దేవర సూపర్ హిట్.. కానీ ఎందుకీ నెంబర్లు?

మరీ ముఫై శాతం నెంబర్లు ఒక్కరోజే ఎందుకు కలపాల్సి వచ్చింది అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

దేవర.. భారీ సినిమా. అత్యంత భారీ ఓపెనింగ్ వచ్చిన సినిమా, అందులో ఏమీ సందేహం లేదు. మొదటి రోజు దానికి వచ్చిన నెంబర్లు తక్కువేమీ కాదు. కానీ వాటిని అంతకు అంత పెంచి చూపించడం వల్ల కలిసి వచ్చినదేమిటి? ఎవరి అనందం కోసం? హోల్ సేల్ బయ్యర్ ఈ నెంబర్ల వల్ల హ్యాపీ అయిపోతారా? లేదూ.. జిల్లాల వారీ కొనుక్కున్న బయ్యర్లు ఫుల్ జోష్ లో వుంటారా? కేవలం ఎన్టీఅర్ అనందం కోసం అనుకుందాం. కానీ దాని వల్ల తరువాత సినిమా మార్కెట్ ఏమన్నా పెరిగిపోతుందా?

ఉదాహరణకు నైజాం దేవర సినిమాను 45 కోట్లకు అమ్మారు. మొదటి మూడు రోజులకే నలభై కోట్ల కు పైగా వచ్చేసినట్లు ఎలాగూ చెబుతారు. ఇంకా దసరా సీజ‌న్ అంతా వుండనే వుంది. అంటే 60 నుంచి 70 కోట్ల మధ్య కలెక్షర్ ఫిగర్ చూపించే అవకాశం వుంది. మరి అలా అని చెప్పి, తరువాత సినిమాను నైజాం ఏరియాకు 70 కోట్లకు కొంటారా? అమ్మకాల మాట వచ్చినపుడు లో లోపల అసలు కలెక్షన్లు గురించి బయ్యర్లు డిస్కస్ చేసుకోరా?

మొన్నామధ్య ఓ మిడ్ రేంజ్‌ భారీ సినిమా వచ్చింది. అంతకు ముందు అదే హీరో సినిమాలు అద్భుతం, పరమాద్భుతం అని హడావుడి చేసారు. కానీ ఈ సినిమాకు వచ్చేసరికి బయ్యర్లు కొనడానికే వెనకడుగు వేసారు. ఎందుకని? అసలు సంగతి, అసలు లెక్కలు తెలుసు కనుక.

అలా అని దేవర సినిమాను తీసేయడం లేదు. నైజాంలో తొలి రోజు 14 కోట్లకు పైగా తరువాత రెండు రోజులు కలిపి 15 కోట్ల మేరకు వచ్చాయని తెలుస్తోంది. ఇలాంటి కలెక్షన్ ను చెప్పుకుంటే చాలు. అదే అద్భుతమైన నెంబర్. కానీ కేవలం ఏ రికార్డుల కోసమో, ముఫై శాతానికి పైగా ప్రతి చోటా కలిపి చెబుతున్నారని ఇండస్ట్రీ జ‌నాలు చెప్పుకుంటున్నారు.

బయ్యర్లు వాళ్ల డిసిఅర్ లు వాళ్లు పంపుతున్నారు. దాన్ని ఎవరు కలిపి చెబుతున్నారో, మొత్తానికి ముఫై శాతం కలిపిన నెంబర్లు చలామణీలోకి వెళ్తున్నాయి. నిజంగా అంత బలమైన సినిమా అయితే సోమవారం నాడు పది నుంచి ఇరవై శాతానికి కలెక్షన్లు ఎందుకు పడిపోతాయి?

థియేటర్ల నుంచి ఎప్పటికప్పుడు కలెక్షన్లు తెప్పించి సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కట్టడి చేసి, అంకెలు రాకుండా చేసి, యూనిట్ మాత్రం ప్రతి రోజు తమకు కావాల్సిన నెంబర్లను జ‌నాల్లోకి పంపుతున్నారు. దాంతో అవే చలామణీలోకి వెళ్తున్నాయని సినిమా జ‌నాలు కామెంట్ చేస్తున్నారు.

దేవర సినిమా సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ అందులో సందేహం లేదు. కానీ మరీ ముఫై శాతం నెంబర్లు ఒక్కరోజే ఎందుకు కలపాల్సి వచ్చింది అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

17 Replies to “దేవర సూపర్ హిట్.. కానీ ఎందుకీ నెంబర్లు?”

  1. Orey havle.. Movie baledani rasav. Rating kuda icchav 2.5 malli devera blockbuster andulo sandeham ledu antav. Oke website lo enni rakalu rasthav. Neekemanna mentala?

  2. మీకు తెలియంది ఏముంది GA గారూ. ఆ నెంబర్లు ఫ్యాన్స్ ను సంతృప్తి పరచాడానికి. ఆ నంబర్స్ చూసుకుని… మా హీరో గొప్పొడు అని వీరి ఫ్యాన్స్. కాదు అవి ఫేక్ నంబర్స్ అని వారి ఫ్యాన్స్ వెర్రి గొఱ్ఱెల లా తన్నుకుని చావడానికి. అక్కడికి వీడికి ఎక్కువ collections vasthe fans ki పంచేసినట్టు. వాడికి తక్కువ కలెక్షన్స్ వస్తె ఫ్యాన్స్ దగ్గర వసూలు చేసినట్టు వెధవ బిల్డ్అప్స్. మారండ్రా వెర్రి ఫ్యాన్స్.

    1. Em undi Ila collections chupistunaru.heros emo vala remuneration pechutunarj.malli Dani recover kosam fans and common people balli avtunaru.hero emo aina fans ki kani vala families ki help chestara cheyarh

  3. Yatra average ga undi nuvu 3 rating enduku ichav

    Number lu (authentic) nee daggara unte cheppu

    Anthe kani ala enduku rayali,

    సినిమా ఇలా ఎందుకు teeyli, ఫస్ట్ Saif Ali khan ni వేస్తే saripoddi ga ani kathalu cheppaku

    Nuvu teey first 30 min lo main villin champesi L****kodaka

Comments are closed.