ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా మొదటి రోజు 28వ తేదీన ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లారు. జగన్‌కు ప్రజాదరణ ఎవరూ ఊహించని విధంగా వెల్లువెత్తింది. తాడిపత్రి రోడ్లన్నీ జగన్ అభిమానులతో కిక్కిరిశాయి. జగన్ కారులో నిల్చుని, అభిమానులకు అభివాదం చేస్తూ జనసందోహం మధ్య ముందుకు సాగారు.
తాడిపత్రి ప్రజానీకం జగన్‌కు నీరాజనం పట్టింది. జగన్‌ను చూడగానే ఒక్కసారిగా అభిమానుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది. జగనన్నా అంటూ ఆప్యాయతతో జగన్‌ను పలకరించారు. జగన్ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించారు. జగన్‌కు బ్రహ్మరథం పట్టడం చూస్తే, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయనడంలో అతిశయోక్తి లేదు.
సిద్ధం, మేమంతా సిద్ధం యాత్రలు ముగించుకున్న తర్వాత… ఇది మొదటి ప్రచార యాత్ర కావడం విశేషం. తాడిపత్రిలో వైసీపీ కొంత బలహీనంగా వుందనే అభిప్రాయంతో జగన్ ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. కానీ జగన్ ప్రచార యాత్రకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే, 2019 నాటి ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేస్తోందనే చర్చకు తెరలేచింది.
జగన్‌పై జనంలో ఏ మాత్రం అభిమానం తగ్గలేదని ఆయనకు తాజాగా లభించిన ప్రజాదరణే నిదర్శనం.