ప‌క్క‌న పెట్టాల్సిన నాయ‌కులు… జ‌గ‌న్ ప‌క్క‌నే!

ప్ర‌స్తుతం చుట్టూ ఉన్న టీమ్‌ను ప‌క్క‌న పెడితే త‌ప్ప‌, లోపాల్ని గుర్తించ‌డం, వాటిని స‌రిచేసుకోవ‌డం సాధ్యం కాద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

ఈ ద‌ఫా గెలుపు త‌ప్ప‌, మ‌రేదీ ప్రాధాన్య‌త‌గా పెట్టుకోవ‌ద్ద‌ని వైఎస్ జ‌గ‌న్ గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం స‌రైందే. ముందు అధికారంలోకి వ‌స్తే, అంద‌రూ చుట్టూ వుంటారు. రాజ‌కీయాల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధి. ఇందులో రెండో అభిప్రాయానికి చోటు లేదు. ఇప్ప‌టి నుంచే వైసీపీలో ఏరివేత‌కు జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు రానున్న ఎన్నిక‌ల్లో టికెట్ గ్యారెంటీ లేదు.

ఈ నేప‌థ్యంలో ప‌క్క‌న పెట్టాల్సిన నాయ‌కులు… జ‌గ‌న్ ప‌క్క‌నే ఉన్నార‌ని, ఎవ‌రు చెపితే ఆ ప‌ని చేస్తారో అని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆరా తీస్తున్నారు. కొంద‌రు స‌ర్వేల పేరుతో ప్ర‌జాభిప్రాయాన్ని ఉన్న‌ది లేన‌ట్టు, లేనిది ఉన్న‌ట్టుగా జ‌గ‌న్‌కు చూపి, ఆయ‌న్ను భ్ర‌మ‌లో పెడుతున్నార‌నే చ‌ర్చ వైసీపీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది. ఇలాంటి వాళ్లే వైసీపీకి, జ‌గ‌న్‌కు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌నేది వైసీపీ శ్రేణుల భావ‌న‌.

ఇదే సంద‌ర్భంలో ఏ విష‌యాన్నైనా నేరుగా జ‌గ‌న్‌తో చ‌ర్చించ‌డానికి మ‌ధ్య‌వ‌ర్తులనే అడ్డుగోడ‌ను కూల‌గొట్టాల‌ని వైసీపీ నాయ‌కులు కోరుకుంటున్నారు. జ‌గ‌న్‌తో త‌మ గోడు చెప్పుకోడానికి స‌ల‌హాదారులు, ఇత‌రులు ఎందుక‌నే ప్ర‌శ్న నాయ‌కుల నుంచి వ‌స్తోంది. ఈ విష‌యం జ‌గ‌న్‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌ని కోరుకునే వాళ్ల సంఖ్య ఎక్కువే.

అలాగే వైసీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్లు పార్టీ శ్రేయోభిలాషులై వుండాల‌ని, కానీ కొంత మంది వ్య‌వ‌హారాల్ని గ‌మ‌నిస్తే, త‌మ‌కు గిట్ట‌ని వాళ్ల‌ని అణ‌గ‌దొక్క‌డానికి ప‌వ‌ర్‌ని వాడుకుంటున్నార‌నే విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వంపై పోరాటాల కంటే ముందు, వైసీపీలో లోపాల్ని స‌రిదిద్దుకోడానికి జ‌గ‌న్ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వుంది.

అయితే ప్ర‌స్తుతం చుట్టూ ఉన్న టీమ్‌ను ప‌క్క‌న పెడితే త‌ప్ప‌, లోపాల్ని గుర్తించ‌డం, వాటిని స‌రిచేసుకోవ‌డం సాధ్యం కాద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత కూడా కూట‌మి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌నే న‌మ్ముకోవ‌డం మంచిది కాదు. ముందు సొంతింటిని చ‌క్క‌దిద్దుకుని, ఆ త‌ర్వాత ప్ర‌త్య‌ర్థుల‌పై పోరాటాలు రాజ‌కీయంగా స‌త్ఫ‌లితాలు ఇస్తాయ‌ని జ‌గ‌న్ గ్ర‌హిస్తే మంచిది.

22 Replies to “ప‌క్క‌న పెట్టాల్సిన నాయ‌కులు… జ‌గ‌న్ ప‌క్క‌నే!”

  1. వాళ్ళు ఎన్ని వేషాలు వెసినా, నువ్వు ఎన్ని జాకీలు వెసినా, jagan పని అయిపొయింది రా అయ్యా! ఒక్క చాన్స్, ఒక్క చాన్స్ అంటె ఇచ్చారు. ఆ తుగ్లక్ పాలన చవి చూసారు! ఇక ఈ జన్మ లొ jagan గెలిచెది లేదు చచ్చెది లెదు!!

  2. వాళ్ళు ఎన్ని వేషాలు వెసినా, నువ్వు ఎన్ని జాకీలు వెసినా, jagan పని అయిపొయింది రా అయ్యా! ఒక్క చాన్స్, ఒక్క చాన్స్ అంటె ఇచ్చారు. ఆ తు.-.గ్ల.-.క్ పాలన చవి చూసారు! ఇక ఈ జన్మ లొ jagan గెలిచెది లేదు

  3. 30 ఏళ్ళు మనమే అధికారం లో ఉంటాం..

