బాబు స‌ర్కార్ ప్రాధాన్యాలివే!

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం, వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న‌కు అండ‌గా నిలిచే వైసీపీ నాయ‌కుల‌పై ర‌క‌ర‌కాల కేసులు పెట్టి భ‌య‌పెట్ట‌డ‌మే ఎజెండాగా పాల‌న సాగుతోంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

కూటమి ప్రభుత్వ పాలనకు ఆయుష్షు తగ్గుతోంది. అప్పుడే ఏడాది పాలన పూర్తి కావ‌స్తోంది. ప్ర‌భుత్వం నిన్నగాక మొన్న ఏర్పడినట్టు వుంది. కాలం గిర్రున తిరుగుతోంది. మ‌రోవైపు సూపర్ సిక్స్ లబ్ధి కోసం ప్రజలు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. పింఛ‌న్ ఓకే. ఇదే సంద‌ర్భంలో 50 ఏళ్లు నిండిన బీసీల‌కు పింఛ‌న్ ఇస్తాన‌న్న హామీ ఊసే లేదు. మ‌రోవైపు కొన్ని పింఛ‌న్ల‌లో కోత‌. అయిన‌ప్ప‌టికీ రూ.4 వేలు తీసుకుంటున్న ల‌బ్ధిదారుల్లో సంతోషం.

అన్న‌దాత సుఖీభ‌వ కింద రైతుల‌కు భ‌రోసా సొమ్మును ఈ నెల‌లో అందిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అలాగే త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని కూడా వ‌చ్చే నెల‌లో అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండ‌ర్ల‌పై ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందినోళ్ల భాగ్యం, అంద‌క‌పోతే దుర‌దృష్టం అనుకోవ‌డం త‌ప్ప చేయ‌గ‌లిగేదేమీ లేదు.

హామీల కంటే చంద్ర‌బాబు స‌ర్కార్ ప్రాధాన్యాలు వేరేగా ఉన్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం, అలాగే వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న‌కు అండ‌గా నిలిచే వైసీపీ నాయ‌కుల‌పై ర‌క‌ర‌కాల కేసులు పెట్టి భ‌య‌పెట్ట‌డ‌మే ఎజెండాగా పాల‌న సాగుతోంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. పాల‌నా రీతులు చూస్తే అదే అభిప్రాయాన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయి. ఇప్పుడు కాక‌పోతే, ఇంకెప్పుడూ అమ‌రావ‌తిని నిర్మించుకోలేమ‌ని, అలాగే వైసీపీ నేత‌ల్ని జైలుకు పంప‌లేమ‌ని అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది.

దీని వెనుక టీడీపీ బ‌ల‌మైన వ్యూహంతో ముందుకెళుతోంది. జ‌గ‌న్ స‌హా వైసీపీ నేత‌లంద‌రినీ జైళ్ల‌కు పంప‌డం ద్వారా, వైసీపీపై అంట‌రాని పార్టీగా ముద్ర‌వేసి, త‌ద్వారా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని పొందాల‌ని చూస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. హామీల అమ‌ల్లో చ‌తిక‌ల ప‌డుతూ, వాటి నుంచి ప్ర‌జ‌ల్ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే ఇవ‌న్నీ ప్ర‌భుత్వం చేస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థానం చూస్తే, ప్ర‌త్య‌ర్థుల్ని మీడియాను అడ్డం పెట్టుకుని దెబ్బ‌తీయ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌గా చెబుతున్నారు. అయితే రాజ‌కీయాల్లో ఇలాంటివ‌న్నీ ఎదుర్కొని నిల‌బ‌డ‌గ‌లిగితే ఏ పార్టీకైనా భ‌విష్య‌త్ వుంటుంది. వైసీపీ ఏ మేర‌కు త‌ట్టుకుని నిల‌బ‌డుతుందో చూడాలి. ప్ర‌తిరోజూ వైసీపీ నేత‌ల అరెస్ట్‌పైనే ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. హామీల అమ‌లు నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లిస్తున్నామ‌ని టీడీపీ సంబ‌ర‌ప‌డుతోంది. అయితే ప్ర‌జ‌ల మ‌న‌స్సులో ఏముందో ఇప్పుడే తెలిసే అవ‌కాశం లేదు. ఆ రోజు వ‌చ్చిన‌ప్పుడు అన్నీ తేలుతాయి. అంత వ‌ర‌కూ ఎదురు చూడ‌డం త‌ప్ప‌, మ‌రో మార్గం లేదు.

