అక్టోబర్ 12.. నాని కొత్త సినిమాకు శ్రీకారం

చాలా వెల్ ప్లాన్డ్ గా సినిమాలు చేస్తూ, తన నాన్ థియేటర్ మార్కెట్ పెంచుకుంటూ, తన రెమ్యూనిరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాడు హీరో నాని. సరిపోదా శనివారం తరవాత చేయబోయే ప్రాజెక్ట్ రెడీగా వుంది. Advertisement…

చాలా వెల్ ప్లాన్డ్ గా సినిమాలు చేస్తూ, తన నాన్ థియేటర్ మార్కెట్ పెంచుకుంటూ, తన రెమ్యూనిరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాడు హీరో నాని. సరిపోదా శనివారం తరవాత చేయబోయే ప్రాజెక్ట్ రెడీగా వుంది.

సేమ్ టు సేమ్ దసరా కాంబినేషన్. అదే దర్శకుడు. అదే నిర్మాత. ఈ సినిమాకు అక్టోబర్ 12న శ్రీకారం చుడతారు. అక్టోబర్ 12న పూజ‌ చేసి, అప్పటి నుంచి సెట్ వర్క్ ప్రారంభిస్తారు. కాస్త భారీ ఖర్చుతో కూడిన సినిమా ఇది. దసరా కన్నా సరిపోదా శనివారం కు ఖర్చు ఎక్కువ. ఇప్పుడు ఈ సినిమాకు ఇంకా ఎక్కువ.

అక్టోబర్ 12న పూజ‌ చేసి సెట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. సెట్ వర్క్ పూర్తి అయిన తరువాత సినిమాలో వచ్చే చైల్డ్ హుడ్ ఎపిసోడ్ లు చిత్రీకరిస్తారు. అవి అయిన తరువాత హీరో నాని సెట్ లో జాయిన్ అవుతారు. అంటే నవంబర్ నుంచి నాని మళ్లీ షూట్ లో బిజీ అవుతారు అన్నమాట. ఈ సినిమా సమ్మర్ టార్గెట్ గా అనుకుంటున్నారు. కానీ వన్స్ వర్క్ పూర్తి అయిన దాన్ని బట్టి వుంటుంది. ఈ సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి.

నాని వరుసగా నాలుగు సినిమాలు కమిట్ అయినట్లే. దసరా దర్శకుడి తరువాత హిట్ 3 వుంటుంది. తరువాత వెంకట్ బోయనపల్లి, మైత్రీ సినిమాలు లైన్ లో వుండొచ్చు. దర్శకులు ఎవరు ఎవరు అన్నది మును ముందు తెలుస్తుంది.

4 Replies to “అక్టోబర్ 12.. నాని కొత్త సినిమాకు శ్రీకారం”

Comments are closed.