మంచు కుటుంబంపై చంద్ర‌గిరిలోనూ కేసులు

మంచు కుటుంబ గొడ‌వ‌లు హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి జిల్లాకు చేరుకున్నాయి.

మంచు కుటుంబ గొడ‌వ‌లు హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి జిల్లాకు చేరుకున్నాయి. పండుగ పూట కూడా త‌గ్గేదే లే అని మంచు కుటుంబంలోని ఇరువ‌ర్గాలు గొడ‌వ‌ల‌కు పాల్ప‌డ్డాయి. కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో గొడ‌వ‌లు స‌ర్దుకున్నాయ‌ని అనుకున్న ద‌శ‌లో, మ‌ళ్లీ తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇరువైపుల నుంచి అందిన ఫిర్యాదుల మేర‌కు చంద్ర‌గిరి పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

మోహ‌న్‌బాబు కాలేజీలోకి వెళ్ల‌డానికి మ‌నోజ్‌, ఆయ‌న భార్య మౌనిక ప్ర‌య‌త్నించారు. అయితే మ‌నోజ్‌ను అనుమతించ‌కూడ‌ద‌ని మోహ‌న్‌బాబు న్యాయ స్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకోవ‌డంతో పోలీసులు అత‌న్ని అడ్డుకున్నారు. త‌న ఇంట్లోకి త‌న‌ను వెళ్ల‌నివ్వ‌క‌పోవ‌డం ఏంట‌ని మ‌నోజ్ వాదించిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. చివ‌రికి త‌న తాత‌, నాయ‌న‌మ్మ స‌మాధుల్ని సంద‌ర్శించి, వెనుతిర‌గాల్సి వ‌చ్చింది.

అయితే త‌న‌తో పాటు త‌న భార్య మౌనిక‌పై దాడికి ప్ర‌య‌త్నించారంటూ మ‌నోజ్ చంద్ర‌గిరి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు మోహ‌న్‌బాబు పీఏ చంద్ర‌శేఖ‌ర్‌నాయుడితో పాటు ఎంబీయూ సిబ్బందిపై కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు మోహ‌న్‌బాబు పీఏ ఫిర్యాదుపై మ‌నోజ్ దంప‌తుల‌తో పాటు మ‌రో ముగ్గురిపై కేసు న‌మోదు చేశారు.

సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని మోహ‌న్‌బాబు, ఆయ‌న పెద్ద కుమారుడు విష్ణు కుటుంబం కాలేజీకి చేరుకుంది. సంక్రాంతి వేడుక‌ల్ని ఉత్సాహంగా జ‌రుపుకుంటున్న వీడియోలు బ‌య‌టికొచ్చాయి. అనూహ్యంగా మ‌నోజ్ అక్క‌డికి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో వివాదం త‌లెత్తిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత వ‌ర‌కూ హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైన గొడ‌వ‌లు, కేసులు… తాజాగా స్వ‌స్థ‌లానికి చేర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

6 Replies to “మంచు కుటుంబంపై చంద్ర‌గిరిలోనూ కేసులు”

  1. మనోజ్ గాడు చేస్తంది మాత్రం చాలా తప్పు. ఏది ఏమైనా, మోహన్ బాబు సంపాదించినా ఆస్తులు, ఆయనకీ ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతె లేదు. మన ఖర్మ ఏమిటంటే అమ్మ, నాన్న సంపాయించిన ఆస్తులు మీద మనకి ఎదో హక్కు ఉన్నట్టు చేస్తారు. అదే బాధ్యత మాత్రం మనకి సంబంధం ఉండదు.

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు ఐదు, ఐదు

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.