అక్రమ సంబంధం టు హత్య వయా వ్యభిచారం

ఇలా ఇద్దర్నీ హత్య చేసిన తర్వాత రాహుల్ కుమార్, రాజ్ కుమార్, సుఖేంద్ర కుమార్ తమ సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కు పారిపోయారు.

హైదరాబాద్ లో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మలుపులు, ఫైనల్ గా హత్య ఎందుకు జరిగిందనే కారణం తెలుసుకొని పోలీసులే అవాక్కయ్యారు.

పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతంలో 2 మృతదేహాల్ని చూసిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ్నుంచి కేసును మొదలుపెట్టిన పోలీసులు, మధ్యప్రదేశ్ వెళ్లి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందో చూద్దాం..

అంకిత్ సాకేత్ అనే వ్యక్తిది మధ్యప్రదేశ్. ఇక బిందు అనే మహిళది ఛత్తీస్ గఢ్. ఇద్దరికీ సంబంధం లేదు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో కలుసుకున్నారు. బిందుకు అప్పటికే పెళ్లయింది, ముగ్గురు పిల్లలు కూడా. అయినప్పటికీ అంకిత్ సాకేత్ కు ఆకర్షితురాలైంది. అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

విషయం తెలుసుకున్న బిందు భర్త, ఆ ప్రాంతం వదిలిపెట్టి దూరంగా ఉన్న వనస్థలిపురం వెళ్లిపోయాడు. అయితే అంకిత్ సాకేత్, బిందు మాత్రం తమ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టలేదు. భర్త లేని సమయంలో అప్పుడప్పుడు అంకిత్ సాకేత్ ను కలిసేది బిందు.

ఈ క్రమంలో బిందుతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు, ఆమెను వ్యభిచారంలోకి దించాడు అంకిత్ సాకేత్. ఇందులో భాగంగా తన స్నేహితుల వద్దకు బిందును తీసుకొని వెళ్లాడు. అలా రాహుల్ కుమార్, రాజ్ కుమార్, సుఖేంద్ర కుమార్ లకు బిందు పరిచయమైంది. వీళ్లలో రాహుల్ కుమార్ కు బిందు బాగా నచ్చింది. ఆమెతో 2 సార్లు ఏకాంతంగా గడిపిన రాహుల్, ఆ క్షణాల్ని తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాలని ప్రయత్నించాడు. దీనికి బిందు నిరాకరించింది. విషయాన్ని అంకిత్ కు చెప్పింది.

అంకిత్, రాహుల్ కు మధ్య గొడవ జరిగింది. రాహుల్ ఇగో హర్ట్ అయింది. అంకిత్-బిందును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మరోసారి బిందును బుక్ చేసుకునే నెపంతో అంకిత్-బిందును పుప్పాలగూడ గుట్టల్లోకి రప్పించాడు. అందరూ కలిసి గుట్టల్లో మద్యం సేవించారు. టైమ్ చూసి బిందును పక్కకు తీసుకెళ్లాడు సుఖేంద్ర. అదే టైమ్ లో అంకిత్ ను మిగతా ఇద్దరూ కత్తితో పొడిచి, రాయితో బాది హత్య చేశారు. ఆ తర్వాత బిందును కూడా హత్య చేశారు.

ఇలా ఇద్దర్నీ హత్య చేసిన తర్వాత రాహుల్ కుమార్, రాజ్ కుమార్, సుఖేంద్ర కుమార్ తమ సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కు పారిపోయారు. అటు బిందు భర్త, తన భార్య కనిపించడం లేదని అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మొదలైంది. సాంకేతిక ఆధారాల ద్వారా వారం తిరక్కముందే ఈ కేసును కొలిక్కితెచ్చారు పోలీసులు. మధ్యప్రదేశ్ వెళ్లి ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. అలా ఓ అక్రమ సంబంధం రెండు హత్యలకు దారితీసింది.

6 Replies to “అక్రమ సంబంధం టు హత్య వయా వ్యభిచారం”

  1. అచ్చు ఒక తార కధను పోలి ఉంది. ఏదైనా ప్రమాణ పత్రం ఉంటే తప్పించు కోవచ్చు. కాని “కాకర” కాయలు అమ్మితే కొనడానికి డబ్బు కావాలి

  2. కోఠిలో నున్న తెలంగాణ సరస్వత పరిషద్ లెక్చరర్ బిరుదురాజారత్నం నకిలీదళిత పత్రాలతో ఉద్యోగం కాజేసి, పట్టుబడ్డ తర్వాత స్టే సంపాదించింది. మాల-మాదిగ అని కొట్టుకుంటున్న నాయకులూ ఎప్పుడూ ఆమె కుటుంబసభ్యులను కలవలేదు. సంక్షేమ, న్యాయ,పోలీసుఅధికారులు ఒక్కడు కూడా కుటుంబ సభ్యుల జాబితా నమోదు చేయలేదు.100%కూతుర్ల విషయాలు Judges వాకబు చేయలేదు. అందరూ దుడ్డు లేదా ఆకు ఫై మనసుపడ్డారు.పెద్దకూతురు వైశాలి సూసైడ్ నోటులో కారణాలు వ్రాసినా, బలవంతంగా వ్రాయించారని కేసు.డబ్బులెవరిస్తే, వారికి అనుగుణంగా కేసుదర్యాప్తు త్వరగా ముగియాలిగా. ప్రతి హత్య లేక ఆత్మహత్య కేసులో కాకి లేదా కట్టుకథలు చెప్పడంలో పోలీసుకు న్యాయవాది సహకరిస్తాడని నానుడి. కామారెడ్డి ఆత్మహత్య కేసులో పొలిసు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ శృతిని రక్షించడానికి చెరువులో దూకాడట.చెరువులోదిగి,చనిపోయాడట-కవిత్వము

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.