టీజర్ తో వచ్చేసాడు జాక్

జాక్ క్యారెక్టర్ డిఫరెంట్ గా వుండేచ్చేమో కూడా చూసేవారికి మాత్రం బాడీ లాంగ్వేజ్, మాట, స్టయిల్ మళ్లీ టిల్లు ను గుర్తుకు తెచ్చేలాగే వున్నాయి.

సిద్దు జొన్నలగడ్డ. టిల్లు పాత్రతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్, తనకంటూ ఓ జానర్ ను క్రియేట్ చేసుకున్నాడు. కానీ తరువాత ఏంటీ? కంటిన్యూగా అలాంటి సినిమాలే, పాత్రలే చేస్తూ వుండాలా? దీనికి ఆన్సర్ ముందు ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఓ క్లాస్ టచ్ సినిమా తెలుసుకదా..అలాగే ఒక మాస్ టచ్ సినిమా జాక్ చేస్తున్నాడు సిద్దు.

జాక్ టీజర్ వచ్చింది. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అనే మాట మాదిరిగానే వుంది టీజర్. కొడుకు చేసే పనేంటో తెలియక తల బాదుకుని, ఉరి వేసుకుంటా అని బెదిరించేంత వరకు వెళ్లే తండ్రి, తన లవర్ ఏం చేసినా, ఆశ్చర్యపోతూ క్వశ్చను చేస్తూ, థ్రిల్లింగ్ గా ఫేస్ పెట్టే లవర్, వీళ్లిద్దరి నడుమ నలిగిపోకుండా, సరదాగా, జోవియల్ గా లైఫ్ ను లాగించేసే హీరో. ఇదీ టీజర్ కంటెంట్.

జాక్ క్యారెక్టర్ డిఫరెంట్ గా వుండేచ్చేమో కూడా చూసేవారికి మాత్రం బాడీ లాంగ్వేజ్, మాట, స్టయిల్ మళ్లీ టిల్లు ను గుర్తుకు తెచ్చేలాగే వున్నాయి. అదే సినిమాకు సక్సెస్ మంత్ర అయితే అది వేరే సంగతి. ప్రస్తుతానికి వచ్చింది టీజర్ మాత్రమే. ఇంకా చాలా కంటెంట్ రావాల్సి వుంది. అప్పుడు మాట్లాడుకోవచ్చు.

One Reply to “టీజర్ తో వచ్చేసాడు జాక్”

  1. ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు,

Comments are closed.