సంధ్య థియేటర్ ఘటన అల్లుఅర్జున్‌ను వదలడం లేదు. తాజాగా ఆయనపై ఓయూ జేఏసీ పేరుతో కొందరు అల్లుఅర్జున్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అల్లుఅర్జున్ ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేసి, ఇంటిపై రాళ్లు, టమాటాలు విసిరి నానా హంగామా సృష్టించారు.
అల్లుఅర్జున్ ఇంటి కాంపౌండ్ వాల్ ఎక్కి ఆందోళన చేస్తూ, రేవంత్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు వచ్చి అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తన ఇంటి దగ్గర జరిగిన ఘటనపై అల్లు అరవింద్ మాట్లాడుతూ, “ఇవాళ మా ఇంటి ముందు జరిగిన ఘటన అందరూ చూశారు. తాము సంయమనం పాటించాల్సిన సమయమని, అందుకే అది పాటిస్తున్నామని, ఘటన జరిగిన వెంటనే పోలీసులు వచ్చారని, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదని, తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దని, దయచేసి అర్థం చేసుకోవాలని” విజ్ఞప్తి చేశారు.
కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంపై నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన తర్వాత, అల్లుఅర్జున్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్దగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు అల్లుఅర్జున్ కీలక సూచనలు చేశారు. తన ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని సూచించారు.
మరోవైపు, తెలంగాణలో అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా వ్యక్తులు మాత్రం అల్లుఅర్జున్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవాళ దాడి చేసిన వారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.
మన ఆటిట్యూడ్ ఏమాత్రం తగ్గొద్దు రా బన్నీ..
A1 సింహం and రకుల్ రావు మన పక్కే..
నిన్ను “పుష్ పా” అనుకుంటున్నారు.. కాదు WILD FIRE అని నిరూపించు ద’మ్ముంటే..
Revanth valla congress malli Telangana lo win avvadu, bags mose vadini nammi CM post ela ichindi pichi congress… Valla karma. Kiran kumar ni nammi AP lo address ledu. Next TG
Revanth kutubanika?Revathi kutubanika!😀
GA వాళ్ళు ఎన్నడూ వాళ్ళ ఆర్టికల్స్ ప్రూఫ్ రీడ్ చేయడం అనేది ఉండదు. ఏది తోస్తే అది రాసుకుంటూ పోవటమే.
Ga ఉద్దేశ్యం మీకు అర్థం కలేదు
అక్కడ రష్ ఉంటదని అందరికి తెలుసు దాన్ని తట్టుకోలేని వారు వెళ్లడం తప్పు ఆ మహిళా చనిపోవడం అందరికి బాదే కానీ ఈ కేసు ను డెవలప్ చేసి అతనికి మేలు చేస్తున్నట్టు నటించే వాళ్లే ఎక్కువైపోయారు