జ‌గ‌న్‌పై మ‌హిళా మంత్రి అవాకులు చెవాకులు అందుకా?

వైఎస్ జ‌గ‌న్‌ను నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డం వ‌ల్ల, త‌న ర్యాంక్‌పై కంటే, దూష‌ణ‌ల‌పై ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించొచ్చ‌నే ఎత్తుగ‌డ వేశార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌హ‌జం. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌ల ప‌రిధి దాటుతున్న నాయ‌కులు ఎక్కువే. త‌మ అధినేతల మెప్పు కోసం నాయ‌కులు హ‌ద్దులు దాటుతున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం టీడీపీ నేత‌ల‌కు ఏ మాత్రం రుచించ‌డం లేదు. అయితే జ‌గ‌న్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌త్య‌ర్థుల నుంచి దీటైన కౌంట‌ర్లు రాలేదు.

త‌మ ద‌గ్గ‌ర స‌మాధానం లేక‌పోతే, తిట్ల పురాణాన్ని ఆశ్ర‌యిస్తుంటార‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. తాజాగా జ‌గ‌న్‌పై గిరిజ‌న సంక్షేమ‌శాఖ మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి వివాదాస్ప‌ద విమ‌ర్శ‌లు చేశారు. వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌పై అవాకులు చెవాకులు పేలార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

పిచ్చి జ‌గ‌న్ సైకో జ‌గ‌న్‌గా మార‌ట‌మే జ‌గ‌న్ 2.0గా ఆమె ఘాటు విమ‌ర్శ చేశారు. శ‌వం లేస్తే త‌ప్ప బ‌య‌టికి రాని దుర్మార్గుడంటూ జ‌గ‌న్‌పై ఆమె నోరు పారేసుకున్నారు. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఆయుష్షు గ‌ట్టివి కాబ‌ట్టే జ‌గ‌న్‌కు దూరంగా వుంటున్నార‌ని ఆమె అన్నారు. ఆత్మ‌ల‌తో మాట్లాడే జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి అంద‌రికీ తెలిసిందే అని మ‌హిళా మంత్రి విమ‌ర్శించారు. అండ‌న్‌లో తెచ్చుకున్న మందులు ప‌నిచేయ‌డం లేద‌ని ఆమె దెప్పి పొడిచారు.

మ‌హిళా మంత్రి సంధ్యారాణి గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద మార్కులు కొట్టేయ‌డానికే అని జ‌నాలు అంటున్నారు. త‌మ శాఖ‌ల‌కు సంబంధించిన ఫైళ్ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించ‌డంలో సంధ్యారాణికి 19వ ర్యాంక్ రావ‌డంతోనే త‌న ఫెయిల్యూర్ నుంచి త‌ప్పించుకోడానికి నోటికి ప‌ని చెప్పార‌ని జ‌నాలు సెటైర్స్ విసురుతున్నారు.

చంద్ర‌బాబు త‌న‌తో స‌హా మొత్తం 25 మందికి ర్యాంకులు ఇవ్వ‌గా, సంధ్యారాణి ఫ‌ర్మామెన్స్ ఎంత గొప్ప‌గా వుందో జ‌నానికి తెలిసిపోయింది. దీంతో వైఎస్ జ‌గ‌న్‌ను నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డం వ‌ల్ల, త‌న ర్యాంక్‌పై కంటే, దూష‌ణ‌ల‌పై ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించొచ్చ‌నే ఎత్తుగ‌డ వేశార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

12 Replies to “జ‌గ‌న్‌పై మ‌హిళా మంత్రి అవాకులు చెవాకులు అందుకా?”

  1. హి .. హి .. హి ..

    ఇవే మాటలు జగన్ రెడ్డి ప్రభుత్వం లో ఉన్నప్పుడు కొడాలి నాని, పేర్ని నాని, రోజా లాంటి వాళ్ళు భూతులు కూడా కలిపేసి అన్నప్పుడు..

    .. మన రాత.. కౌంటర్లతో చెలరేగారు..

    మరి.. చంద్రబాబు ప్రభుత్వం లో ఉన్నప్పుడు.. అవే మాటలు భూతులు వాడకుండా.. కొన్ని నిజాలు కూడా చెప్పినప్పుడు..

    .. మన రోత .. అవాకులు.. చెవాకులు..

  2. ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. “జ‌గ‌న్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌త్య‌ర్థుల నుంచి దీటైన కౌంట‌ర్లు రాలేదు”..trying to cover jagan?…lol

Comments are closed.