“దేవర ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రద్దవ్వడం నాకు చాలా బాధగా ఉంది. అభిమానుల కంటే నేను ఎక్కువగా బాధపడుతున్నాను.” అంటూ ఎన్టీఆర్ ఆమధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి గ్రౌండ్ ఈవెంట్ లేకుండానే దేవర రిలీజైంది. విడుదలై వారం కూడా గడిచింది.
మరి దేవర సినిమాకు సంబంధించి ఇప్పటికైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా లేదా? సినిమా రిలీజ్ తర్వాత విజయోత్సవ వేడుకలు జరుపుకుందామంటూ యూనిట్ ప్రకటించింది. సక్సెస్ మీట్ అంటూ ప్రెస్ మీట్ తో సరిపెట్టింది.
ఆ మీడియా సమావేశానికి ఎన్టీఆర్ రాలేదు. ఎందుకంటే, ఆ టైమ్ కు ఆయన హైదరాబాద్ లో లేడు. ఇప్పుడు దేవర మొదటి వారాంతం పూర్తిచేసుకుంది. సినిమా పెద్ద సక్సెస్ అయిందని యూనిట్ చెబుతోంది. మరి అభిమానులకు థ్యాంక్స్ చెప్పేందుకైనా ఓ ఈవెంట్ పెడతారా లేదా అనే క్లారిటీ ఇప్పటివరకు రాలేదు.
నిజానికి దేవర సినిమాకు సంబంధించి ఏదైనా గ్రౌండ్ ఈవెంట్ నిర్వహించడానికి ఇదే సరైన సమయం. ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత ఎంత పెద్ద సినిమాకైనా ఆక్యుపెన్సీ తగ్గుతుంది. ఇలాంటి టైమ్ లో సినిమాను నిలబెట్టాలంటే మరోసారి గట్టిగా ప్రచారం చేయాల్సిందే. ఎన్టీఆర్ ను చూసేందుకు ఫ్యాన్స్ కూడా తహతహలాడుతున్నారు కాబట్టి, ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
vc estanu 9380537747