ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారనే నినాదాన్ని ఎత్తుకున్నారు. మరీ ముఖ్యంగా ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేశారనేది ఆయన ప్రధాన ఆరోపణ, నినాదం. ఈ నినాదం వెనుక బాబు ముందు చూపు వుంది. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడానికి కూడా జగనే కారణంగా చూపాలనేది ఆయన వ్యూహం.
రాష్ట్రానికి అడపాదడపా పరిశ్రమలు తీసుకొచ్చి …చూడండి నేను ఎంతో మందికి ఉపాధి కల్పించానని చెప్పాలని అనుకుంటున్నారు. ఇదే సందర్భంలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి, ఇదే రాష్ట్రాభివృద్ధిగా చూపాలనే ప్రయత్నాన్ని చూడొచ్చు. బహుశా ఇంతకంటే చేయడానికి చంద్రబాబు వద్ద మరో ఆలోచన లేనట్టుంది.
అయితే చంద్రబాబు అనుకున్నట్టు రానున్న ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? అంటే… అనుమానమే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే, సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్లో విపరీతమైన ఆశల్ని చంద్రబాబు పెంచారు. సమాజ అభివృద్ధి కంటే, వ్యక్తిగతంగా తమకు ప్రభుత్వం ఏం చేసిందనే జనం చూసే కాలం ఇది. అయితే జగన్ వ్యక్తిగతంగా భారీ సంక్షేమ లబ్ధి కలిగించారు కదా, మరి దారుణంగా ఎందుకు ఓడించారనే ప్రశ్న వేయొచ్చు. ఇదీ నిజమే.
కానీ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో జగన్ కంటే రెట్టింపు లబ్ధి కలిగిస్తానని హామీ ఇవ్వడాన్ని మరిచిపోవద్దు. ఉదాహరణకు రైతులకు భరోసా కింద ఏడాదికి రూ.20 వేలు. అలాగే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామనే హామీలిచ్చారు. వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు.
కానీ టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం… జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందనే సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లి, తద్వారా రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఏకైక ఎజెండాతో ముందుకెళుతోంది. ఇది రాజకీయ ఎజెండాగా మాత్రమే జనం చూస్తారు. వీటితో తమకేం సంబంధం అని జనం అనుకుంటారు. అందుకే చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ కావడం కష్టమే అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీకి మళ్లీ అధికారం దక్కాలంటే, సామాన్య ప్రజలకు చెప్పింది చేయడం ఒక్కటే పరిష్కారం. మిగిలినవేవీ పని చేయవని గుర్తించుకుంటే మంచిది.
nee moham
Veedu super six ani cheppadu..vallu bold ayyaru…
Ippudu reverse bold chestharu anthe…inevitable situation…mundu goyyi venuka nuyyi…
edo Oka dantlo padathaadu
తిప్పి తిప్పి అదే “ఆవు” కథ..
సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే చంద్రబాబు గెలవడు అనేది నీ పాయింట్..
మరి..99.99% హామీలు నెరవేర్చేసిన జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు లాగేసుకున్నారు అని అడిగితే మాత్రం సమాధానం ఉండదు..
..
ప్రజలకు కావాల్సింది ముష్టి కాదు..
స్వేచ్ఛ.. భవిష్యత్తు మీద భరోసా.. తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే సామర్ధ్యం.. తమ పిల్లలకు చదువు, ఆరోగ్యం, ఉద్యోగం..
డబ్బులు పంచుకుంటూ పోతే ఓట్లు పడతాయి అనుకుంటే.. ఈ ప్రపంచం లో ప్రభుత్వాలే మారవు.. అప్పులు తెచ్చయినా సంక్షేమం పేరుతో ఓట్లు కొంటారు..
..
ఈ మాత్రం ఇంకితజ్ఞానం లేకుండా వెబ్సైటు నడుపుతున్నాడు.. పార్టీ లు నడుపుతున్నారు..
అందుకేగా.. ఇప్పుడు మన సింగల్ సింహం కడప జిల్లా కార్పొరేటర్ల అప్పోయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నాడు ..
“డబ్బులు పంచుకుంటూ పోతే ఓట్లు పడతాయి అనుకుంటే.. ఈ ప్రపంచం లో ప్రభుత్వాలే మారవు.. అప్పులు తెచ్చయినా సంక్షేమం పేరుతో ఓట్లు కొంటారు..” -> well said bro.
