బాబును రోమ్ చ‌క్ర‌వ‌ర్తితో పోల్చుతూ…!

బాబు గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతాంగం చాలా క‌ష్టాల్లో వుంది. క‌ర‌వు అంటే…వ‌ర్షాలు ప‌డ‌క‌, పంట‌లు పండ‌క పోవ‌డం మాత్ర‌మే కాదు. పండిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర ల‌భించిక‌, వ్య‌వ‌సాయం లాభ‌దాయ‌కం కాక‌పోవ‌డాన్ని కూడా క‌ర‌వుగా రైతాంగం చెబుతోంది. ఈ నేప‌థ్యంలో కార‌ణాలేవైనా పంట‌లు గిట్టుబాటు ధ‌ర‌ల్లేక అల్లాడిపోతున్నారు. ఈ విష‌య‌మై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా సీఎం చంద్ర‌బాబును గ‌ట్టిగా నిల‌దీస్తూ, పోస్టు పెట్టారు.

ఇందులో ధ‌ర్మ‌మా? న్యాయ‌మా? అంటూ సీఎం బాబును జ‌గ‌న్ నిల‌దీశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పంట‌లు గిట్ట‌బాబు కాక‌పోవ‌డంతో వివిధ ర‌కాల రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న వీడియోల్ని ఆయ‌న షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు స‌ర్కార్‌ను జ‌గ‌న్ నిల‌దీసిన వైనం గురించి తెలుసుకుందాం.

“బాబు గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా?

మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశ‌నగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?

చంద్రబాబు గారూ…, మిర్చి విషయంలోకూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?

ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?” అని ఆయ‌న నిల‌దీశారు.

పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు ల‌భించ‌క‌, వ్య‌వ‌సాయం న‌ష్ట‌దాయ‌క‌మైన నేప‌థ్యంలో, రైతుల‌కు అండ‌గా వైసీపీ ఆధ్వ‌ర్యంలో జూన్‌లో వైసీపీ నేతృత్వంలో ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని ఇటీవ‌ల జ‌గ‌న్ త‌న పార్టీ జిల్లా అధ్య‌క్షుల స‌మావేశంలో సూచించారు. ఈ లోపు ప్ర‌భుత్వం మేల్కోక‌పోతే., రైతుల్లో వ్య‌తిరేక‌త‌ను తెచ్చుకోవ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

32 Replies to “బాబును రోమ్ చ‌క్ర‌వ‌ర్తితో పోల్చుతూ…!”

  1. మరి ఈ అయ్యగారు….ఊరికే బెంగళూరు ప్యాలెస్ లో పిసుక్కొకపోతే…రైతుల తరుపున పోరాటం చేయొచ్చుగా,? అప్పుడెప్పుడో గుంటూరు మిర్చి యార్డు లో ఒక గంట డ్రామా తప్ప రైతుల తరుపున ఈన కానీ పార్టీ కానీ పోరాడినట్లె లేదు

  2. Annamayya dam.kottukupothe annaya em chesadu…???

    2023’24 formers pending amounts anni kootami govt pay chesimdi.. 980 crores.

    Annaya nidrapoyadaa??

  3. ఈ అబద్ధాల చెత్త రాసే బదులు.. పాలస్ లో కూర్చుని రామకోటి రాసుకుంటే.. కాస్త పుణ్యమైనా దక్కుతుంది కదా..

    హిందువుల ఓట్లు నాలుగు పడతాయి కూడా ..

    ..

    అమరావతి హంగామా టీవీ లో చూసి ఉంటాడు.. కడుపు ఉబ్బరం పెరిగిపోయింది..

    కడుపులో మంట రగిలిపోయి ఉంటుంది..

    అది ఇలా అబద్ధాలతో కక్కేసాడు..

    1. Boss leave about jagan comments, It is not false news , In my village also people are suffering for tobaco price.This year total charges are increased more but finally price is very less, Not only tobaco even other dall related crops also. It seems like government peoples involved with buyers. Just think why this year all the crops prices reduced in the market.

      1. మన జగన్ రెడ్డి ట్వీట్ వదలగానే.. PAYTM కార్యకర్తలు దిగిపోతారు..

        అవును మా ఊర్లో కూడా చాలా కష్టాల్లో ఉన్నారు అంటూ వంత పాడి భజన చేస్తుంటారు..

        ఎన్నికలకు ముందు కూడా..

        నేను టీడీపీ అభిమానిని.. నా ఆఫీస్ లో హార్డ్ కోర్ టీడీపీ జనాలు కూడా వైసీపీ కె ఓటు వేస్తాము అంటున్నారు..

        మా ఊర్లో వంద మందిని అడిగాను.. అందరూ జగన్ సంక్షేమం అంటే చాలా ఆనందం గా ఉన్నారు.. జగన్ కి ఈ సారి 175 కొట్టడం చాలా తేలిక..

        అంటూ..

        చెత్త కామెంట్స్ రాసేవాళ్ళు..

        ఇంత చెత్తగా ఓడిపోయాక కూడా.. స్ట్రాటజీ మార్చుకోకపోతే ఎలా.. రాఘవా..?

        1. Adi ne batuku, ITDP vallu iche salary tho batukutu unnatu enjoy cheyi, proofs kavali anete kuda last year tobaco price copy and e year tobaco price copy ITC vallu konndi pedatanu. Check chesuko.

          1. నీకు ఎందులో వస్తుందో.. నాకు కూడా అందులోనే వస్తుంది..

          2. రాఘవ బ్రో, పొగాకు ధర ఎంత పలుకుతోంది? కమర్షియల్ పంటలకి మద్దతు ధర ఉంటుందా బ్రో?

        2. Adi ne batuku, ITDP vallu iche salary tho batukutu unnatu enjoy cheyi, proofs kavali anete kuda last year tobaco price copy and e year tobaco price copy ITC vallu konndi pedatanu. Check chesuko

      2. Correct ye mastaru , rice 70 vundedi kg ippudu 50 ki vachindi. So cbn aina emi chestaru ?? Demand and supply .

        L11 aithe eepatiki rates taggincha ani banner vese vadu sakshi lo

        Ans also tomato 200 kg aindi l 11 rule lo ante adi l 11 goppatanam aa ippudu 10 rs aithe cbn tappa ??

        1. అందుకేనా.. వెనకబడి ఏడుస్తున్నావు..

          ఈ రాతలేవో డైరెక్ట్ గా రాసే దమ్ములేని ముండమొపివి.. కొజ్జాగాడెవడో ప్రత్యేకం గా చెప్పాలా..?

  4. Agree, ఈసారి ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి అదే సమయంలో పంటలు కూడా బాగా పండాయి, demand and supply matters.

  5. Super జగన్ మావయ్య. Next assembly session ki attend ayyi nuvvu అధికార పక్షాని వీటి గురించి నిలదీయాలని కోరుకుంటున్నా. ఇట్లు నువ్వు స్కాం లు , మర్డర్ lu చేసినా maa kosame ani నమ్మే నీ కొండ గొర్రె అభిమానిని

  6. నేను మొన్న మెసేజ్ పెట్టాను జగన్ రెడ్డి లాంటి ఓకే నీచిడు ని దేంతో కంపేర్ చేయాలన్న ఏది దొరకట్లేదు అని, నా మెసేజ్ చూసి ఆర్టికల్ రాసేసునట్టు ఉన్నాడు.

    1. రైతు భరోసా కేంద్రాలను కూటమి బ్రష్టు పట్టించింది. Crop insurance రైతు కు ఖర్చు లేకుండా ప్రభుత్వం చేసేది ఇప్పుడు దానిని తీసేసారు. గిట్టుబాటు ధరలు లేవు. మిర్చి గిట్టుబాటు ధర కల్పించలేకపోయిన చేతకాని ప్రభుత్వం. Worst political governance.

  7. రైతు భరోసా కేంద్రాలను కూటమి బ్రష్టు పట్టించింది. Crop insurance రైతు కు ఖర్చు లేకుండా ప్రభుత్వం చేసేది ఇప్పుడు దానిని తీసేసారు. గిట్టుబాటు ధరలు లేవు. మిర్చి గిట్టుబాటు ధర కల్పించలేకపోయిన చేతకాని ప్రభుత్వం. Worst political governance.

  8. రైతు భరోసా కేంద్రాలను కూటమి బ్రష్టు పట్టించింది. Crop insurance రైతు కు ఖర్చు లేకుండా ప్రభుత్వం చేసేది ఇప్పుడు దానిని తీసేసారు. గిట్టుబాటు ధరలు లేవు. మిర్చి గిట్టుబాటు ధర కల్పించలేకపోయిన చేతకాని ప్రభుత్వం. Worst political governance.

  9. రైతు భరోసా కేంద్రాలను కూటమి బ్రష్టు పట్టించింది. Crop insurance రైతు కు ఖర్చు లేకుండా ప్రభుత్వం చేసేది ఇప్పుడు దానిని తీసేసారు. గిట్టుబాటు ధరలు లేవు. మిర్చి గిట్టుబాటు ధర కల్పించలేకపోయిన చేతకాని ప్రభుత్వం. Worst political governance.

Comments are closed.