ప్రొడ్యూసర్స్ తో పవన్ పాలిటిక్స్?

నిర్మాతలు ఎప్పటికప్పుడు పవన్ ను కలుస్తూనే ఉన్నారు. వాళ్లకు పవన్ హామీలు ఇస్తూనే ఉన్నారు.

పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన పూర్తిచేయాల్సిన సినిమాలు కూడా ఉన్నాయి.

పవన్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి. ఆ 3 సినిమాల్ని తప్పకుండా పూర్తిచేస్తానంటారు. కానీ ఎప్పుడో చెప్పరు. నిర్మాతలు ఎప్పటికప్పుడు పవన్ ను కలుస్తూనే ఉన్నారు. వాళ్లకు పవన్ హామీలు ఇస్తూనే ఉన్నారు.

ఈ 3 సినిమాలకు సంబంధించి తాజాగా జరిగిన అప్ డేట్స్ చూద్దాం.. ముందుగా హరిహర వీరమల్లు విషయానికొద్దాం.. ఏఎం రత్నం పవన్ ను కలిశారు. ఆయనేదో చెప్పారు, ఫొటోలు కూడా దిగారు. రెట్టించిన ఉత్సాహంతో కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు రత్నం. సినిమా షూటింగ్ ప్రారంభమైంది. యుద్ధ సన్నివేశాలు తీస్తున్నారు. పవన్ కోసం వెయిటింగ్.

ఇప్పుడు ఓజీ సినిమాకొద్దాం. ఈ సినిమా షూటింగ్ 80శాతం పూర్తయింది. పవన్ కేవలం 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందనేది చాలా పాత మేటర్. మరి కొత్త షెడ్యూల్ ఎప్పుడు? దర్శకుడితో కలిసి నిర్మాత పవన్ ను మీట్ అయ్యారు. పవన్ వాళ్లకు కూడా ఏదో చెప్పారు. ఫొటోలు దిగారు.

ఇప్పుడు వీళ్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. పవన్ కోసం బెజవాడ సమీపంలో ‘ముంబయి సెట్’ వేస్తామంటున్నారు. సెప్టెంబర్ లోనే ఓజీ షూటింగ్ అంటూ పరోక్షంగా సంకేతాలిచ్చేశారు.

ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి.. ఈ నిర్మాతలకు కూడా పవన్ హామీ ఇచ్చారంట. చర్చలు హ్యాపీగా జరిగాయంటున్నారు నిర్మాత. మరికొన్ని రోజులు లేదా వారాల్లో షూటింగ్ ప్రారంభించుకోమని పవన్ చెప్పారట. డిసెంబర్ లేదా జనవరికి టోటల్ షూటింగ్ పూర్తిచేస్తామంటున్నాడు నిర్మాత.

పొలిటికల్ హామీలు కాదు, సినిమా హామీలు..

చూస్తుంటే.. పవన్, తన ముగ్గురు నిర్మాతలకు హామీలిచ్చినట్టున్నారు. అయితే ఇవి రాజకీయ హామీలు కావు. రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో హామీలిస్తే, ఆ లెక్క వేరు. కుదిరితే అమలు చేస్తారు, లేదంటే లైట్ తీసుకుంటారు. ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటారు.

సినిమా హామీల విషయంలో అలా చేయడానికి కుదరదు. ఆల్రెడీ ఈ ముగ్గురు నిర్మాతల నుంచి పవన్ డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బునే ఎన్నికల ప్రచారంలో కూడా వాడారు. పక్కాగా అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ హామీల్ని పవన్ నెరవేర్చాల్సిందే.

పవన్ ను నమ్ముకొని ఖరీదైన సెట్స్ వేస్తారు, ఇతర నటీనటుల కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకుంటారు. అంతా కోట్ల రూపాయల వ్యవహారం. కాబట్టి రాజకీయ హామీల టైపులో మాటతప్పితే, నిర్మాతకు మరోసారి తడిసి మోపెడైపోతుంది.

ఇంతకీ పవన్ ఏ నిర్మాతకు హామీ ఇచ్చారు..? ఏ సినిమాను ఆయన ముందుగా సెట్స్ పైకి తీసుకొస్తారు? ఒక్కో నిర్మాత నుంచి ఒక్కో సమాధానం వస్తోంది. పవన్ నుంచి మాత్రం నో ఆన్సర్. ఇది కదా అసలైన రాజకీయం అంటే!

11 Replies to “ప్రొడ్యూసర్స్ తో పవన్ పాలిటిక్స్?”

  1. 100 ల కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు….అమాయకపు ఆడపిల్లలు మరి.

  2. నువ్వేమన్న ప్రొడ్యూసర్ వా లేక ఫైనాన్సియర్ వా తెగ గింజకుంటున్నావ్

  3. పాపం… నిర్మాతల బాధల తరఫున… నీకు రక్తం కారిపోతోందని నటించే ఎటెంప్ట్… అంతే కదా?

    అయ్యారే… మరి గిప్పుడేం పిసుక్కోవాలా?

    నిజం అయితే… డబ్బు ఇచ్చినోళ్లు, తీసుకున్నోళ్లు… వాళ్ల ఇరువిరికి తగినట్లుగా ఏదో రీజనబుల్ ఒప్పందానికి వస్తారు… ఇది జరిగే విషయం…

    కానీ ఇక్కడ జరిగేది… వాళ్ల తరఫున నీ పునుగుల పిసుకులాట.

    మరీ గట్టిగా పిసుక్కోకురోయ్… నలిగిపోయి చచ్చిపోతావు..

Comments are closed.