హహ్హ‌హ్హ‌…పవన్ పుండుపై బాబు కారం!

ప్ర‌ధాని స‌భ‌లో డిప్యూటీ సీఎంకు త‌న ప‌క్క‌న కుర్చీ వేయ‌క‌పోవ‌డంపై చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌! ఇలాంటి వార్త‌ల్ని ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం ఎవ‌రి కోసం?

చంద్రబాబు సర్కార్ అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణ ప‌నుల్ని ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభించింది. స‌భా వేదిక‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముభావంగా ఉండ‌డాన్ని అంద‌రూ గ‌మ‌నించారు. మ‌రీ ముఖ్యంగా వేదిక‌పై ప్ర‌ధాని మోదీకి ఇరువైపులా గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌, సీఎం చంద్ర‌బాబునాయుడు ఆసీనుల‌య్యారు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ విసిరేసిన‌ట్టుగా వేదిక‌పై మోదీకి దూరంగా కూర్చోపెట్టారు. ప‌వ‌న్‌కు ప్రాధాన్యం త‌గ్గింద‌నే ఆవేద‌న జ‌న‌సేన శ్రేణుల్లో క‌నిపించింది. అయితే అంతా అయిపోయిన త‌ర్వాత చంద్ర‌బాబునాయుడు కేబినెట్ స‌మావేశంలో , ప్ర‌ధాని స‌భ‌లో ప్రొటోకాల్‌పై ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. ఇది ఎలా ఉందంటే, అస‌లే త‌న‌కు ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని ఆవేద‌న‌తో ర‌గిలిపోతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సుకు అయిన పుండుపై కారం చ‌ల్లిన‌ట్టుగా వుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌ధాని స‌భ‌లో డిప్యూటీ సీఎంకు త‌న ప‌క్క‌న కుర్చీ వేయ‌క‌పోవ‌డంపై చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌! ఇలాంటి వార్త‌ల్ని ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం ఎవ‌రి కోసం? క‌నీసం బాబు ఉపాయాన్ని జ‌న‌సేన శ్రేణులు గుర్తిస్తున్నాయా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏదైనా వుంటే ప్రొటోకాల్ అధికారులు, సంబంధిత రాజ‌కీయ ముఖ్యులపై ఆగ్ర‌హించి, మ‌రోసారి ఇలా జ‌ర‌గ‌కుండా చూడాల‌ని అప్పుడే చెప్పి ఉండాల్సింది.

కానీ మీటింగ్ ఎప్పుడో జ‌రిగితే, ఇప్పుడు మ‌ళ్లీ కెల‌క‌డం విడ్డూరంగా వుంది. ప్ర‌ధాని స‌భ‌లో త‌మ నాయ‌కుడికి అవ‌మానం జ‌రిగింద‌ని జ‌న‌సేన శ్రేణులు ఆగ్ర‌హంగా ఉన్నాయ‌నే విష‌యం తెలిసి, చంద్ర‌బాబు ఈ ర‌కంగా మందు పూసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే మాట వినిపిస్తోంది. చంద్ర‌బాబు ఇలా అస‌హ‌నాలు, ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం.

కుడి, ఎడ‌మ క‌న్నులు ఒకేసారి వేర్వేరు వ్య‌క్తుల‌కు గీట‌గ‌లిగే రాజ‌కీయ నేర్ప‌రి చంద్ర‌బాబు. ప్రొటోకాల్ పాటించ‌డంలో హెచ్చుత‌గ్గుల‌పై తాజాగా చంద్ర‌బాబు క‌న్నుగీట‌డం దేనికి సంకేత‌మో అర్థం కావాల్సిన వాళ్ల‌కు అయితే బాగుంటుంది. మిగిలిందంతా ప్ర‌చారం కోసం, అలాగే జ‌న‌సేనే సంతృప్తి ప‌రిచేందుకే అని జ‌గ‌మెరిగిన స‌త్యం.

11 Replies to “హహ్హ‌హ్హ‌…పవన్ పుండుపై బాబు కారం!”

  1. ఒరినీ! ప్రదాని పక్కన కూర్చొ పెట్టలెదు అని నెను అలిగాను అని పవన్ నీకు చెప్పారా? దానికి ఇన్ని ఆర్టికల్స్ అవసరమా?

    .

    ఒబులాపురం స్కాం లొ మన శ్రిలక్ష్మి మీద విచరణ తిరిగి ప్రారంబించి 3 నెలలలొ రిపొర్ట్ ఇవ్వమని సుప్రీం కొర్ట్ చెప్పింది కదా! మరి రాశావా?

  2. ఒరినీ! ప్రదాని పక్కన కూర్చొ పెట్టలెదు అని నెను అలిగాను అని పవన్ నీకు చెప్పారా? దానికి ఇన్ని ఆర్టికల్స్ అవసరమా?

    .

    ఒబులాపురం స్కాం లొ మన శ్రిలక్ష్మి మీద విచరణ తిరిగి ప్రారంబించి 3 నెలలలొ రిపొర్ట్ ఇవ్వమని సుప్రీం కొర్ట్ చెప్పింది అంట! మరి రాశావా?

  3. హ! హ!! హ!!!! ప్రదాని పక్కన కూర్చొ పెట్టలెదు అని నెను అలిగాను అని పవన్ నీకు చెప్పారా? దానికి ఇన్ని ఆర్టికల్స్ అవసరమా?

    .

    ఒబులాపురం స్కాం లొ మన శ్రిలక్ష్మి మీద విచరణ తిరిగి ప్రారంబించి 3 నెలలలొ రిపొర్ట్ ఇవ్వమని సుప్రీం కొర్ట్ చెప్పింది అంట! మరి రాశావా?

  4. అందరూ అన్న మాదిరి …నాకు కుర్చీ ఇవ్వలేదు…నాన్ను మాట్లాడనివ్వలేదు అని చిల్లపిల్లోడు మాదిరి అలుగుతారు అనుకున్నావా?

  5. చంద్రబాబు కి ఒకేసారి ఇద్దరికీ కన్ను గీటడం మాత్రమే వొచ్చు.. అదే “మాడా మోహన” కి ఒకేసారి ఇద్దరితో దె0గించుకోవడం 

    “లెవెన్ తో పెట్టిన విద్య% అంటున్న ప్యాలెస్ వర్గాలు.

  6. 😂😂😂…..ఇప్పుడు నువ్వు ఎంత ఎడ్చిన use లేదు GA…..మన అన్నయ్య permanent గా లోపలికి వెళ్ళాక అప్పుడు యేడుస్తు నవ్వుదువు గానీ…..

  7. అరేయ్ G.A గా ఇన్ని ఆర్టికల్స్ రాస్తున్నావు గా , సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ అనేది,  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి హోదా కాబట్టి ప్రోటోకాల్ కరెక్టుగా ఉంది , నువ్వు చూసే చూపులే పచ్చకామెర్లు లాగా ఉన్నాయి 

  8. వీడు రాతలకు విలువ లేదు ఇక జీవితాంతం జగన్కు అధికారం లేదు వీడు ఎంత ఏడిస్తే వాడికే బీపీ షుగర్ వచ్చేస్తాయి

Comments are closed.