కూట‌మిలో పిఠాపురం ముస‌లం త‌ప్ప‌దు!

ఇవ‌న్నీ రాబోయే రోజుల్లో కూట‌మిలో ముస‌లం పుట్ట‌డానికి దారి తీసే ప్ర‌మాద సంకేతాలు. రాజ‌కీయాల్లో పొత్తు శాశ్వ‌తం కాదు.

కూట‌మిలో పిఠాపురం కేంద్రంగా ముస‌లం త‌ప్ప‌ద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎందుకంటే అక్క‌డి నుంచి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయి తీవ్ర నిరాశ‌, నిస్పృహ‌లో ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు… చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్ట‌డం స‌వాల్‌గా మారింది. ఆ భ‌యం నుంచి పుట్టిందే టీడీపీతో క‌ల‌వాల‌నే ఆలోచ‌న‌. మ‌రోవైపు పొత్తు లేకుండా వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేమ‌ని చంద్ర‌బాబుకు కూడా భ‌యం వుండింది. ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకోడానికి రెండు భ‌యాలు క‌లిశాయి.

బీజేపీతో క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డి, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొంది అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్నారు. ఇంత వ‌ర‌కూ అంతా బాగుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడితో ఇంకా 15 ఏళ్లు క‌లిసే వుంటామ‌ని ఈ మ‌ధ్య అసెంబ్లీ వేదిక‌గా జ‌న‌సేన అధ్య‌క్షుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. క‌లకాలం క‌లిసి వుండాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పులేదు.

జీవితంలో చివ‌రి వ‌ర‌కూ క‌లిసి వుండాల‌ని పెళ్లిరోజు అగ్ని సాక్షిగా ప్ర‌మాణం చేసి, మూడు ముళ్ల బంధంతో ఏడ‌డుగుల న‌డ‌క‌తో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కొత్త జంట ప్రారంభించే నూత‌న జీవితంపై ఎన్నెన్నో ఆశ‌ల‌తో వుంటారు. కానీ ఒక‌ట్రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు కూడా మ‌న క‌ళ్లెదుటే వున్నారు. ఇదేమ‌య్యా అని ప్ర‌శ్నిస్తే, క‌లిసి రాలేద‌ని ఈజీగా చెబుతుంటారు.

రాజ‌కీయ జీవిత‌మైనా అంతే. ఎన్నెన్నో ఊహించుకుంటారు. కానీ ప‌రిస్థితులు క‌లిసి రాక‌పోతే, ఎప్పుడైనా విడిపోవాల్సి వ‌స్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య అంతా బాగున్న‌ట్టే పైకి క‌నిపిస్తోంది. కానీ లోలోప‌ల ఏదో జ‌రుగుతోంద‌నేందుకు… పిఠాపుర‌మే నిలువెత్తు నిద‌ర్శ‌నం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సోద‌రుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు లెగ్ మ‌హిమ‌. ఆయ‌న అడుగు పెట్టారంటే, కొంప‌కు మూడు వాకిళ్లు పెట్టాల్సిందే అని కూట‌మిలో చ‌ర్చ‌కు తెర‌లేచింది. పిఠాపురంలో టీడీపీ భాగ‌స్వామ్యం లేకుండా నాగ‌బాబు ప‌లు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. దీంతో జ‌న‌సేన‌కు వ్య‌తిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి.

ఇవ‌న్నీ రాబోయే రోజుల్లో కూట‌మిలో ముస‌లం పుట్ట‌డానికి దారి తీసే ప్ర‌మాద సంకేతాలు. రాజ‌కీయాల్లో పొత్తు శాశ్వ‌తం కాదు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప్రాతినిథ్యం వ‌హించే చోట స‌మ‌స్య త‌లెత్తిన‌పుడు, అది ఎక్క‌డికైనా దారి తీయొచ్చు. చ‌రిత్ర‌లో మ‌హా సామ్రాజ్యాలే కూలిపోయాయి. అందుకు ఎవ‌రో ఒక‌రు కార‌ణ‌మై వుంటారు. కూట‌మి విచ్ఛిన్నానికి ప్ర‌ధాన కార‌కుడు నాగ‌బాబు అవుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే నాగ‌బాబు వెనుక ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉండే, గేమ్ ఆడిస్తున్నార‌నే వాద‌న లేక‌పోలేదు. ఇక‌పై పిఠాపురం కేంద్రంగా రాజ‌కీయ సంచ‌ల‌నాలు చోటు చేసుకోనున్నాయనే వాద‌న‌ను కొట్టి పారేయ‌లేం.

8 Replies to “కూట‌మిలో పిఠాపురం ముస‌లం త‌ప్ప‌దు!”

  1. పాపం నీ కష్టం వర్మకి కూడా ఉండదు….రోజు పది ఆర్టికల్స్ రాసి ఏదో జరుగుతుందని నీ ఏడుపు

  2. నీ ఒంగోలు, విశాఖపట్నం ఎక్స్పీరియన్స్ తో అంతా నెగటివ్ గా ఊహించుకొంటున్నావు

  3. దూకుడుగా వెళుతున్న పిసిసి అద్యక్షరాలు ఇది ఏమి మా అన్నయ్య కి ముసలం కాదా అద్యచ్చా..

Comments are closed.