అల్లు అర్జున్ పై ఎందుకింత కక్ష?

కేసీయార్ ప్రభుత్వంతో పోలిస్తే రేవంత్ ప్రభుత్వం సినీ రంగానికి బెనిఫిట్ షోలు, టికెట్ల పెరుగుదల అంశాల్లో పెద్దపీటే వేసింది.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ ఒక అభిప్రాయం సినీరంగంలో బలంగా ప్రబలుతోంది. ఆయన సినీ ప్రముఖులకి వ్యతిరేకి అని. నాగార్జున ఎన్-కన్వెన్షన్ ని కూల్చడంతో మొదలైన ఆ ఇంప్రెషన్ బన్నీపై ప్రస్తుతం జరుగుతున్న లీగల్ పర్వంతో కొనసాగుతోంది.

కేసీయార్ ప్రభుత్వంతో పోలిస్తే రేవంత్ ప్రభుత్వం సినీ రంగానికి బెనిఫిట్ షోలు, టికెట్ల పెరుగుదల అంశాల్లో పెద్దపీటే వేసింది. ఆ విషయం స్వయంగా రేవంత్ రెడ్డే చెప్తున్నా, సినీ రంగంలోని పలువురికి ఇంకా ప్రభుత్వంపై సానుకూల దృక్పధం ప్రసరించడంలేదు.

అల్లు అర్జున్ విషయంలో ఏదో క్షకగట్టి చేస్తున్నట్టుగా ఉందని భావిస్తున్నవారే అధికంగా ఉన్నారు. “బన్నీపై ఎందుకింత కక్ష?” అని అడుగుతున్నవాళ్లున్నారు. కొందరైతే ఏకంగా “ఇదంతా వెనకుండి పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారు” అని ఊహించుకుంటున్నారు. విషయం అర్ధం కాకపోతే ఊహలే ఉంటాయి.

రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని ఒక్కసారి గమనిద్దాం. ఆయన ప్రజాపక్షపాతి అని నిరూపించుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి. సోషల్ మీడియాలో ఫలానా విషయంపై ప్రజానాడి ఎలా ఉందో చూసి దానికి అనుగుణంగా తన వైఖరిని ప్రదర్శిస్తున్నట్టుగా అనిపిస్తోంది.

హైడ్రాని ప్రవేశపెట్టినప్పుడు మొదటిగా నాగార్జున ఎన్-కన్వెన్షన్ ని కూలగొట్టడం జరిగింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ప్రజలు హర్షధ్వానాలు చేసారు. సెలబ్రిటీ అని ఉపేక్షించకుండా కూల్చినందుకు రేవంత్ ను హీరో అన్నారు. ఆ చప్పట్లు మారుమోగుతున్న తరుణంలో దుర్గం చెరువు వద్ద ఉన్న ఇళ్లను కూల్చేందుకు రగం సిద్ధం చేసారు. అక్కడ రేవంత్ రెడ్డి అన్నగారి ఇల్లు కూడా ఉండడం, అయినా ఆగేది లేదని చెప్పడంతో ఇంకా పెద్ద హీరో అయ్యారు ముఖ్యమంత్రి. అన్నైనా, దోస్తైనా, సెలెబ్రిటీ అయినా ఎవరైనా జాంతా నహీ..అనేతీరులో ఆయన ఊపు చూపడంతో ఎప్పుడూ చూడని నిఖార్సైన సీయం ని చూస్తున్నట్టుగా జనం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

చెరువు బాధితులకి రేవంత్ రెడ్డి తీరు కోపం తెప్పించినా వారి సంఖ్య చప్పట్లుకొడుతున్న జనంతో పోలిస్తే చాలా తక్కువ. కనుక చెరువుల వద్ద ఉన్న ఇళ్లని కూలుస్తున్నా, ఇతర జనం చేసే కరతాళ ధ్వనులు ఆగలేదు. తాము చెరువు సమస్యలో లేనప్పుడు అదే సమస్యలో ఉన్నవారంతా క్రిమినల్స్ లా చూసే ఒకానొక మానసికపరిస్థితి ప్రజల్లో ఉంటుంది. వాళ్లంతా ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నట్టు భావించి రేవంత్ రెడ్డిని, హైడ్రాని స్వాగతించారు. ఇక హైడ్రాకి ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చింది కనుక దూకుడు కొనసాగించారు. అక్కడే కథ అడ్డం తిరిగింది.