    ..

    కండిషన్స్ అప్లై..

    ..

    30 ఏళ్ళు కళ్ళు మూసుకుని “మనదే అధికారం” అనుకుంటే సరిపోతుంది..

  4. ప్రతీ పార్టీ లో ఒకడిమీద ఇంకోడు కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ very common.

    లెవెనన్నోయ్.. నువ్వేమి ఇవన్నీ పట్టించుకోబాకు, పార్టీ నాయకులు సొంతంగా కనీసం 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని ఎదవలు.. వాళ్ళు కూడా నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..

    మన ఓటర్లు ‘EVM లు..

    నువ్వు అపద్దాలుచెప్పకపోవడం, నీ అతి నిజాయితీ, మన అతి మంచితనం తో ఓ 5 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుని .. ‘EVM ల జపం చేస్తే చాలు 175/175 మెజారిటీ తో అధికారం తన్నుకుంటూ అదే వస్తది..

    All the very best.. అన్నట్టు ఈరోజు ప్రేమికుల రోజు కదా?? నీ ప్రేమికుడు సజ్జలుతో ఎలా గడపాలని plan చేసావ్??

  5. ప్రతీ పార్టీ లో ఒకడిమీద ఇంకోడు కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ very common.

    లెవెనన్నోయ్.. నువ్వేమి ఇవన్నీ పట్టించుకోబాకు, మన పార్టీ నాయకులు సొంతంగా కనీసం 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని ‘ఎదవలు.. వాళ్ళు కూడా నిన్ను ‘బ్లాక్ ‘మెయిల్ చేస్తున్నారు..

    మన ఓటర్లు ‘EVM లు..

    నువ్వు అపద్దాలుచెప్పకపోవడం, నీ అతి నిజాయితీ, మన అతి మంచితనం తో ఓ 5 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుని .. ‘EVM ల జపం చేస్తే చాలు 175/175 మెజారిటీ తో అధికారం తన్నుకుంటూ అదే వస్తది..

    All the very best.. అన్నట్టు ఈరోజు “ప్రేమికుల రోజు” కదా?? నీ “ప్రేమికుడు సజ్జలు”తో ఎలా గడపాలని plan చేసావ్??

  6. Mukyamgaa ……peddhireddi ramachandra reddi, midhunreddi, roja reddi, chevireddi, chevireddi koduku, y v subbareddi, bumana karunkarreddi, karunakar reddikoduku, peddhareddi, pinnelli reddi sodharulu, dwrampoodi chandra sekar reddi, sajjala reddi abba kodukulu, perni nani, kodaali nani, vallabaneni vamsi, avinashreddi, devineni avinash, vidudhala rajani veellandharini partee nunchi bayataki pampinchi veyakapothe YCP kaneesam vunikini kapadukovatam kastam

  7. “సింగల్ సింహానికే సలహాలా??

    సొంతంగా 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని ‘ఎదవలు కూడా

    “సింగల్ సింహానికి సలహాలు” ఇస్తున్నారు.

    నాయకుడు అనేవాడికి, నీతులుచెప్పేవాడికి, నీ మాదిరి బాటిల్లో నీళ్లు ఏరుకునేలా విశ్వసనీయత ఉండాలి.. అది లేకుండా ఇచ్చేవి సలహాలు కాదు ముంచే కుట్రలు..

    U don’t worry..Just leave them డా.. Hope u r ENJOYING with ur Premikudu “sajjalu” on this special day “ప్రేమికుల రోజు”

  8. According to this article, there is no guarantee of tickets for regional co-ordinators. So, the author is suggesting that regional coirdinators should not invest any time, money and efforts in party activities. What a strategy!!!. Only possible to ‘Jagan anna’

  9. పక్కన పెట్టాల్సింది ఒక్క నాయకులనేనా????మీలాంటి షెడ్డుకెళ్లిన సంత ని అంతా

  10. అసలు ప్రక్కన పెట్టాల్సిందే అన్నియ్య నే. ఆ విషయం ప్రజలకి బాగా అర్ధం అయ్యింది. అన్నియ్యని ప్రజలు ఎప్పుడో ప్రక్కన పెట్టారు.

  11. జగన్ రెడ్డి ఇక అధికారంలోకి వచ్చే సీన్ లేదు ప్రతిపక్షం కూడా అనుమానమే

  12. Idi Jagan okkadike kaadu…jagan only MLS ki appointment ivvaledu anukundamu..kaani asalu ee elections loose ayyindi karyakartha valla…aa karyakarthalu evarini kalustharu…Jagan ni kaadu kadha..akka local mla ni kalavali anukuntaaru…almost andaru mla’s daggara jagan chututtu vunna koutwry Kante daarunanaga vunnarau…mainly jagan koutwry Kante Mla chuttu vunna koutwry valla karyakatha disappoint ayyaru…that’s the root cause…Jagan koutwry mla’s ki okkate nastam..kaani mla’s koutwry mottam state level karyakarthalake nastam..anduvvale oodipoyamm..first rectify this area..

Comments are closed.