అమరావతి రీస్టార్ కోసం తరలి వచ్చిన ఎన్నారైలు!

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు విదేశాల నుంచి టీడీపీ ఎన్నారై నేతలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.

అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు విదేశాల నుంచి టీడీపీ ఎన్నారై నేతలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.

అమెరికా, గల్ఫ్ దేశాలు (సౌదీ అరేబియా, కువైట్, బెహ్రయిన్, దుబాయ్, కతర్, ఒమన్), యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా దేశాల నుంచి ఎన్నారైలు అమరావతికి తరలివచ్చారు.

ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, గల్ఫ్ ఎన్నారై టీడీపీ అధ్యక్షులు రాధాకృష్ణ, ఎన్నారై గల్ఫ్ కంట్రీస్ నేతలు రహమతుల్లా, బాషా, బాలకృష్ణ, మరియు పలువురు ఎన్నారై టీడీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎన్నార్టీ ఐకాన్ టవర్స్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీ వంటి డైనమిక్ లీడర్ చేతుల మీదుగా ఎన్నార్టీ ఐకాన్ టవర్స్ నిర్మాణ పనులు రీలాంచ్ కాబోతుండడం ఎన్నారైలకు గొప్ప గౌరవమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. ఐకాన్ టవర్స్ ప్రాజెక్టు రీలాంచ్ కాబోతుండడంపై ఏపీ ఎన్నార్టీ ఎక్స్ ఛైర్మన్ డాక్టర్ రవి వేమూరు హర్షం వ్యక్తం చేశారు.

8 Replies to “అమరావతి రీస్టార్ కోసం తరలి వచ్చిన ఎన్నారైలు!”

  1. మాకు తెలిసిన ఒకాయన అమెరికా లో సెటిల్ అయ్యారు. పేరు చివర రెడ్డి వింటుంది. 

    వారు కూడా అమరావతి చుట్టూ పక్కల పెట్టుబడి పెట్టారు. 

    గ్రేట్ ఆంధ్ర చెప్పినట్లు కులగజ్జి తో లేదు.

     అమరావతి అందరిదీ.

  2. జగన గాడికి ఉన్నంత కుళ్ళు ఎవడికి ఉండదు. చివరికి వాడికి సొంత చెల్లి బాగుపడి నా కూడా తట్టుకోలేని సైకో.

Comments are closed.