హైడ్రా యాక్టివిటీ నిరుపేదల ఇళ్లపై పడడం, వాళ్లు భయభ్రాంతులకి గురయ్యి ముఖ్యమంత్రిని అనరాని బూతులు తిట్టడం జరిగింది. అప్పటి వరకు చప్పట్లు కొట్టిన ప్రజలే ఆ నిరుపేదల మీద సానుభూతి చూపించి హైడ్రాని, రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా పోస్టుల్లో తిట్టడం మొదలుపెట్టారు. ఇక్కడే ట్విస్ట్. సంపన్నుల మీద దాడిని స్వాగతించే సాడిజం ఉన్న జనానికి పేదల మీద దాడిని ఖండించే సున్నితహృదయం కూడా ఉంటుంది.

ఆ దెబ్బతో స్టోరీ రివర్సయ్యింది. హైడ్రా వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతోందని ఆ సోషల్ మీడియా తిట్ల ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పైగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా కుంటుపడడంతో కొన్నాళ్లు హైడ్రా భయాన్ని జనాలు మర్చిపోయేలా చేయాలన్న యోచనలో ఆ టాపిక్ ని పక్కన పెట్టినట్టుంది.

సరే..ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్ కి వద్దాం. ప్రీమియర్ షో నాడు సంధ్యా టాకిసులో తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ మరణించింది. ఒక పిల్లవాడు కోమాలోకి వెళ్లాడు. సోషల్ మీడియాలో జనం సహజంగానే ఆ ఘటనలో పెద్దతలకాయ అయిన అల్లు అర్జున్ ని తిట్టడం మొదలుపెట్టారు. ప్రభుత్వం మళ్లీ సామాన్యుల పక్షపాతి అని నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం అయ్యింది. సత్వరం కేసు ఫైల్ అవ్వడం, జైలుకు పంపడం జరిగిపోయాయి. బెయిల్ దొరికినా జెయిల్ రూల్స్ అప్లై చేసి చట్టం తన పని తాను చేస్తుందన్న లెక్కలో, టెక్నికల్ అంశాలు చెప్పి ఒక రాత్రి జైల్లో ఉంచారు. అల్లు అర్జున్ జీవితంలో జెయిల్ రికార్డ్ ఓపెనైపోయింది.

కానీ సామాన్య జనానికి అది చాల్లేదు. ఎందుకంటే రిలీజయ్యాక అల్లు అర్జున్ పశ్చాత్తాపం కనపడలేదు. అతను బాధితుల పట్ల మనస్ఫూర్తిగా బాధ్యత ఫీలౌతున్నట్టు వాళ్ల కంటికి కనపడలేదు. “ఐకాన్ స్టార్” టీ షర్ట్ వేసుకుని ఓదార్పు యాత్ర ఈవెంట్ జరుపుకుని లైవ్ టెలీకాస్ట్ పెట్టడం ప్రభుత్వానికి మండింది.

అన్నట్టు ఇక్కడ గుర్తించాల్సిన ఒక పెద్ద విషయం ఉంది. అడ్వొకేట్ నిరంజన్ రెడ్డి తన వాదన వినిపిస్తూ పోలీసులపై చురకలు వేసారు. “పోలీసులు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సే…వాళ్లు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో లేకుండా పై ఫ్లోర్లోనే అల్లు అర్జున్ ని చూడడానికి ఉన్నారు” అనగానే కోర్ట్ రూములో న్యాయమూర్తితో సహా న్యాయవాదులంతా నవ్వారు. ఆ సంఘటన పోలీసుల మనసుని డొలిచి ఉండొచ్చు.

అల్లు అర్జున్ ఒక్క రాత్రిలో బయట పడిపోవడం చూసి జనం నెగటివ్ కామెంట్లు లంఘించుకున్నారు. జైలుకి వెళ్ళినా బెయిల్ రావడం సామాన్యప్రజలకి నచ్చలేదని సోషల్ మీడియా కామెంట్స్ ని బట్టి తెలిసింది. దానికి తోడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలారు. దాంతో విషయం పెద్దదయ్యింది.

అంసెబ్లీలో అక్బరుద్దీన్ చేత హిందీలో విషయాన్ని లేవనెత్తించారు. ఆయనకి సమధానం చెప్పేక్రమంలో హిందీలో మాట్లాడే అవసరముంటుంది ముఖ్యమంత్రికి. అలా మాట్లాడితేనే ఆ స్పీచ్ ప్యాన్ ఇండియా అవుతుంది. అయ్యింది కూడా. రేవంత్ పోలీసుల్ని సమర్ధిస్తూ వచ్చారు. వాళ్ల డ్యూటీని సక్రమంగా నిర్వర్తించనీయకుండా అల్లు అర్జున్ ఎలాంటి ధోరణి కనబరిచాడో చెప్పుకొచ్చారు.

