సంపద సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు గొప్పగా చెప్పారు. సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబు మాటల్ని జనం విశ్వసించారు. అందుకే అలివికాని హామీలిచ్చినా, పెద్దాయన, విజనరీగా పేరొందిన చంద్రబాబు సంపద సృష్టించకపోతారా? అని జనం అనుకున్నారు. రాష్ట్రానికి రకరకాల పరిశ్రమలు క్యూ కట్టాయని, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని టీడీపీ అనుకూల మీడియాలో తప్ప, క్షేత్రస్థాయిలో ఏదీ కనించడం లేదన్న విమర్శ ప్రత్యర్థి పార్టీ నుంచి వస్తోంది.
ఈ నేపథ్యంలో బాబు సర్కార్ అప్పుల సృష్టి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతోంది. అదే సంపద సృష్టిగా సంతృప్తి చెందాలేమో అన్న నెటిజన్ల విమర్శల్ని తీసుకునే వాళ్లిష్టం. రానున్న మంగళవారానికి మరో రూ.5 వేల కోట్ల అప్పు చంద్రబాబు సర్కార్ చేయనుంది. ఈ అప్పుతో కలిపితే… ఆరు నెలల్లో చంద్రబాబు సర్కార్ సృష్టించిన అప్పు మొత్తం రూ.74,827 కోట్లు. ఒకవైపు అప్పు పెరిగిపోతోంది. మరోవైపు ప్రజలకు ఏమీ చేయలేదన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం కొత్తకాదు. కానీ గతంలో వైసీపీ ప్రభుత్వ అప్పులపై కూటమి నేతలు విపరీత, వికృత ప్రచారం చేయడం వల్లే నేడు, అధికారంలో ఉన్న వాళ్లు నిలదీతకు గురి అవుతున్నారు. ఆరు నెలలకే దాదాపు రూ.75 వేల కోట్లు అప్పులు చేస్తే, ఇక రానున్న నాలుగున్నరేళ్ల పాలనలో ఇంకెంత అప్పు చేస్తారో అనే భయం జనానికి పట్టుకుంది.
చంద్రబాబు విజనరీ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే ఆశిస్తే, ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణాన్ని చూడాల్సి వస్తోందన్న ఆవేదన ప్రజానీకంలో వుంది.
ఒరేయ్ చెప్పేదానికి ఉండాలిగా..FRBM లిమిట్ allow చేస్తుందా ఒక ఏడాది లో 75 వేల కోట్ల అప్పు చెయ్యడానికి?
గత ఐదు సంవత్సరాలలో తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేశారు, పది లక్షల కోట్లు అప్పు చేశారు అని మైకులు పెట్టి మొరిగారు అదంతా ఉత్తదే కదా బ్రో… ఏడాదికి 75 వేల కోట్లు అప్పు చేయడానికి FRBM ఒప్పుకోకపోతే గత ఐదు సంవత్సరాల్లో అంత అప్పు ఎలా చేశారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు బ్రదర్… మనం కుక్క ని చూపించి నక్కా అంటే అందరూ నక్కా అనాలి, మన మీడియా అంతా ఉందిగా కుక్కని నక్క చేయడానికి..
గత ఐదు సంవత్సరాలలో తొమ్మిది లేక పది కోట్లు అప్పు ఎలా చేశారు బ్రదర్… ఏడాది లో 75 వేల కోట్లు అప్పు చేయడం కుదరనప్పుడు. అదంతా మైక్ పెట్టి భాఖ ఊది అందరినీ భలే మోసం చేశారుగా
చంద్రిక పావని లు సూపర్ సిక్స్ స్కీమ్స్ అన్ని అమలు చేస్తే ఇంకా యెంత అప్పులు చేస్తారో ?
జగన్మోహిని చెప్పలేదా?
తప్పేంలేదు.. ముప్పేం లేదు… ఇంకో పక్క పెట్టుబడులు కూడా పోసిటీవ్ గానే వున్నాయి.. అప్పు తెచ్చినంత ఫాస్ట్ గా అభివృద్ధి కనపడదు..వైసీపీ పే..tm లకి కాకుండా విజ్ఞులయిన మిగతా వాళ్ళకి తెల్సు కాబట్టే 151 లో 5 తీసి పక్కన పెట్టారు.. ఈ సారి 11 లో 1 మాయం.ఇది confirm.
మాయం కరక్టే కాకపొతే ఏ పార్టీకి అన్నదే తేలాలి
Fake news …
tamariki elekkalu anni evaru chepparu ??
Slaves barking
జగన్ గాడు చేసిన పాలనా ఆలాఉంది , డెవలప్మెంట్ లేకుండా ఇన్కమ్ లేకుండా స్టేట్ ని నాశనం చేశాడు కదా రా !
Mari ippudu tdp government adhikaramlo vundhi 3 times cbn cm ayyadu sampadha yekkada srustinchadu
అయ్యా తమ అన్న గారు లక్షలకు లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు కనపడలేదా మీకు ? కనపడదు ఎందుకంటే ఆయన అసమదీయుడు కాబట్టి .
కూటమి వారు తసమదీయులు కాబట్టి వారి ఎంత చేసినా తమరి కంటి కి ఎక్కువనే కనిపిస్తుంది. అధికారం నుంచి దిగిపోవడానికి ఆరు నెలల ముందు పెద్ద పారిశ్రామిక సదస్సు నిర్వహించారు 13 లక్షల కోట్లు పెట్టుబడులు చూపించారు. మరి అందులో ఎంతమంది వచ్చి పెట్టుబడులు పెట్టారు ఎంతమంది పెట్టలేదు తెలియజేయగలరు.