అమరావతి ప్రాంతంలో మొదలు కాబోతున్న ప్రభుత్వ భవనాలు, వివిధ సంస్థల కార్యాలయాలు, తదితర నిర్మాణాల విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం వైఖరి మారుస్తోందా? భూ కేటాయింపులను ఒక ఆర్థిక వనరు మార్గంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నదా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.
ఇదే చంద్రబాబునాయుడు ప్రభుత్వం గతంలో పరిపాలన సాగించినప్పుడు అమరావతి ప్రాంతంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులు తదితర సంస్థలకు, విద్యా సంస్థలకు భూములు కేటాయించింది. ఇప్పుడు అవన్నీ నిర్మాణాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.
అయితే ఆ సంస్థలు నిర్మాణానికి ముందుకు వస్తున్న ప్రస్తుత సమయంలో గతంలో జరిగిన భూ కేటాయింపులను సమీక్షించి తర్వాత స్థలాలు అప్పగిస్తాం అని ప్రభుత్వం చెబుతున్నది. ఒకసారి జరిగిన కేటాయింపులే.. మళ్లీ సమీక్షించడం అంటే.. ఆయా సంస్థలతో కొత్తగా డీల్ మాట్లాడుకోవాలని చూస్తున్నారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
చంద్రబాబు 2014-19 సర్కారు 135 కేంద్ర సంస్థలకు అప్పట్లో స్థలాలు కేటాయించింది. అవి ఇప్పటిదాకా పనులు మొదలు కాలేదు. మొదలు కాకపోవడం అనేది ప్రస్తుత ప్రభుత్వానికి డబుల్ ఎడ్వాంటేజీగా మారింది. జగన్ కారణంగా అమరావతి అభివృద్ధి స్తంభించిందని, ఈ నిర్మాణాలకు వారు ముందుకు రాలేదని నిందించే అవకాశం వచ్చింది.
అలాగే.. ఇప్పటికి టెక్నికల్ గా గడువులోగా నిర్మాణాలు పూర్తిచేయలేదు కాబట్టి.. పాత కేటాయింపు ఒప్పందాలను రద్దుచేసుకుని, కొత్తగా కేటాయిస్తాం అంటూ కొత్తగా డీల్ మాట్లాడుకోవడానికి వీలు కుదిరింది. గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు విడివిడిగా స్థలాలు ఇవ్వగా.. ఇప్పుడు అన్ని సంస్థల కార్యాలయాలను ఒకే భవనంలో ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
గతంలో స్థల కేటాయింపులు పొందిన హోటళ్లు, పాఠశాలలు అన్నీ ఇప్పుడు మళ్లీ ముందుకొస్తున్నాయి. ఇప్పుడు అమరావతి పనులను చంద్రబాబు వేగంగా నడిపిస్తున్న తరుణంలో.. భూముల విలువ ఖచ్చితంగా పెరిగినట్టే. ఈ నేపథ్యంలో కేటాయింపులను సమీక్షించడానికి ఒక మంత్రుల కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. కేటాయింపుల్ని సమీక్షించి.. అంతే భూములు ఇవ్వాలా.. తగ్గించాలా అని వారు నిర్ణయిస్తారట.
అంటే.. ఆయా సంస్థలతో కొత్తగా బేరాలు చేయడానికి ఇది ప్రభుత్వానికి ఒక అవకాశం అని.. ఈ కొత్త డీల్స్ ను తమకు ఆదాయవనరుగా మార్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేస్తున్నారేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు.
అసలు ప్రబుత్వరంగ సంస్తలతొ deal మాట్లడుకొవటం కుదురుతుందా గురువిందా?
.
ఆనాడు ఉన్నపరిస్తితులు, రెట్ల ఆదారంగా ఇక ప్రవెటు రంగ సంస్తలతొ భూమి కెటాయించారు. అయితె అవి గత 7 సంవస్చరాలలొ రాలెదు. ఇప్పుడు BITS తొ సహా అనెక దిగ్గజ సంస్తలు రావటనికి సిద్దం అవుతున్న ద్రుష్యా డిమాండ్ పెరిగింది. మరి సామీక్ష లెకుండా ఎలా ఇస్తారు?
అయినా జగన్ ప్రతిదీ రెవెర్సె టెడరింగ్ అంటూ నాశనం చెసిన నాడు ఇలా రాయెలెదె గురువిందా?
Why didn’t companies start work when they were allotted land? Since these companies are selfish, nothing wrong if Government does those tactics! Simple supply & demand rule!
అంటే పోలవరం పనులు నవయుగ నుండి మెగాకు కేటాయింపు కూడా అందుకే అంటావ్,
Jagan kaarananga abhibruddhi sthambinchindi ani nindinche avakasam raavatam enti ade kada jarigindi adi kakunda inko reason cheppu chuddam
So Anna ade chesaadu antaav
Jalagannaa vachina ventane anny reverse tenders e kadaa
Navaratnalu
Amaravathi kattadam valla evariki upayogam ledhu anthaa pre planned ga lands kabja chesaru tdp party vallu adhi kuda 80% kamma kulam vunna chota rajadhani kattaaru vote bank