నా పెళ్లి అమ్మ ఇష్టం: నాగశౌర్య

తన ప్రేమ-పెళ్లి విశేషాలతో పాటు సిక్స్ ప్యాక్ సంగతుల్ని బయటపెట్టాడు నాగశౌర్య. గ్రేట్ ఆంధ్రకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని ఎలిమెంట్స్ చూద్దాం. Advertisement – పెళ్లి గురించి ఇంకా ఏమీ…

తన ప్రేమ-పెళ్లి విశేషాలతో పాటు సిక్స్ ప్యాక్ సంగతుల్ని బయటపెట్టాడు నాగశౌర్య. గ్రేట్ ఆంధ్రకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని ఎలిమెంట్స్ చూద్దాం.

– పెళ్లి గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. అమ్మకి ఛాయిస్ వదిలేశాను. అమ్మ ఎవర్ని చూస్తే ఆ అమ్మాయినే ప్రేమిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఏదైనా అమ్మ ఇష్టం. అమ్మకి నచ్చితే నాకు నచ్చినట్టే. ఈ విషయంలో నా ఇష్టాలు కంటే అమ్మ ఛాయిసే బెటర్. ఎందుకంటే నాకు ఏమేం కావాలో అమ్మకే బాగా తెలుసు.

– జీవితంలో ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ చేశాను. నిజంగా చెబుతున్నాను.. సిక్స్ ప్యాక్ సాధించడం చాలా ఈజీ. 4 నెలలు కడుపు మాడ్చుకుంటే వచ్చేస్తుంది. కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అదే పనిగా సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తే కిడ్నీలు కొట్టేస్తాయి. ఈ విషయంలో హృతిక్ గ్రేట్.

– సినిమా కోసం గడ్డం, జుట్టు పెంచాను. జీవితంలో ఇంత జుట్టు ఎప్పుడూ పెంచలేదు. జుట్టు అంతా ముందుకొచ్చేస్తుంది. అందుకే వెనక్కి లాగి కట్టి ముడివేశాను. గడ్డం కూడా ఇంత ఎప్పుడూ పెంచలేదు. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు.