కేటీఆర్ సీఎం అవుతాడట!

కేటీఆర్ జైలుకు వెళితే సీఎం అవుతాడని నాయకులు అంటున్నారని రాశాడు.

ఏ పార్టీ నాయకుడైనా ముఖ్యమంత్రి కావాలంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. సమీకరణాలు ఉంటాయి. అతని పొలిటికల్ ట్రాక్ రికార్డ్, అతని అనుభవం, ప్రజాదరణ …ఇలాంటివన్నీ దోహదం చేస్తాయి. అతని కుటుంబ చరిత్ర కూడా కారణమవుతుంది. ఇదో పెద్ద చరిత్ర.

అయితే రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. పాదయాత్ర చేస్తే సీఎం అవుతాడని తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ ఉంది. అయితే పాదయాత్ర చేసిన ప్రతివారి విషయంలో నిజమవుతుందని చెప్పలేం. ఈ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో కొందరి విషయంలో నిజమైంది.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. సీఎం అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేసి ఏపీకి మొదటి సీఎం అయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. వైఎస్సార్, చంద్రబాబు, వైఎస్ జగన్ సీఎంలు కావడానికి ఇతరత్రా కారణాలు చాలా ఉన్నాయి.

కానీ పాదయాత్ర చేసి సీఎంలు అయ్యారనే సెంటిమెంట్ ఉంది. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయ జీవితం ప్రారంభించింది. ఆమె కూడా పాదయాత్ర చేసింది. తాను తెలంగాణకు సీఎంను అవుతానని చెప్పింది. కానీ రాష్ట్రం వదిలి ఏపీకి తరలివెళ్లింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్న జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ఆయన పార్టీని కాపాడటం కోసం పాదయాత్ర చేసింది.

మరి రాహుల్ గాంధీ భారత్ జోడో పేరిట పాదయాత్ర చేసినా ప్రధాని కాలేకపోయాడు. ఇక రాజకీయాల్లో మరో సెంటిమెంట్ జైలుకు వెళ్లివచ్చిన నాయకుడు సీఎం అవుతాడని. ఇందుకు తాజా ఉదాహరణగా చంద్రబాబును చెబుతారు. ఏపీకి ఆయన మొదటిసారి సీఎం అయిన తరువాత రెండోసారి జగన్ సీఎం అయ్యాడు.

ఆయన పాలనలో చంద్రబాబు యాభై రోజులు జైలుకు వెళ్లారు. దీంతో ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చిందని, అందుకే ఆయన సీఎం అయ్యాడని అనేవాళ్లున్నారు. కానీ ఆయన సీఎం కావడానికి ఇతర కారణాలు చాలా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా కొందరు నాయకులు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయ్యారు.

ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే ఈ వారం రాసిన కొత్త పలుకు శీర్షికలో కార్ రేస్ కుంభకోణంలో ఇరుక్కున్న గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అదే నిజమైతే కనుక తమ నెత్తిన పాలు పోసినట్లేనని గులాబీ పార్టీ నేతలు తెగ సంబరపడిపోతున్నారట.

ఎందుకు అంతగా సంబరపడుతున్నారంటే … కేటీఆర్ జైలుకు వెళితే సీఎం అవుతాడని నాయకులు అంటున్నారని రాశాడు. వచ్చే ఎన్నికలో మళ్ళీ గులాబీ పార్టీ గెలిస్తే అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు !

5 Replies to “కేటీఆర్ సీఎం అవుతాడట!”

  1. KTR CM అయితే,

    మా “తెలంగాణా పిత” ఎం కావాలే??

    బతికున్న0గే రాజకీయ సమాధి ఐతడా??

    నీయవ్వ తగ్గేదేలే.. మా పిత ఉన్నంతవరుకూ ఉంటే సీఎం గా ఉండాలా లేకపోతే “ప్రతి పిచ్చ” నేత గా ఉండాలా.!

  2. కేటీర్ / లోకేష్ ఎప్పటికి సీఎం కాలేరు . ఆ పేస్ లో వాస్తు లేదు . జైలు కి కాదు ఇంకెక్కడకి వెళ్లొచ్చిన కాలేరు .

  3. కేటీర్ / లోకేష్ ఎప్పటికి సీఎం కాలేరు . ఆ పేస్ లో వాస్తు లేదు . జై లు కి కాదు ఇంకెక్కడకి వెళ్లొచ్చిన కాలేరు .

Comments are closed.