18 Replies to “బాబు స‌ర్కార్ ప్రాధాన్యాలివే!”

  1. టీడీపీ నాయకులని రాత్రి కి రాత్రే ఎత్తేశారు..విచారణ చెయ్యటం కానీ,నివేదికలు తెప్పించుకుని నిర్ధారణ చేసుకోవటం కానీ ఇలాంటివి ఏమి లేకుండా,ముందస్తు బెయిల్ లకి పోయే అవకాశం లేకుండా వందల మంది పోలీస్ లతో దాడులు చేపించి వాడిలో వున్న రాక్షసుడు ని సంతృప్తి పరుచు కున్నాడు.ఇప్పుడు విచారణ కమీషన్ లు వేసి,తప్పు చేశారు అని నిర్ధారణ కి వచ్చిన తరువాతే చర్యలు మొదలవుతున్నాయి.. ముందస్తు బెయిల్ లలకి కోర్ట్ లకి వెళ్ళటానికి అవకాశం కూడా ఇస్తున్నారు.కాకని, తోపుదుర్తి లాంటోళ్లకి అజ్ఞాతంలో గడిపే సమయం కూడా ఇస్తున్నారు..మాకు కావాల్సింది.. ఆ మాటకొస్తే జనాలు కోరుకుంది కూడా ఇదే..ఎవ్వడిని వదిలేసినా.. కేస్ లు మధ్యలో కాడి దింపినా ఈ సారి క్యాడర్ జనాల నుండి కూటమి వ్యతిరేక త ఎదుర్కోవటం ఖాయం.

      1. 2019లో ఎలా గెలిచారు 2024 లో ఎలా ఓడారు..

        గెలిస్తే ప్రజామోదం, ఓడితే మోసం చేసి గెలిచారు.. కేసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయితే మా అన్నయ్య ను ముఖ్యమంత్రిని చేస్తాడు మా కేసిఆర్..

  2. మా అన్నయ్య ప్రాదాన్యతాలు ప్రజలకు నవరత్నాలు ఇచ్చి కోటిశ్వరలను చేయడం, ప్రజల చేత మద్యం మాన్పించడం ప్రజల ఆరోగ్యం బాగుచేయడం..

  3. సిగ్గు శరం ఉండి ఈ పోస్ట్ పెట్టావు రా గ్యాస్ ఆంధ్ర 

     10,000 మీ అన్న సృష్టించిన అరాచకం అంతా కాదు కదరా గ్యాస్ ఆంధ్ర. చివరికి పసుపు చొక్కా వేసుకున్న వాడిని కూడా వదలకుండా లోపల వేసి ద****** కదరా గ్యాస్ ఆంధ్ర. బాధితుల మీదే కేసు బనాయించి బొక్కలు వేసి కుళ్ళ పొడిచారు కదరా గ్యాస్ ఆంధ్ర

     చాలామందికి బెయిల్ కూడా రాకుండా చేశారు కదా రా గ్యాస్ ఆంధ్ర. కనపడిన వాడిని కనపడినట్లుగా అరెస్టు చేసి బొక్కలే వేసి కేసు గీసు లేకుండా కుమ్మరు కదరా గ్యాస్ ఆంధ్ర. ఈ అరాచకం అంతా అప్పుడు కనపడలేదు రా గ్యాస్ ఆంధ్ర. మాస్కులు అడిగిన పాపానికి సుధాకర్ మీద పిచ్చివాడని ముద్ర వేసి చంపినప్పుడు కనపడలేదు రా గ్యాస్. నడిరోడ్డు మీద చంద్రయ్యను చంపినప్పుడు కనపడలేదు రా గ్యాస్ ఆంధ్ర. పదవ తరగతి పిల్లవాడిని చంపి పెట్రోల్ పోసి చంపినప్పుడు కనపడలేదు రా గ్యాస్ ఆంధ్ర .

     డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు కనపడలేదు రా గ్యాస్ ఆంధ్ర. ఎన్నో పాపాలు చేసిన నీకు కనపడలేదు రా గ్యాస్ ఆంధ్ర . ఇప్పుడు వీడు లేదో ఊడబడుస్తున్నారని వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు కదరా గ్యాస్ ఆంధ్ర . మనిషి పుట్టుక పుట్టి మనుషుల అన్నం తింటే ఇట్లాంటి పోస్టులు ఎవడు పెట్టాడు రా గ్యాస్ ఆంధ్ర. మరి నువ్వు మనిషివో పశువు మృగము నువ్వే తేల్చుకోవాలి రా గ్యాస్ ఆంధ్ర 

  4. మావోడు 99.9999% హామీలు అమలు చేసి, రోజూ బటన్ లు నొక్కి నొక్కీ పేదల్ని కోటేశ్వరులని చేసేసాం, ఐనా మా మావోణ్ణి గుద్ద దె0గి పంగనామాలు పెట్టారు ఎందుకు గ్యాసన్నా ??

  5. “వైసీపీ నేత‌ల అరెస్ట్‌పైనే ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. హామీల అమ‌లు నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లిస్తున్నామ‌ని టీడీపీ సంబ‌ర‌ప‌డుతోంది”……classic mundavalli style comments

  6. No need to implement hameelu..Basic promises like Pinchan and few others were already implemented..Free bus is not necessary, 1500 to 18-59 women is not necessary. Thalliki vandanam and Annadatha is getting ready in few days. Enough for now. Building state capital is required for any state.

  7. One should do balance between development and Freebies.

    Jagan focused too much on freebies where as CBN too much focus on capital.

    Both are not good.

Comments are closed.