చంద్రబాబుకు తిరుమల వెంకన్న మార్కెటింగ్ ఎలిమెంటా?

అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి.. ఏప్రిల్ నెలలో పనుల పునఃప్రారంబం జరగబోతున్నది.

అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి.. ఏప్రిల్ నెలలో పనుల పునఃప్రారంబం జరగబోతున్నది. ఇప్పటికే మొదలై ఆగిపోయిన వాటితో పాటు, అనేక రోడ్లు ఇతర నిర్మాణాలకు సంబంధించిన పనులు శ్రీకారం దిద్దుకోబోతున్నాయి.

ఈ సందర్భంగా అమరావతికి అంతా మంచే జరగాలి అనే కోరికతో.. వెంకటాయపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానాల వారి వేంకటేశ్వర స్వామి ఆలయంలో.. శ్రీనివాస కల్యాణాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, గవర్నరు అబ్దుల్ నజీర్ కూడా పాల్గొన్నారు.

అంతా బాగానే ఉన్నది గానీ.. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే.. తిరుమల వేంకటేశ్వరస్వామిని, చంద్రబాబునాయుడు తన పరిపాలన గురించి పాజిటివ్ గా మార్కెట్ చేసుకోవడానికి ఒక ఎలిమెంట్ గా వాడుకుంటున్నట్టుగా ప్రజలకు అనిపిస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున.. అనేక ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరిపిస్తూ ఉంటారు. అదే తరహాలో అమరావతిలో కూడా జరిపించారు. కనుక కల్యాణం జరగడం గురించి పెద్దగా తప్పుపట్టేదేం లేదు. కానీ ఈ సందర్భంగా టీటీడీ చేసిన ఆర్భాటం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగితే.. ఏ స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయో.. ఆ స్థాయిలో వెంకటాయపాలెంలోని ఆలయంలో.. ఏర్పాట్లు చేశారు.

అదొక్కటే కాదు. రాజధాని పరిధిలోని 24 గ్రామాల్లో ప్రతి ఇంటికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసింది టీటీడీ యంత్రాంగం. ఈ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకోసం టీటీడీ ఏకంగా మూడువందల బస్సులు కూడా ఏర్పాటుచేసింది.

కల్యాణానికి హాజరైన ప్రతి ఒక్కరికీ లడ్డూ, పుస్తకప్రసాదం, కంకణాలు, పసుపుదారం, అన్నీ కలిపి ఒక బ్యాగులో కానుకగా అందించే ఏర్పాటు కూడా టీటీడీ చేసింది. ఇంత ఆర్భాటం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
అమరావతి పనులు పునఃప్రారంభం అయ్యే ముందు ఒకసారి కల్యాణం నిర్వహించదలచుకుంటే.. వారి ఆధ్యాత్మిక విశ్వాసాల పట్ల ఎవ్వరికీ అభ్యంతరం లేదు.

కానీ.. చంద్రబాబు ప్రభుత్వాన్ని అమరావతి ప్రాంతంలో బాగా మార్కెట్ చేసుకోవడానికి, ప్రజల దృష్టిలో మార్కులు కొట్టేయడానికి ఇది ఒక సందర్భంగా వాడుకున్నట్టుగా తెలుస్తోంది. టీటీడీ ఎన్నోచోట్ల శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తుంటుంది. కానీ ఆ ప్రాంతాల్లో ఇంటింటికీ ఆహ్వానపత్రికలు పంపడం అనేది ఎన్నడూ ఎరగం. ఫలానా రోజున కల్యాణం జరుగుతుందనే ప్రకటన వచ్చిన తర్వాత.. భక్తులే ఎగబడి ఆరోజున వస్తుంటారు.

అలా జరిగితే బాగుంటుంది గానీ.. ఇంటింటికీ ఆహ్వానపత్రికలు పంపి, 300 బస్సులు ఏర్పాటుచేసి మరీ.. జనాన్ని రాజకీయ బహిరంగసభకు తరలించినట్టుగా తరలించడం అనేది విమర్శల పాల్జేయకుండా ఏమౌతుంది? అందుకే ఈ కల్యాణం జరిగిన పిమ్మట.. తిరుమల వేంకటేశ్వరస్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక మార్కెటింగ్ ఎలిమెంట్ గా వాడుకుంటున్నారా? అనే అనుమానం పలువురికి కలుగుతుంది.

16 Replies to “చంద్రబాబుకు తిరుమల వెంకన్న మార్కెటింగ్ ఎలిమెంటా?”

  1. ఇంటి దొడ్లో గుడి సెట్టు వేసుకుని .. అతడు సినిమా పాటలు రీమిక్స్ వేసుకుని జగన్ రెడ్డి భజన చేస్తే.. నీ దృష్టిలో అది భక్తి భావం..

    ..

    ఇకనైనా జగన్ రెడ్డి లాంటి శకుని కళ్ళు పడకుండా .. అమరావతి ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ దేవదేవుని కళ్యాణం జరిపించడం.. నీ దృష్టిలో.. మార్కెటింగ్ ఎత్తులు..

    ..

    నీ పత్తిత్తు జర్నలిజానికి హాట్సోఫ్ ..

  2. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే దేవాలయం లో జరిగిన కళ్యాణం కి కొంత ఆర్భాటాలు జరిగాయి అనుకుందాం….దీన్నే అనుమానించిిిన ప్రజలు, పలువురు మరి గుడిని దేవుడిని ఇంటి పక్కనే సెట్టింగ్ వేయించి లేని విశ్వాసం, భక్తి ప్రదర్శించిన మన జగన్ దంపతులు ను అనుమానించలేదా ఆ పలువురు ప్రజలు?

  3. మరి గుడిని దేవుడిని ఇంటి పక్కనే సెట్టింగ్ వేయించి లేని విశ్వాసం, భక్తి ప్రదర్శించిన మన జగన్ దంపతులు ను అనుమానించలేదా ఆ పలువురు ప్రజలు?

  4. ఇందులొ మార్కెటింగ్ ఎముందిరా అయ్యా??

    సెకులర్ దెశంలొ గుడి ఎమిడి అంటవా? లెక శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని బాగా జరిపించారు అని ఎడుస్తున్నావా? అసలు నీ భాద ఎమిటి రా అయ్యా!

    .

    చూస్తుంటె మా జగన్ సతీసమెతంగా వచ్చి శ్రీనివాస కల్యాణం చెసెది లెదు కాబట్టి ఇంకెవ్వరూ చెయకూడదు అంటావా?

    అయినా చర్చులలొ పార్టి ప్రచారం చెస్తె కనపడని మార్కెటింగ్, ఇప్పుడు వచ్చిందా?

  5. ఆంధ్రా నీళ్ళని దోచుకోటానికి ముక్కోడు కట్టిన తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ( అవినీతి , నాసిరకం దోపిడీ కోసం ) నీచుడు జగన్ రెడ్డి వెళ్ళటం దుర్మార్గం కదా …

  6. Keeristaani vedha-va Ari-Katka gaadiki ekkado kaalinattu undi.

    Hindu-vula dabbutho Hinduvulu Kalyanam chesukunte Ja-Gqn laanti Lucchagaadi Chamchalaku kalthundi.

Comments are closed.