సల్మాన్ ఖాన్ వయసు 60 ఏళ్లు. మన భాషలో చెప్పాలంటే షష్ఠి పూర్తయింది. ఇక కరణ్ జోహార్ వయసు అక్షరాలా 54 సంవత్సరాలు. ఇద్దరూ బాలీవుడ్‌లో ఎంతో సీనియర్లు. తమ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తులు.
బాలీవుడ్‌కు చెందిన ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటే, వినేవాడికి ఎంతో విజ్ఞానం. మరెంతో సమాచారం. ఎందుకంటే, వాళ్ల అనుభవాలు అలాంటిది. కానీ ఇది ఆశించి వీళ్ల పిచ్చాపాటీ వింటే మాత్రం పిచ్చెక్కిపోతుంది.
రీసెంట్‌గా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. ఓ ఇద్దరు టీనేజ్ పిల్లలు కూర్చొని మాట్లాడుకునే అంశాలవి. ఇద్దరు పెద్ద మనుషుల నుంచి రావాల్సిన లోతైన మథనం అక్కడ మిస్సయింది.
దశాబ్దాలుగా పరిశ్రమకు వెన్నెముకగా ఉన్న వీళ్లిద్దరూ ఒక షోలో పిచ్చి జోకులు వేసుకున్నారు. తమ పాత ప్రేమల గురించి మాట్లాడుకున్నారు. పెళ్లి కాకపోయినా పిల్లలు కావాలంటూ 60 ఏళ్ల సల్మాన్ చెబుతుంటే, ఇప్పటి జెన్ జీనే కాదు, అప్పటి తరం కూడా మొహం చిట్లించింది.
సల్మాన్ ఖాన్ చాక్లెట్ల గురించి మాట్లాడ్డమేంటి? అంత పెద్ద కటౌట్ వర్జిన్ కామెంట్స్ చేయడం ఏంటి? ఆ స్థాయి వ్యక్తి రిలేషన్ షిప్పుల గురించి మాట్లాడ్డం ఏంటి? ఆ తరహా ప్రశ్నలు అడిగే హోస్ట్ కైనా కూసింత జ్ఞానం ఉండాలి కదా.
టాక్ షోలు కచ్చితంగా వినోదాన్ని పంచేవే. అందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. కానీ ఎవర్ని పట్టుకొని ఏం అడుగుతున్నామనే కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. పెళ్లికాని కార్తీక్ ఆర్యన్ కు, 60 ఏళ్ల సల్మాన్‌కు ఒకే తరహా ప్రశ్నలు అడగడం ఎంత వరకు కరెక్ట్?
కాఫీ విద్ కరణ్ కార్యక్రమమే ఓ పెద్ద వినోదం కోసం పెట్టిన ప్రొగ్రామ్. అడల్ట్ జోకుల నుంచి శృంగార భంగిమల వరకు అన్నీ సిగ్గులేకుండా అడిగేస్తుంటాడు కరణ్ జోహార్. అలా అని సల్మాన్‌ను కూడా అవే ప్రశ్నలు అడిగితే ఎలా? మరీ ముఖ్యంగా తను కూడా 50 దాటాడు కదా, ఇంకా అలానే మాట్లాడితే ఎలా?
తప్పదు, ఈ కార్యక్రమంలో అలాంటివే అడుగుతాం అనుకుంటే, సల్మాన్ లాంటి 60 ఏళ్ల హీరోను ఆహ్వానించకుండా ఉండాల్సింది.
ఇద్దరు పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు కేవలం కుళ్లు జోకులు, పాత సంబంధాల గురించి కాకుండా, కాస్త పరిపక్వతతో, బాలీవుడ్ భవిష్యత్తుపై కాసేపైనా మాట్లాడితే బాగుండేది. ఆ ప్రయత్నం మచ్చుకు కూడా జరగలేదు షోలో.