Even we don’t need conduct the elections for every5 years and save that money if people vote of free schemes
మరి ప్రజలు సంక్షేమ పథకాలు కోరుకోకపోతే ఎందుకు సూపర్ 6 అని ప్రకటించారు, ప్రకటించకపోతే ప్రజలు ఓట్లు వెయ్యరు , అందుకని ప్రకటించాలి , ప్రకటిస్తే మనదేంపోతుంది , మహా అయితే అధికారం లోకి వస్తాం , వచ్చిన తర్వాత , ఇదిగో ఇలా అడ్డ సిద్ధంగా వాదించొచ్చు
ఇంట్లో ఆడోళ్ళ తాళి తెంచేస్తున్న మద్యాన్ని పూర్తిగా నిషేదిస్తాం అని చెప్పి జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చాక .. ఆ మద్యం డబ్బే సంక్షేమ పథకాలకు పంచినప్పుడు.. ఇదే ప్రశ్న అడగాల్సింది..
లక్షల కొద్దీ ఉద్యోగాలు ఖాళీ లు ఉన్నాయని చెప్పి.. ప్రతి జనవరి లో జాబ్ క్యాలెండరు అని ఊదరగొట్టి.. అధికారం లోకి వచ్చిన ఐదేళ్లు మెగా డీఎస్సీ ఇవ్వనప్పుడు.. ఇదే ప్రశ్నతో నిలదీయాల్సింది..
..
2019 లో జగన్ రెడ్డి కి అధికారం కావాలి.. అందుకు జగన్ రెడ్డి అలవిగాని హామీలు ఇచ్చాడని తెలిసినా జనాలు జగన్ పైన సింపతీ తో అధికారం ఇచ్చారు..
..
2024 లో చంద్రబాబు కి అధికారం కావాలి.. అందుకు చంద్రబాబు అలవిగాని హామీలు ఇచ్చాడని తెలిసినా జనాలు జగన్ పైన ద్వేషం తో మళ్ళీ చంద్రబాబు నే నమ్ముకొన్నారు..
..
రెండు సందర్భాల్లో ప్రజలకు తెలుగు.. సంక్షేమం అనేది అవసరం కొద్దీ ఇస్తారు గాని.. ఇల్లు ఒళ్ళు అమ్ముకుని ఇవ్వరు అని తెలుసు..
ప్రజలు ఓట్లు వేసేది ముష్టి కోసం కాదు.. భవిష్యత్తు కోసం..
జగన్ రెడ్డి కి ఒక అవకాశం ఇచ్చి చూసారు.. దరిద్రం కళ్ళ చూసారు.. అందుకే చంద్రబాబు కే పట్టం కట్టారు..
ఇలా డొంక తిరుగుడు సమాధానం చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చు
ఇప్పుడు చంద్ర బాబు మద్యం షాపుల్లో మద్యం తో పాటు తాళి కూడా ఇచ్చి పంపిస్తున్నాడా?
పోనీ ఎన్టీఆర్ మద్యనిషేధాన్ని , చంద్ర బాబు ఎత్తేసినప్పుడు మద్యంతో పాటు తాళి కూడా ఏమన్నా ఇచ్చాడా ?,ఆ వచ్చిన మద్యం డబ్బులతో ఏమైనా అభివృద్ధి చేశాడా పోనీ ఇప్పుడు వస్తున్న మద్యం డబ్బులతో ప్రజలకు పెన్షన్ పంచడం కాకుండా ఇంకేమైనా అభివృద్ధి చేశాడా ? మద్యం షాపుల వాళ్లకి 20% మార్జిన్ అని చెప్పి టెన్ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు, దీని మీద కూటమి కార్యకర్తలే దుమ్మెత్తి పోస్తున్నారు, ఏమిరా ఈ దరిద్రం, 6 నెలలు కూడా కాలేదు ఇలాంటి దారిద్య్రాన్ని చూస్తున్నాము అని వాపోతున్నారు
చంద్రబాబు అలవిగాని హామీలు ఇవ్వడం తో పాటు అలవికాని అసత్య ప్రచారం చేసారు , ప్రజలను మభ్య పెట్టి భయపెట్టి ఇంకా ఏవేవో చేసి అధికారం లోకి వచ్చారు ..అధికారం లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలని నెరవేర్చలేక..ప్రజలకి సంక్షేమ పథకాలు అవసరం లేదు అని డొంకతిరుగుడు సమాధానాలు అడ్డదిడ్డంగా వాదించడం.
సంక్షేమం అనేది అవసరం కొద్దీ ఇస్తారు అని ప్రజలకి తెల్సు కాబట్టే, పసుపు కుంకుమ అని ప్రజలని ఎర్రోళ్ళని చెయ్యాలని చూసారు , ప్రజలు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు , నాయకుడు ఎవరైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే తగిన సమాధానం చెబుతూనే ఉంటారు
మీ కామెంట్స్ చదువుతుంటే.. నా కామెంట్స్ ని సమర్ధిస్తున్నట్టే ఉంది..
