సుకుమార్ తో వ్యవహారం ఇలానే ఉంటుంది. ఆఖరి నిమిషం వరకు సినిమాను చెక్కుతూనే ఉంటాడు. పర్ ఫెక్షన్ కోసం ఆమాత్రం తప్పదంటాడు అతడు. ఇటు హీరో, నిర్మాత మాత్రం ఆ టెన్షన్ తట్టుకోలేరు.
పుష్ప-2కు కూడా ఇదే ప్రహసనం నడుస్తోంది. లెక్కప్రకారం ఈ నెలాఖరుకు, ఇంకా చెప్పాలంటే మరో వారం రోజుల్లో పుష్ప-2 షూటింగ్ మొత్తం పూర్తవ్వాలి. కానీ అక్కడున్నది సుకుమార్, కాబట్టి అనుకున్నట్టు జరగలేదు.
తాజా సమాచారం ప్రకారం, నవంబర్ రెండో వారం వరకు షూటింగ్ కొనసాగుతూనే ఉంటుందంట. డిసెంబర్ 6 రిలీజ్ పెట్టుకున్నారు. అంటే, విడుదలకు 3 వారాల ముందు వరకు సినిమా ఇంకా సెట్స్ పై ఉంటుందన్నమాట.
పెద్ద సినిమాలకు ఇలా ఆఖరి నిమిషం వరకు షూటింగ్ పెట్టుకోవడం చాలా కామన్. కాకపోతే చివరికొచ్చేసరికి సాంగ్స్ మాత్రమే పెండింగ్ పెట్టుకుంటారు. కానీ పుష్ప-2కు మాత్రం 2 సాంగ్స్ తో పాటు టాకీ కూడా బ్యాలెన్స్ ఉంది. అదే ఇప్పుడు అందర్నీ టెన్షన్ పెడుతోంది.
సినిమాను మరోసారి వాయిదా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఆల్రెడీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. ఓటీటీ జనాలకు సమాచారం ఇవ్వడంతో పాటు, ఉత్తరాదిన మల్టీప్లెక్సులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇలాంటి టైమ్ లో వాయిదా అంటే కోట్లలో నష్టం.
సో.. ఇప్పుడు ఒత్తిడి మొత్తం సుక్కూ పైనే ఉంది. వీలైనంత తొందరగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేయడమే కాదు, అతడు ప్రచారానికి కూడా అందుబాటులోకి రావాలి. ఎందుకంటే, ఇది పాన్ ఇండియా సినిమా.
vc estanu 9380537747
ఎలాగూ థియేటర్ లో అస్సలు చూసేదేలే