పవన్ తక్కువేం కాదు.. బాబు క్లారిటీ?

ఎవ్వరూ ఎక్కువ కాదు, అలా అని ఎవ్వరూ తక్కువ కాదంటూ సుదీర్ఘంగా తనకుతాను వివరణ ఇచ్చుకున్నారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్కు పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పట్లానే ఆయన ఈ దఫా కూడా రేటింగ్స్, ర్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో డిసెంబర్ వరకు మంత్రుల పనితీరు ఎలా ఉందనే అంశంపై ఆయన ర్యాంకులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ జాబితాలో చంద్రబాబుకు ఆరో ర్యాంక్ రాగా.. లోకేష్ కు 8వ ర్యాంకు వచ్చింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా 10వ ర్యాంకుకు పడిపోయారు. దీనిపై మంత్రుల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా తెగ చర్చ నడిచింది.

స్వయంగా పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ జాబితాపై గుర్రుగా ఉన్నారు. ఈమధ్య లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్స్ బలంగా వినిపించిన నేపథ్యంలో, జాబితాలో అతడికి పవన్ కంటే మెరుగైన ర్యాంక్ రావడంపై జనసేన కార్యకర్తలు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.

లెక్కప్రకారం, అది సరైన ర్యాంకింగ్ జాబితానే కావొచ్చు. ఎందుకంటే, పవన్ వద్ద చాలా మంత్రిత్వ శాఖలున్నాయి. కాబట్టి ఫైళ్ల క్లియరెన్స్ నెమ్మెదిగానే సాగుతుంది. అయినప్పటికీ ఈ ర్యాంకులు మంత్రుల మధ్య, పార్టీల మధ్య అభిప్రాయబేధాలకు దారితీసిందనే సంకేతాలు బయటకొచ్చాయి.. మరీ ముఖ్యంగా జనసేన-టీడీపీ మధ్య విభజన ఏర్పడే ప్రమాదం తలెత్తిందంటూ కథనాలు-విశ్లేషణలు పుట్టుకొచ్చాయి. దీంతో దాన్ని కవర్ చేసేందుకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు.

ఎవ్వరూ ఎక్కువ కాదు, అలా అని ఎవ్వరూ తక్కువ కాదంటూ సుదీర్ఘంగా తనకుతాను వివరణ ఇచ్చుకున్నారు చంద్రబాబు. నేరుగా పవన్ కల్యాణ్ పేరును ఆయన ప్రస్తావించనప్పటికీ.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే తప్ప, ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదంటూ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

“గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి… సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం.” అంటూ బుజ్జగించే మాటలు మాట్లాడారు.

చంద్రబాబు మాటలతో పైకి కనిపించని ఈ వివాదం చల్లారుతుందేమో చూడాలి. అన్నట్టు చంద్రబాబు ర్యాంకులు ప్రకటించే టైమ్ లో అక్కడ పవన్ కల్యాణ్ లేరు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.

15 Replies to “పవన్ తక్కువేం కాదు.. బాబు క్లారిటీ?”

  1. పవన్ కళ్యాణ్ కి ర్యాంక్ లు అవసరం లేదు….ఆయన డెడికేషన్ , ఆయన ఆలోచనలు టాప్ లెవెల్ లోనే ఉంటాయి వేరే వాళ్ళతో పోలిస్తే….

  2. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

  3. ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. Unlike others who are signing based on other criteria, Pawan sir is reading every file, doing physical inspections and then clearing files. That is why he is taking time. He is the correct leader that AP needs. Public loves him.

Comments are closed.