ముంబైలో జరిగిన ఐఐఎఫ్ఏ ప్రెస్ మీట్ కార్యక్రమంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు.
ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక ను మీడియా ముందే ఆటపట్టించాడు. సల్మాన్ సైగలకు రష్మిక ఏం చేయలేక సరదాగా నవ్వేసింది.
రష్మిక మాట్లాడుతూ, ఈ ఈవెంట్ లో తను తొలిసారి ప్రదర్శన ఇవ్వబోతున్నానని, ఈ పెర్ఫార్మెన్స్ కోసం తను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
ఆమె అలా మాట్లాడుతుంటే, పక్కనే ఉన్న సల్మాన్ ఖాన్, రష్మిక ఇదంతా డబ్బుల కోసం చేస్తోందంటూ సైగలతో చెప్పి ఆమెను ఆట పట్టించాడు.
అక్కడితో ఆగలేదు సల్మాన్. ఈ ఈవెంట్ లో ఇన్నాళ్లూ రష్మికకు అవకాశం రాకపోవడానికి, ఆమె తనతో సికిందర్ సినిమా చేయడమే కారణమంటూ జోక్ చేశాడు.
ఏకంగా మీడియా ముందు రష్మికను ఇలా ఆటపట్టించాడు సల్మాన్ ఖాన్.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ కు ప్రాణహాని ఉంది. ఈమధ్యనే అతడికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఓవైపు సల్మాన్ లక్ష్యంగానే టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు కూడా జరిగాయి. ఇంత టెన్షన్ వాతావరణంలో కూడా సల్మాన్, అంత సరదాగా ఉండడం అందరికీ నచ్చింది
