గేమ్ ఛేంజ‌ర్‌కు మెగా ట్యాగ్ రక్ష

గేమ్ ఛేంజ‌ర్‌ ప్రచారానికి వెల్ ప్లాన్ చేస్తున్నట్లే, మెగా ఫ్యాన్స్ యునైటీ, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కోసం గట్టిగా ప్లాన్ చేయాల్సి వుంటుంది.

మూడేళ్లకు పైగా సెట్ మీదే వున్న గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ వచ్చింది. విడుదల దగ్గర పడుతోంది. పుష్ప- అర్అర్అర్ తరువాత ఎన్టీఅర్, చరణ్, బన్నీ ముగ్గురూ పాన్ ఇండియా ఇమేజ్‌ను నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతున్నారు. ప్రభాస్ ఇప్పటికే అ ప్లేస్ లోకి వెళ్లిపోయారు. మహేష్ వెళ్లడానికి టైమ్ వుంది. పుష్ప తో వచ్చిన ఇమేజ్‌ను మరింత పైకి తీసుకెళ్లాలని బన్నీ ప్రయత్నిస్తున్నారు. అ ప్రయత్నం గట్టిగానే జ‌రుగుతోంది. సక్సెస్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

దేవర సినిమాతో ఎన్టీఅర్ గట్టి ప్రయత్నమే చేసారు. నిజానికి దర్శకుడు కొరటాల మరీ గొప్ప కంటెంట్ ఏమీ ఇవ్వకున్నా, ఎన్టీఅర్ కు వున్న క్రేజ్‌, ఇమేజ్‌ కలిసి సినిమాను విజ‌యం దిశగా తీసుకెళ్లాయి. ఫ్యాన్స్ వరకు సినిమా ఎలా వుంది అన్నది కాదు. ఏ మేరకు సక్సెస్ అయిందన్నది కావాలి. అందువల్ల ఎన్టీఅర్ కూడా పాన్ ఇండియా టెస్ట్ పాస్ అయినట్లే. రాబోయే సినిమాలు ఎలాగూ మంచి కాంబినేషన్ లతో వున్నాయి కనుక సమస్య లేదు.

ఇక మిగిలింది చరణ్. అర్అర్అర్ తో నార్త్ బెల్ట్ కు మంచి పరిచయమే జ‌రిగింది. ఇక దాన్ని కొనసాగించి నిలబెట్టుకోవాలి. గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో అ ప్రయత్నం కొంత చేస్తున్నారు. దాని తరువాత బుచ్చిబాబుతో సినిమా వుంది. ఎన్టీఅర్, ప్రభాస్, బన్నీ లైనప్ లతో చూసుకుంటే చరణ్ కు ఇంకా అంత గొప్ప లైనప్ ఏర్పడలేదు. బుచ్చిబాబు సినిమా తరువాత ఏమిటి అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్. ఇలాంటి టైమ్ లో గేమ్ ఛేంజ‌ర్ తో తను ప్రూవ్ చేసుకోవాలి. సినిమా కూడా ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే క్రేజీ దర్శకుల దృష్టి ఇటు మళ్లుతుంది.

కంటెంట్ పరంగా గేమ్ ఛేంజ‌ర్ ఎలా వుంటుంది అన్న అనుమానాలు వున్నాయి. టీజ‌ర్ వచ్చింది. కాస్త డివైడ్ టాక్ అయితే వుంది. ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది. మిగిలిన వారికి ఒకె కంటెంట్ అనేలా వుంది. ఇది జ‌స్ట్ టీజ‌ర్ మాత్రమే కనుక, ట్రయిలర్ కోసం వేచి చూడాల్సిందే.

పండగ టైమ్ లో మూడు సినిమాలు వస్తున్నాయి. వాటిలో యూత్ ఎదురు చూసే సినిమా ఇదే. కానీ దీనికి పోటీగా బాలయ్య- బాబీ వీరమాస్ సినిమా వస్తోంది. బాలయ్య అ సినిమాలో రాబిన్ హుడ్ మాదిరి గజ‌దొంగగా కనిపించబోతున్నారు. గుర్రాలు, దోపిడి దొంగల కాలం నేపథ్యంలో సినిమా అది. దేవర విజ‌యం వెనుక ఫ్యాన్స్ హార్డ్ వర్క్ చాలా వుంది. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా అదే వర్క్ చేస్తారు. ఎంత చిన్న చిన్న తేడాలు వున్నా, అభిమానుల పరంగా బాలయ్య-ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు వేరు కాదు. డెభై పర్సంట్ వారు వీరు ఒకటే. అందువల్ల మళ్లీ దేవర టైమ్ లో మాదిరిగా సంక్రాంతికి గట్టిగా వర్క్ చేస్తారు. పైగా దేవర టైమ్ లో జ‌రిగిన ట్రోలింగ్ రియాక్షన్ హీట్ ను గేమ్ ఛేంజ‌ర్ తట్టుకోవాల్సి వుంటుంది.

ఇలాంటి నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ నే చరణ్ సినిమాకు కోట గోడ మాదిరిగా అడ్డంగా నిలబడిపోవాల్సి వుంటుంది. మరి అ రేంజ్‌లో మెగా ఫ్యాన్స్ ను అర్గనైజ్‌ చేసేది ఎవరు. గతంలో అంత బలంగా మెగా ఫ్యాన్స్ ను అర్గ‌నైజ్‌ చేయడం ఇప్పుడు కనిపించడం లేదు. పైగా పవన్, బన్నీ ఇలా రకరకాలుగా చీలిపోయి వున్నారు. బాలయ్య- ఎన్టీఅర్ ఫ్యాన్స్ మాదిరిగా అవసరం అయినపుడు అందరం ఒకటే అనే పద్దతి మెగా ఫ్యాన్స్ లో కనిపించడం లేదు.

గేమ్ ఛేంజ‌ర్‌ ప్రచారానికి వెల్ ప్లాన్ చేస్తున్నట్లే, మెగా ఫ్యాన్స్ యునైటీ, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కోసం గట్టిగా ప్లాన్ చేయాల్సి వుంటుంది.

18 Replies to “గేమ్ ఛేంజ‌ర్‌కు మెగా ట్యాగ్ రక్ష”

  1. Ahaa abo chala salahalu ichesthunnav ….nee annani gudipinchesav nee maatalaku raathakaku viluve ledhu poi pakkeli aaduko…cinema baagunte aduddhi..ledha neelantollo padhi mandhi kalisina nilabettaleru

  2. నువ్వేం మరీ అంత ఫీల్ అవ్వకు లే రా బాబు,సందు దొరికితే చాలు,ఏడాడానికి రెడీ గా అంటావ్, “మెగా ఫ్యాన్స్,పవన్,బన్నీ అని చీలిపోయారు” ఇది చాలు నీ కామెడీ తగలెయ్య

  3. RC 17 సుకుమార్ తో.. జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా చేస్తున్న వార్ 2 తరువాత ఏంటో తేలీదు..బన్నీ ది లోకల్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో

      1. వెట్రిమారన్ తో సినిమా తీయాలి అని ఉంది ఎన్టీర్ అన్నాడు అంతే, సినిమా ఒకే కాలేదు. మొదట వెట్రిమారన్ ఒప్పుకొవాలి కదా.

Comments are closed.