గుడ్.. థాంక్స్..
చంద్రబాబు మధ్య నిషేధం చేస్తానని ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు.. అందుకే మీ పాయింట్స్ ఇన్ వాలిడ్ ..
..
చంద్రబాబు అధికారం లోకి వచ్చిన 6 నెలల్లోనే మీరు విపరీతమైన మార్పు ని ఆశిస్తున్నారు.. మరి జగన్ రెడ్డి ఐదేళ్లు ఎందుకు నిద్రపోయారు.. అందుకే 11 ఇచ్చారు జనాలు..
..
చంద్రబాబు అబద్ధాలు చెప్పాడు అని నువ్వు అనుకుంటే సరిపోదు.. ప్రజలు అనుకోవాలి..
అందుకే జగన్ రెడ్డి ని ఒక అబద్ధాలకోరు గా గ్రహించి బెంగుళూరు వరకు తరిమి కొట్టారు..
..
పసుపు కుంకుమ అయినా.. జగన్ రెడ్డి లక్షల కొద్దీ సంక్షేమం అయినా.. ప్రజలకు అవసరం అయినా వరకే చేయాలి..
డబ్బులతో ఓట్లు కొంటె.. 2019 లో చంద్రబాబు ఓడిపోయాడు.. 2024 లో జగన్ రెడ్డి ఓడిపోయాడు..
..
మీరు ఆవేశం లో మీ అవివేకాన్ని చక్కగా చూపించుకొన్నారు.. రెస్ట్ తీసుకోండి..
కామన్ సెన్స్ పని చెయ్యనప్పుడు నీలాగే అడ్డంగా వాదిస్తారు , అలాంటప్పుడు ఉత్తముడి లక్ష్యం సైలెంట్ గ ఉండడమే
సమాధానం లేనప్పుడు ఉత్తముడు గా చెప్పుకుని పారిపోవడం.. నీలాంటోళ్ళ లక్షణం..
Super 6 ఎవ్వడూ అడగటం లెదు ఒక్క Y.-.C.-.P తప్ప!
రాజాదాని మొదలు అయ్యింది, Center నుండి నిదులు వస్తున్నాయి, పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి, రొడ్లు వెస్తున్నారు, పొలవరం కూడా మొదలు అవ్వబొతుంది త్వరలొ! పరిపాలన భ్రమండంగా ఉంది!
మేనిఫెస్టో లో చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా 99% అమలుచేసి ఇంటింటికి, ప్రతీ వొంటికి పథకాలు ఇచ్చినా పథకాలు తీసుకున్న ప్రజలకు మావోడి మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం లేకుండా నిర్దాక్షిణ్యంగా “11 రాగం” ఆలపించారు.
చంద్రబాబు పథకాలు అమలు చెయ్యకపోతే ఎలక్షన్స్ లో ఓడిపోతాడని
“గ్యాస్ ఆంధ్రా” గాడు మా A1తింగిరోణ్ణి మభ్యపెట్టాలని కుట్ర చేస్తున్నాడు ..
మాకు తెలియదా?? పథకాలు తీసుకునే ప్రజలు కాదు ఓట్లసేది.. EVMలు” అని..
మావోడు ఓడిపోయిన రోజే ఈ విషయం క్లియర్ గా చెప్పాడు. అవునా కాదా netizenuluu??
చస్.. ఓట్లు తెచ్చేది పథకాలు కాదు..
కేవలం మావోడి “అతి మంచితనం” & “అతి నిజాయితీ”
5 ఏళ్ళు “గట్టిగా కళ్ళు మూసుకోవడం” ఇవి మాత్రమే మనల్ని మళ్ళీ అధికారం వైపు నడిపిస్తాయి..
ఎంతమంది ఒప్పుకుంటారు??
Don’t worry after 5 years also same statements. no change…

Last year lo super six implement chesi. Jagan pettina penta ippatiki clear chesam. Pathakalu start chesam. Ivvi nirvignamga saagalante, malli maake vote veyyandi ante, Jagan em chestadu?
వైసీపీ అధికారంలో ఉన్నపుడే కూటమి ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసి గెలిచేసింది అని ఏడ్చారు, మరి ఇప్పుడు కూటమి అధికారం లో ఉండి ట్యాంపరింగ్ చేసి గెలవలేదు అని ఎలా అనుకుంటున్నావ GA
Nuvvu script writers ni sakshi office ki return chey, lekapoty website muusey
భయంతో బెంగ..ళూరు పారిపోతున్నది ఎవరు అధ్యక్షా?
భయమా?? Single సింహం ఇక్కడా..! భయానికి మీనింగ్ కూడా తెలియని పరదాల బ్లడ్ and చెట్లు నరికించే బ్రీడ్