సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ అంశంపై సోనూ సూద్ స్పందించాడు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందనే అంశంపై పోస్టు పెట్టాడు. అప్పుడు, ఇప్పుడు ఒకే మాట చెబుతున్నానని.. ఆ కేసుతో తనకు సంబంధం లేదని అంటున్నాడు.
ఓ ఛీటింగ్ కేసుకు సంబంధించి సాక్ష్యం ఇవ్వడానికి కోర్టుకు రాకపోవడంతో లూథియానా కోర్టు సోనూసూద్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలొచ్చాయి. దీనిపై సోనూ సూద్ స్పందించాడు.
“సోషల్ మీడియాలో నాపై వస్తున్న వార్తలు సెన్సేషన్ అవుతున్నాయి. అలాంటి వాటిపై క్లారిటీ ఇవ్వాలి. సూటిగా చెప్పాలంటే, ఆ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదా అనుబంధం లేదు. ఇలాంటి కేసులో న్యాయస్థానం మమ్మల్ని సాక్షిగా చేర్చి సమన్లు జారీ చేసింది. మా న్యాయవాదులు ఫిబ్రవరి 10న ఈ అంశంపై స్పందిస్తారు. మేము బ్రాండ్ అంబాసిడర్లం కాదు, ఆ కేసుతో మాకు ఏ విధంగానూ సంబంధం లేదు. ఇది కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశించినది. సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్ గా మారడం బాధాకరం. ఈ విషయంలో మేము కఠిన చర్యలు తీసుకుంటాం.”
లుథియానాకు చెందిన ఓ న్యాయవాదిని, మోహిత్ శర్మ అనే వ్యక్తి మోసం చేశాడు. రిజికా కాయిన్ పేరుతో దాదాపు 10 లక్షల రూపాయలకు తనను మోసం చేశాడని సదరు లాయర్ కోర్టుకెక్కాడు. ఈ కేసులో సోనూ సూద్ ను సాక్షిగా పేర్కొన్నాడు ఆ లాయర్.
ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదంటున్నాడు సోనూ సూద్. దీనిపై ఆగ్రహించిన కోర్టు, అతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. 10వ తేదీకి కేసు వాయిదా పడింది.
తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది nd cal
మన అన్నియ్య 5 ఏళ్ళు కోర్టుకి రాకపోయినా ఏ సమన్లు వుండవెందుకో ?
ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది,
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది