సిఎమ్ తో మీటింగ్- శుభం కార్డ్

సంధ్య థియేటర్ ఉదంతం ఈ మొత్తం సినిమాకు క్లయిమాక్స్ అనుకుంటే, ఈ రోజు జరిగే సమావేశం శుభం కార్డు లాంటిది.

ఇప్పటి వరకు టాలీవుడ్‌కు తెలంగాణలో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. విభజనకు ముందు టాలీవుడ్ కాస్త టెన్షన్ పడిన మాట వాస్తవం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరలిపోతుందనే వదంతులు పుట్టిన మాట అంతకన్నా వాస్తవం. కానీ ఎటువంటి కుదుపు లేకుండా పరిశ్రమ ముందుకు సాగిపోతోంది. నిజానికి 2019 నుంచి 2024 మధ్యలో ఏపీలో కన్నా తెలంగాణలోనే మంచి కంఫర్ట్ తో సినిమా పరిశ్రమ ముందుకు సాగింది. కావాల్సిన రేట్లు, పర్మిషన్లు వచ్చాయి. నిజానికి పరిశ్రమకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు.

ఒకప్పుడు అంటే సబ్సిడీలు, షూటింగ్ పర్మిషన్లు అలాంటి లెక్కలు వుండేవి. ఇప్పుడు అవేమీ లేవు. కావాల్సిందల్లా, అవసరమైనపుడల్లా అదనపు రేట్లు, అదనపు ఆటలు. ఇవి మాత్రమే. అవి అవసరం లేనపుడు ఎగ్జిబిటర్లు, నిర్మాతలు వాళ్లే తగ్గించేసుకుంటున్నారు. అందువల్ల ప్రభుత్వం చేతిలో వున్న పవర్ రేట్లు, షో లు.

ఏపీలో 2019 నుంచి 2024 మధ్యలో ఈ పాయింట్ నే సమస్య అయింది. థియేటర్ టికెట్ రేట్లు బాగా తగ్గిపోయాయి. అదనపు ఆటలు లేవు. అదనపు రేట్లు అంటే మహా అయితే 50 నుంచి 75 రూపాయలు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో టాలీవుడ్ కు సమస్య లేకుండా అయింది. దేవర, పుష్ప 2 సినిమాలకు కావాల్సిన రేట్లు వచ్చాయి షో లు వచ్చాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కూడా టాలీవుడ్ కు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతకు ముందు వున్న రేట్లు అలాగే వున్నాయి. కావాల్సిన వారికి అదనపు ఆటలు, రేట్లు వస్తున్నాయి. నిజానికి మరో ఫిలిం సిటీని నిర్మిస్తామని ప్రభుత్వం వైపు నుంచి వార్తలు కూడా వినవచ్చాయి.

ఇలాంటి టైమ్ లో, రెండు రాష్ట్రాల్లో అంతా బాగుంది అనుకున్న టైమ్ లో, తెలంగాణలో తేడా వచ్చింది. ఇది ప్యూర్ యాక్సిడెంటల్. ఎవరూ కావాలని క్రియేట్ చేసింది కాదు. ఇవతలి వాళ్లు చేసింది అవతలి వాళ్లకు నచ్చలేదు. మధ్యలో దీన్ని యాగీ చేసే వాళ్లు చేసారు. దాంతో ప్రభుత్వం పంతాలకు వెళ్లింది. ఒక విధంగా ప్రభుత్వాన్ని, అధికారులను రెచ్చగొట్టినట్లు అయింది. అదే సమయంలో వాళ్లు అదే దిశగా వెళ్లేటట్లు చేసినట్లు అయింది.

మొత్తానికి కథ ఇప్పుడు దాదాపు సుఖాంతం అయింది. అల్లు అర్జున్ – సంధ్య థియేటర్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లే అని మూడు నాలుగు రోజుల ముందే గ్యాసిప్ లు చక్కర్లు కొట్టాయి. బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేస్తారు అంటూ ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చినా, అలా జరగకపోవడం, అదే సమయంలో నేషనల్ మీడియా బన్నీకి మద్దతుగా నిలవడం, దిల్ రాజు రంగప్రవేశం చేసి, అన్నీ సర్దుబాటు చేసే పనులు మొదలుపెట్టడం, ఇవన్నీ చూసి కొంత రాజీ ప్రయత్నాలు జరిగినట్లు అర్థమైంది.

ఇప్పుడు టాలీవుడ్ బృందం నేరుగా సిఎమ్ ను కలవబోతోంది. కచ్చితంగా అన్ని అంశాలు చర్చకు వస్తాయి. చర్చలు డిప్లమాటిక్ గా వుంటాయి కనుక మనసులోని మాటలు ఇరు వైపులా బయటకు రావు. ప్రీమియర్లు వేయడం వల్ల వచ్చే సమస్యలను ప్రభుత్వం వివరిస్తుంది. వాటిని ఎలా అధిగమించాలి అనే దాని మీద చర్చ వుంటుంది. అదనపు రేట్లు అన్న దాంట్లో ప్రభుత్వానికి పెద్దగా పట్టుదల ఏమీ వుండదు. అదనపు రేట్ల వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయమే కదా.

అందువల్ల అర్థరాత్రి ప్రీమియర్లు, అలాగే అలాంటి ప్రీమియర్లకు హీరోలు రావడం, ఇలాంటి వాటి మీద ఓ పరస్పర అవగాహనకు వచ్చే అవకాశం వుంది. సంధ్య థియేటర్ ఉదంతం ఈ మొత్తం సినిమాకు క్లయిమాక్స్ అనుకుంటే, ఈ రోజు జరిగే సమావేశం శుభం కార్డు లాంటిది.

8 Replies to “సిఎమ్ తో మీటింగ్- శుభం కార్డ్”

  1. టికెట్ రేట్లు పెంచుకోవడానికి and బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు డ్రామా దె0గితే మండదా??

    అదే మా 11 గాడు అయ్యుంటే, ‘పుష్పకి ‘ఈపాటికే బాత్రూంలో గు0డెపోటు తెప్పి0చేవాడు తె’లుసా??

Comments are closed.