మోక్షు- బాలయ్య- మైథలాజికల్ టచ్!

ప్రశాంత్ వర్మ అయితే మంచి అద్భుతమైన మైథలాజికల్ టచ్ సోషియో ఫాంటసీ కథతో రెడీ అయినట్లు తెలుస్తోంది.

నందమూరి మోక్షు వెండితెర మీదకు రాబోతున్న వార్త ఏళ్ల కాలంగా చక్కర్లు కొడుతూనే వుంది. కానీ వాస్తవ రూపం దాల్చడం కనిపించలేదు. కానీ ఇప్పటికి టైమ్ వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ సారథ్యంలో మోక్షు సినిమా వుంటుందని ‘గ్రేట్ ఆంధ్ర’ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిర్మాత కూడా దాదాపు ఫైనల్ అయ్యారు.

మోక్షుతో సినిమాకు చాలా మంది నిర్మాతలు రెడీ అయ్యారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కావడం, సినిమాలో బాలయ్య కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తారనే వార్తలు వుండడంతో నిర్మాతలు చాలా మందే రెడీ అయ్యారు. అయితే దాదాపుగా ఫైనల్ లిస్ట్ లో సుధాకర్ చెరుకూరి పేరు చేరింది.

అఖండ 2 చేయాల్సి వున్నా, కుదరకపోవడం, మిగిలిన బ్యానర్లు అన్నింటికి ఇప్పటికే ఒక్కో సినిమా చేసి వుండడంతో బాలయ్య సుధాకర్ చెరుకూరి వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ డిస్కషన్లు ఇంకా పెండింగ్ వుండనే వుంది. వన్స్ అది పూర్తయితే సినిమాకు మంచి భారీ ఓపెనింగ్ కార్యక్రమం వుంటుంది. బహుశా అది అక్టోబర్ లో వుండోచ్చు. ఈ లోగా వుండాలంటే శూన్యమాసం, ముహుర్తాలు లాంటి అడ్డంకులు వుండొచ్చు అని వినిపిస్తోంది.

ప్రశాంత్ వర్మ అయితే మంచి అద్భుతమైన మైథలాజికల్ టచ్ సోషియో ఫాంటసీ కథతో రెడీ అయినట్లు తెలుస్తోంది. అభిమన్యుడి పాత్రకు లింక్ వుండే లాంటి పాయింట్ ఏదో వుంటుందని తెలుస్తోంది. అర్జునుడి పాత్రలాంటిది ఏమో బాలయ్య చేస్తారని వినిపిస్తోంది. మొత్తానికి ఓ భారీ సినిమాకు అయితే శ్రీకారం చుట్టడం కోసం డిస్కషన్లు జ‌రుగుతున్నాయి.

8 Replies to “మోక్షు- బాలయ్య- మైథలాజికల్ టచ్!”

Comments are closed.