ఏపీలో ఇసుక వ్యధలు

మొత్తం మీద ఇసుక ఏపీలోని చాలా అంటే చాలా ఏరియాలో అందుబాటులో లేకుండా పోయింది.

2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన సమయం. అప్పుడే వర్షాలు. ఇసుక పాలసీ మార్పులు, ఇసుక దొరకని వైనం. అంతే వెంటనే రంగంలోకి దిగారు జ‌నసేన అధిపతి పవన్ కళ్యాణ్. విశాఖ వెళ్లి, భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ అంటూ నానా హడావుడి చేసారు. వైకాపా ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. మంచికో చెడుకో వైకాపా ప్రభుత్వం ఇసుక పాలసీ అమలు చేసింది. ఎవరు ఎంత తిన్నారు అన్నది తెలియదు కానీ జ‌నాలు అయితే అయిదేళ్లు ఇసుక కోసం పెద్దగా ఇబ్బంది పడలేదు. మరీ అబ్ నార్మల్ గా ఇసుక రేట్లు పెరిగిందీ లేదు.

సరే, జ‌నాలకు నచ్చలేదు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. వస్తూనే అప్పటి వరకు ప్రతి పాయింట్ లో చేర్చిన ఇసుకను రాత్రికి రాత్రి తెలుగుదేశం పెద్దలు మాయం చేసారు. రాష్ట్రం అంతా కలిపి ఇలా మాయం చేసిన ఇసుక విలువ కోట్లలోనే. ఇలా జ‌రుగుతోంది అని చూసి, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కలిసి ఫ్రీ ఇసుక అనే నిర్ణయం తీసుకునే సరికే ఇసుక పాయింట్లలో ఇసుక ఖాళీ అయిపోయింది. దాంతో ఇసుక రేట్లు అమాంతం పెరిగిపోయాయి.

దీంతో ప్రభుత్వం చాలా రూల్స్ పెట్టింది. ప్రయోగాలు చేస్తోంది. కానీ ఇసుక రేటు దిగి రావడం లేదు. ఇసుక ఫ్రీ అన్నది పెద్ద జోక్ గా మారిపోయింది. ప్రభుత్వం ఎన్ని రూల్స్ పెట్టినా ఇసుక పక్కదారి పడుతోంది. అంతే కాదు ఇంకా చాలా చిత్రాలు జ‌రుగుతున్నాయి.

ఈస్ట్ గోదావరిలో ఓ ముచ్చట వినిపిస్తోంది. ఇసుక లారీని ర్యాంప్ నుంచి తెచ్చాక, దగ్గరలోని బోరింగ్ దగ్గరకు తీసుకెళ్తారట లారీని. వంద రూపాయిలు ఇస్తే లారీలో వున్న ఇసుక అంతా చాలా బలంగా తడిపేస్తారట. అప్పుడు వే బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లి కొత్తగా బరువు తూస్తారు. టన్నుల లెక్కలో అమ్ముతారు కనుక, తడిసిన ఇసుక మరింత బరువు అవుతుంది.

ఇలా రకరకాల మార్గాల ద్వారా ఇసుక రేట్లు పెంచి నల్ల బజారుకు తరలించడం వెనక సూత్ర ధారులు లోకల్ ఎమ్మెల్యేకు రోజుకు ఇంత అని కప్పం కట్టడం ఒకటి ఇప్పటికే ఫిక్స్ అయిందట. అలాగే ఓ మాజీ మంత్రులు, బలమైన లీడర్లకు రోజుకు ఇంత, అ ఏరియాలో తిరిగే లారీకి ఇంత అని చెల్లింపులు మొదలయ్యాయట.

మొత్తం మీద ఇసుక ఏపీలోని చాలా అంటే చాలా ఏరియాలో అందుబాటులో లేకుండా పోయింది. దీని వల్ల ఇసుక దొరక్క, దొరికినా భారీ రేటు పెట్టలేక, నిర్మాణ పనులు మందగించాయి. త్వరలో నదుల్లో నీరు తగ్గుతుందని, కొత్త ర్యాంప్ లు అన్నీ ఓపెన్ అవుతాయని, అప్పుడు రేట్లు తగ్గుతాయని, అంత వరకు ఇబ్బంది తప్పదని జ‌నం చెప్పుకుంటున్నారు.

ఈ మొత్తం వైనంలో 2019 కి 2014 కి తేడా ఏమిటంటే..

ఈ ఇసుక బాధలు ఏ మీడియా రాయదు. ముఖ్యంగా తెలుగుదేశం అనుకుల మీడియా అస్సలు రాయదు. వైకాపా మీడియా రాసినా, కావాలని రాస్తోంది అనేయచ్చు.

2019లో రోడ్డు ఎక్కిన‌ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు. అందువల్ల ఇప్పుడు ఇక అయన రోడ్డు ఎక్కరు. ఇసుక మీద మాట్లాడరు. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రేమ వొలికించరు.

కోరి గెలిపించుకున్నారు కనుక జ‌నం మాట్లాడక, వారిలో వారే బాధపడక తప్పదు.

5 Replies to “ఏపీలో ఇసుక వ్యధలు”

  1. ఇది నిజమే. ప్రభుత్వం ఆన్లైన్ పెట్టినట్టు గ చెప్తున్నారు, కానీ వరుసగా 10 రోజుల నుంచి తిరుగుతుంటే సైట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు అనే సమాధానమే వస్తుంది. పనిలేక వర్కర్స్ ఖాళీ గ వున్నారు. బాబు చేతకాని తనమో, లేక మ్మెల్యే ల అవినీతో తెలియదు కానీ, ఇసుక మాత్రం గోదావరి జిల్లాల్లో దొరకడం లేదు.

  2. ఇది నిజమే. Memu YCP ni vimarsa chesam, TDP ni mosam, kani ee isuka policy oka pedha avaneethi, inka ton dhara 1800 /ton undi, chetha adminstation on this Sand policy

Comments are closed.