తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు థమన్. ఈ విషయంలో దేవీశ్రీప్రసాద్ వెనుకపడ్డారు. కానీ థమన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్లు కాకుండా, తమిళ, కన్నడ, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్లను తెచ్చుకుంటున్నారు కూడా. అయినా థమన్ చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. అయితే సినిమాకు ఓపెనింగ్ తీసుకురావడంలో కీలకమైన సరైన పాటను ఇవ్వడంలో థమన్ తరచూ ఫెయిల్ అవుతున్నారు. సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాల్లో మంచి పాటలు ఉన్నాయి. కానీ అవి థమన్ మ్యూజిక్ కాదు. నాని సినిమాల్లో మంచి పాటలు ఉన్నాయి. కానీ అవి థమన్ మ్యూజిక్ కాదు.
అలవైకుంఠపురములో సినిమాకు ముందు థమన్ కెరీర్ దాదాపు స్లో అయిపోయింది. కానీ ఆ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. చేతినిండా సినిమాలు. ఆ సినిమా తరువాత ఇప్పటి వరకు అంటే నాలుగేళ్లలో నలభై సినిమాల వరకు చేశారు. కానీ సరైన ఆల్బమ్ ఇచ్చిన సినిమాలు పట్టుమని ఐదారు కూడా లేవు. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, గుంటూరు కారం, వకీల్ సాబ్ ఇలా అతి కొన్ని మాత్రమే గుర్తుకు వస్తాయి.
అదే సమయంలో చాలా చార్ట్ బస్టర్లు వచ్చాయి. ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, దసరా, సార్, లక్కీ భాస్కర్, డిజే టిల్లు, టిల్లు స్క్వేర్, ఆదిపురుష్ ఇలా చాలా మాంచి పాటలు ఉన్న సినిమాలు వచ్చాయి. వాటికి వేటికీ థమన్ మ్యూజిక్ కాదు.
ఇప్పుడు సంక్రాంతి సినిమాలు రాబోతున్నాయి. గేమ్ ఛేంజర్ లాంటి అతి భారీ సినిమా, ఢాకూ మహరాజ్ లాంటి పెద్ద సినిమాలు రెండూ థమన్ చేతిలోనే ఉన్నాయి. మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాంకి భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్. థమన్ అందిస్తున్న సినిమాలు రెండింటికీ కలిపి ఇప్పటికి కాస్త బాగున్నాయి అనిపించే పాటలు మాత్రమే వచ్చాయి. థమన్ సరైన పాటలు ఇవ్వకుంటే వాటి ప్రభావం సినిమాల మీద పడుతుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రెండు పాటలు విడుదల కాగా, రెండూ హిట్. ఈ పాటల వల్ల ఈ సినిమాకు అప్పుడే బజ్ వచ్చింది.
నిజంగా ఇది థమన్‌కు టెస్టింగ్ టైమ్.
అఖండ మర్చి పోయావ్.. ఎందుకు తమన్ వెమ్మట పడ్డావ్