అప్పటికీ ఇప్పటికీ బాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. మరీ ముఖ్యంగా పరిశ్రమ తీవ్రమైన కంటెంట్ కొరతను ఎదుర్కొంటోంది. మరోవైపు ఓటీటీతో పోటీ ఉంది. ప్రేక్షకులు మెజారిటీ చిత్రాల్ని తిప్పికొడుతున్నారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో సీనియర్లుగా ఈ ఇద్దరూ బాలీవుడ్‌కు మార్గనిర్దేశనం చేసే విధంగా తమ అనుభవాల్ని పంచుకుంటే బాగుండేది.
ఒకప్పుడు సినిమా విడుదలవుతుందంటే ప్రేక్షకుల్లో ఉండే ఉత్సాహం, ఇప్పుడు థియేటర్ల వైపు చూడటానికి కూడా జంకే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రేక్షకులు సౌత్ సినిమాల వైపో, హాలీవుడ్ చిత్రాల వైపో ఎందుకు పరుగెడుతున్నారు? బాలీవుడ్ కథా రచయితలను, దర్శకులను పెద్ద నిర్మాతలు ఎలా అణచివేస్తున్నారు? వీటిపై వీళ్లు ఎందుకు మాట్లాడరు?
కొత్త దర్శకులకు స్వేచ్ఛ ఇవ్వడం, నెపోటిజం విమర్శల నుంచి బయటపడి నిజమైన ప్రతిభను ప్రోత్సహించడం, ప్రేక్షకుడి నాడిని పట్టుకోవడం వంటి అంశాలపై గట్టిగా చర్చ జరగాలి.
పెద్ద మనుషులమని చెప్పుకునే వీరు తమ తప్పులను ఒప్పుకుంటూ, రాబోయే తరానికి ఒక బలమైన పునాదిని ఎలా వేయాలో ఆలోచించాలి. కేవలం కాలక్షేపం కబుర్లు, పరస్పర ప్రశంసలతో కాలం వెళ్లదీస్తే, అది వాళ్ల వయసుకి, అనుభవానికి అవమానం.

iddaru vedavalu matladukunte boothule vastaayi….mana batch lo kodali nani, roja lanti sannasulu matladina ilaane vuntundhi..
Cinima vallu pedda manushulu enti boss? mari oohinchukovaddu. They are entertainers.
Bane cheppav mari a.p. ni dochestunna bolli naidu ki rajamundry pakka kada
అంత కన్నా ముందు మనం నాంపల్లి టూర్లు వేయాలి ..
అరె వీణ్ణి ఎవరైనా ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేర్పించండ్రా, ఇలాగే వదిలేస్తే రేబిస్ వ్యాధి సోకిన పి/చ్చి కు/క్క/లా తయారయ్యేలా ఉన్నాడు
ఇద్దరు ఇద్దరే
పావలా గాడు మూడు పెళ్లిళ్లు చేసుకుని dy సీఎం అవ్వలేదా
చదువు రాని దద్దమ్మ సిఎం అవలేదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్?
జెగ్గుల్ ఒక్క పెళ్లి చేసుకునే పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ అవలేదా?
చేవ చచ్చిన ఆ చింత ఆగదు కదా. ఏదో అలా మాట్లాడుకుని తుత్తి పడుతున్నారు. లీవ్ థేమ్..
మన తెలుగులో ఆ మద్య ఇద్దరు సపోర్ట్ లేకుండా నడవలేని ముసలేంద్రుడు ఆబగా హీరోయిన్స్ ని తడిమిన విషయం మొత్తం లైవ్ లో చూసారు..
On a 2nd thought why do you think they are “పెద్దమనుషులు”. Just because of age?
50 దాటిన అందరూ బొబ్బుంటున్నారని నీతో చెప్పారా? లేక అందరూ నీలానే ఉంటారని ఫిక్స్ అయ్యావా? వావి వరసలు మైంటైన్ చేస్తే సరసానికి ఏజ్ ఒక నంబర్ మాత్రమే.
Koffee With Karan ఇప్పుడే చూస్తున్నారా? ఇట్లాంటి అనుభవాలే జీవితానికి విటమిన్ లాంటివి.