అంతా అయ్యాక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ కూడా తనలో పశ్చాత్తాపం కనపడలేదు చూసిన వాళ్లకి. అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఫెయిలైనమాట వాస్తవం. తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఒక ఎస్సై కళ్ల నీళ్లు పెట్టుకుని కర్చీఫుతో తుడుచుకున్నారు బాధితుల పట్ల సానుభూతి చూపుతూ. ఆ పోలీసుకి యూట్యూబ్ కామెంట్లలో జనం ప్రశంసల వర్షం కురిపించారు. అది చూసేమో ఒక సస్పెండైన పోలీసాఫీసర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ ని వీర ఉతుకుడు ఉతికేశాడు మాటలతో. ఆయనగారి సస్పెన్షన్ చరిత్ర తెలియక జనం జైహో నినాదాలు చేసారు.

ఈ గొడవలో, తాము మాత్రమెందుకు మైలేజీ పొందకూడదనుకున్నారో ఏమో ఓయూ జే.ఏ.సీ వాళ్లు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసారు. హెచ్చరికలు చేసారు. ఇలాంటి పనులు చేసి రేవంత్ కళ్లళ్లో పడి యువనాయకులుగా ఎదగాలనే ఆలోచన కొందరికుండొచ్చు.

అయితే ఇలా కంట్రోల్ తప్పిన వ్యవహారం రేవంత్ రెడ్డిని విలన్ గా మార్చే ప్రమాదముంది.

అవును…హైడ్రా విషయంలో ఎన్-కన్వెషన్ తో మొదలైన హీరోయిజం ఎలాగైతే సామాన్యుల మీదకు వెళ్లాక విలనిజంగా మారిందో, ఇప్పుడు అసెంబ్లీ స్పీచుతో మొదలైన హీరోయిజం, సస్పెండైన పోలీసు ప్రెస్మీట్ తోనూ..ఓయూ జే.ఏ.సీ దాడితోనూ విలనిజానికి దారి తీస్తున్నట్టుంది. ఎందుకంటే జనం ఆల్రెడీ నెగటివ్ కామెంట్స్ మొదలుపెట్టారు.

రేవంత్ రెడ్డి వ్యవహారశైలిలో గ్రాఫ్ ఇదే.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. సోషల్ మీడియాలో సౌండ్ చూసి అదే అత్యధికుల అభిప్రాయం అనుకోవడం పొరపాటవుతుంది. అధిక శాతం ఓటర్లు “వీళ్లే” అనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుటుంది.

రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రెచ్చిపోగానే ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోయారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి పుష్ప2 చూసి నెగటివ్ రివ్యూ చెప్పడం ఆశ్చర్యకరం. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ కూడా విమర్శించడం మరో విషయం. వీళ్లని చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తందానా అంటారు. వీళ్లందర్నీ చూసి సస్పెండైన పోలీసు, ఓయూ జే.ఏ.సీలు కూడా రెచ్చిపోయారు. అలా కంట్రోల్ తప్పిన చెయిన్ రియాక్షన్ అయిపోయింది. “ఈ ఘటనతో సంబంధమున్న పోలీసులు తప్ప తక్కినవాళ్లు మాట్లాడడానికి వీల్లేదు” అని రేవంత్ రెడ్డే ఒక పబ్లిక్ ట్వీట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రభుత్వాధినేతకు సంయమనం చాలా అవసరం. ఎదుటివాడు రెచ్చగొడితే రియాక్టవకుండా సమయం కోసం వేచి చూడాలి. అదే రాజనీతి.

బటన్ నొక్కుతూ స్కీములిస్తే చాలు, ఆ లబ్ధిదారులైన 84% మంది కచ్చితంగా మళ్లీ ఓట్లేసి గెలిపిస్తారనుకున్న జగన్మోహన్ రెడ్డి అంచనా ఏమయ్యింది? పరిపాలన అంటే అన్ని వర్గాలవాళ్లని దువ్వాలి. కొందరి పట్ల చట్టాన్ని గట్టిగా ప్రయోగించి, కొందరిని ఉపేక్షిస్తే అది రాజకీయ తప్పిదమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి, సినిమావాళ్లకి కూడా అంతగా సఖ్యత ఉండేది కాదు. వాళ్లని తన కాళ్లబేరానికి తెచ్చుకోవాలని జగన్ ప్రయత్నించనట్టు చరిత్ర చెబుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే ధోరణి కనబరుస్తున్నట్టు ఉంది. ప్రభుత్వాధినేత ఈ దిశగా కాస్త నిశితమైన ఆలోచన చేస్తే నయమేమో.

హరగోపాల్ సూరపనేని

42 Replies to “అల్లు అర్జున్ పై ఎందుకింత కక్ష?”

  1. ఒక దేశానికి ఉన్నట్టు, ఏకంగా నీకు ఆర్మీ నే ఉంది so

    నీ ఆటిట్యూడ్ ఏమాత్రం తగ్గొద్దు రా బన్నీ..

    A1 సింహం and రకుల్ రావు మన పక్కే..

