వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే త‌మ్ముడు?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే త‌మ్ముడు, దివంగ‌త మాజీ మంత్రి త‌న‌యుడు వైసీపీలో చేర‌నున్న‌ట్టు విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే త‌మ్ముడు, దివంగ‌త మాజీ మంత్రి త‌న‌యుడు వైసీపీలో చేర‌నున్న‌ట్టు విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌ద‌రు టీడీపీ యువ ఎమ్మెల్యేకి త‌మ్ముడు, త‌ల్లితో చాలా కాలంగా తీవ్ర విభేదాలున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందే అత‌ను వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ వీలు కాలేదు.

తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎమ్మెల్యే త‌మ్ముడు ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని వైసీపీ పెద్దాయ‌న అండ‌దండ‌ల‌తో జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకోడానికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే త‌మ్ముడు వైసీపీలో చేరితే, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌కు, పార్టీకి సంబంధించిన నాయ‌కుల‌తో గ్యాప్ ఉన్న‌ట్టు జ‌గ‌న్‌కు ఫిర్యాదులు వెళ్లాయి.

అయితే వైసీపీ ఇన్‌చార్జ్‌తో విభేదాలున్న నాయ‌కులంతా ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో చేరార‌ని అంటున్నారు. ఇప్పుడు ప్ర‌త్యేకంగా వైసీపీ ఇన్‌చార్జ్‌కు నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ నేత‌ల‌తో విభేదాలు లేవ‌నే చ‌ర్చకు తెర‌లేచింది. వైసీపీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆ ఇన్‌చార్జ్ వుంటే, క‌నీసం క‌ష్ట‌కాలంలో వెంట‌నే స్పందిస్తార‌ని గ్రామీణ వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇప్పుడిప్పుడే వైసీపీ పుంజుకుంటున్న త‌రుణంలో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్యే సోద‌రుడిని తీసుకొస్తే, వ‌ర్గాలు మొద‌ల‌వుతాయ‌ని, మ‌ళ్లీ స‌మ‌స్య మొద‌టికొస్తుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే త‌మ్ముడి చేరిక రాజ‌కీయంగా ఎలాంటి మ‌లుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కుంది.

15 Replies to “వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే త‌మ్ముడు?”

  1. ఫైర్ బ్రాండ్ లేదు.. వంకాయ బ్రాండ్ లేదు..

    మన పార్టీ లో నాయకులే లేరు.. ఎవరో ఒకరు ఇంటరెస్ట్ గా ఉంటె.. గబుక్కున లాక్కొచ్చి కండువా కప్పేసుకోండి..

    ఇలా నానిస్తే.. వాళ్ళు కూడా బీజేపీ కో, కాంగ్రెస్ కో పోతారు..

    ఎందుకొచ్చిన ఎక్సట్రాలు చెప్పు.. అర్జెంటు గా జగన్ రెడ్డి ని నగిరి కి బయల్దేరమను ..

    తాడేపల్లి పాలస్ కి అవిచ్చి కండువాలు కప్పించుకొనే.. రోజులు పోయాయి.. రోజులు మారాయి..

    1. నల్ల పిల్లి ని చంకనేసుకుని తిరుగుతున్నారు.. అదేమి దరిద్రమో ఆ పార్టీ కి..

  2. మీకసలు మనస్సాక్షి లేదా? వైయస్ చనిపోయాక వివేకాకి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తే “కుటుంబంలో చిచ్చు పెట్టారు” అని గొడవ చేశారు. ఇప్పుడు ఈ ఎంఎల్ఏ తమ్ముడు వైసీపీలో చేరితే మాత్రం తప్పు కనిపించదు

  3. ఇంట్లో వాళ్ళు బయటికి వెళిపోతే … మిగిలేది .. ఇలాగ బయట వాళ్ళ తమ్ముళ్లు చెల్లెలు ..

Comments are closed.