సెలబ్రిటీలంతా పెళ్లిళ్ల కోసం రకరకాల ప్రదేశాలకు ఎగిరిపోతున్న కాలం ఇది. కొందరు దేశంలోనే మంచి రిసార్టులు, స్టార్ హోటల్స్ ను ఎంచుకుంటుంటే.. మరికొంతమంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ అదితిరావు, హీరో సిద్దార్థ్ పెళ్లిపై కూడా చాలా చర్చ నడుస్తోంది.
సిద్దార్థ్ కు లండన్ అంటే చాలా ఇష్టం. అటు అదితికి స్విట్జర్లాండ్ అంటే ఇష్టం. కాబట్టి ఈ రెండు దేశాల్లో ఏదో ఒక చోట వీళ్లు పెళ్లి చేసుకుంటారని ఇప్పటికే పలు కథనాలు ప్రత్యక్షమయ్యాయి.
వీటిపై తాజాగా అదితిరావు స్పందించింది. తమది డెస్టినేషన్ వెడ్డింగ్ కాదని ఆమె స్పష్టం చేసింది. తమ సంస్థానమైన వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలోనే సిద్దార్థ్ ను వివాహం చేసుకుంటానని అదితి ప్రకటించింది. అయితే పెళ్లి తేదీని మాత్రం ఆమె బయటపెట్టలేదు.
ఇక తొలిసారి సిద్దార్థ్ ప్రపోజ్ చేసిన రోజును కూడా గుర్తు చేసుకుంది. అదితి వాళ్ల నాన్నమ్మ హైదరాబాద్ లో ఓ స్కూల్ స్థాపించారట. అదే స్కూల్ లో అదితికి ప్రపోజ్ చేశాడట సిద్దార్థ్. నాన్నమ్మ ఆశీస్సుల కోసమే సిద్దార్థ్ అక్కడ ప్రపోజ్ చేశాడని, ఆ వెంటనే తను అతడికి పడిపోయానని చెప్పుకొచ్చింది.
37 ఏళ్ల అదితి, 45 ఏళ్ల సిద్దార్థ్ ను తమ రాజకుటుంబం సంప్రదాయంలోనే పెళ్లాడుతుందట. ఆ వివాహ ప్రక్రియలోనే సిద్దార్థ్ కుటుంబీకుల సంప్రదాయాల్ని కూడా మిక్స్ చేస్తారట.
Call boy jobs available 8341510897
చాలా గొప్ప పద్దతిగా పెంచారు అమ్మాయిని…
జనం పట్టించుకోరు
vc available 9380537747
Evari ki upoyagam ledhu illanti news