    నిన్ను “పుష్ పా” అనుకుంటున్నారు.. కాదు “WILD FIRE” అని నిరూపించు ద’మ్ముంటే..

    అవతల ఎవ్వడైనా

    నీయవ్వ తగ్గేదే లే..అనాలి లేకపోతే నువ్వు కేవలం “రేవంత్ నలిపిన ఫ్లవరు” ఐతావ్

      1. LOL. What is your problem? I agree bro.. Why he was not punished? Where the problem is? If CBN is the reason, he should be punished naa? Think. I am not supporting anyone in these “Death” cases. I always support the general public. Hope you understand…

  2. ఇవన్నీ పక్కన పెడితే, బన్నీ వలన ఒక ప్రాణం పోయింది, ఇంకో ఒకలు జీవచ్ఛం లా వున్నారు.

    1. After seeing that video presentation by Police… I won’t support Mr A.A.

      AA should keep quite. Not sure why he is arranging counter press meets and provoking a C.M of the state?

      It was an accident. But happened because of this AA. he should realize and behave like a human,. That is missing..

        1. రేయ్ కుల అహంకారం మానుకో…police death గూర్చి చెప్పినా స్పందించని వంకర జబ్బ ni support చేసే public ఉన్నంత వరకూ ఏమీ చెయ్యలేము

  3. All these episodes clearly show that government is targetring Arjun. What is the purpose of CM giving a lengthy speech in the Assemby when the matter is in the Hon’ble Courts.

    Raising a question by MIM Member and CM speaking at length on this

    Congress leaders comments

    Police releasing a video

    One suspended ACP foul-mouthing the actor

    Attack on the actor’s house by OU JAC (?) and making serious comments

    All these episodes clearly show that the government is doing diversion politics and targetting the actor even though he is not involved in that unfortunate incident.

        1. Yupp. I agree with you.. He should be punished for that. Why that didn’t happen?

          Who killed vivekananda reddy? why people are not punished?

          Like this how many cases we leave?

          AA is not public servant nor a freedom fighter. Just an actor enjoying public’s money and caused death of 1 and other one is in coma

          Though police warned him before visiting the Sandhya Theater. That’s why it is serios. now.

        2. There is no rule violation in pusthakaalu. Proper permission was there. Ofcourse there ia mismanagment from authorities. But in AA clear violation of rules as police rejected the permission.

        3. In pushakaralu case, CBN immediately went to hospital, seen the smooth passage of relief activities and announced the compensation. In AA case, never cared abt the effected family.. Compensation announced, but it’s partly paid

    1. Permission లేకుండా roadshow చేసినట్టు cc footages ఉన్నాయి…1dead 1critical అని చెప్పినా react అవ్వకుండా సినిమా చూస్తాను అన్నాడు……still supporters

  4. Jagan rates penchaledu ani gola chesina valle rates thakkuvuga vuntene cinema industry batukutundi ani annaru… Evado oka powder gadu politics kosam ante adi jijam anukunte ela? Okka middle budget producer ni cheppamanu edi correct anedi

    1. BRO, We people should also change. Why we have too spend 1200 Rs for one movie. This is equal to 1 year OTT subscription . For 4 family members it costs around 5K. right? Still the movie is in theatres and we can watch now also or in OTT.

  5. కక్ష కాదు గాని .. అల్లు అర్జున్ గారికి తీవ్ర నష్టం కలిగించిన వాళ్లలో ఇద్దరు కీలకం.

    లాయర్ నిరంజన్ రెడ్డి

    ముందు లాయర్ నిరంజన్ రెడ్డి

    పోలీస్ వ్యవస్థ పై భూరద చల్లాడు.

    నిజానికి ఆరోజు పోలీస్లు ఆమెను కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ లాయర్ మాత్రం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించారు. నిజానికి ఒక హీరో ని కాపాడటం కోసం ఇంత దిగజారే అవసరం లేదు.

    మరో వ్యక్తి కేటీఆర్ ఆయన పెంపుడు సోషల్ మీడియా.

    ఈ ఇష్యూ చల్లారిన తరువాత కూడా మాటిమాటికీ అల్లు అర్జున్ పేరు ప్రస్తావిస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక్కడ నిజానికి కేటీఆర్ ప్రజల పక్షాన నిలబడి ఉంటే బాగుండేది.

    కానీ హీరో ఆయన అభిమానుల సానుభూతి కోసం ఆయన సోషల్ మీడియా BRS పార్టీ అవలంబించిన తీరు వల్ల అల్లు మరింత నెగిటివ్ అయ్యాడు సమాజంలో.

    అల్లు అర్జున్ గారు కి నష్టాన్ని తీవ్రరూపం చేసి ప్రజలలో ప్రతికూల వాతావరణం తెచ్చింది ఈ ఇద్దరు మాత్రమే .

Comments are closed.