్టీల్లోగానీ.. స్థానికంగా ప్రజల్లో గానీ.. పెద్దగా బలం లేదు.
ఇలాంటి నాయకుల్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడంలోనే.. ఇంకా ఆవిర్భవించబోతున్న విజయసాయి పార్టీ స్థాయి ఏమిటో అర్థమవుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

ఎంత కష్టం వచ్చింది రా ఎంకిటీ నీకు? తీసుకుంటున్న పేమెంట్ కి కూటమి నాయకులను మాత్రమే తిడితే సరిపోయేది…కానీ ఇకపై అదే పేమెంట్ కే ఇన్నేళ్లు పొగిడిన “విజయ”సాయినీ తెగడాలి.. నీ కస్టం పగోడికి కూడా రాగూడదు.. BTW pay revision ఏమైనా ఉంటుందా?
తిట్టాల్సిన పార్టీలు పెరిగిపోతున్నాయి. Pay revision చేయించుకో అరికట్లా?