దొంగ నేత‌ల్ని గుర్తించావా జ‌గ‌న్‌!

వైసీపీ హ‌యాంలో ఎవ‌రైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ల‌బ్ధి పొందారో, వాళ్లే ఇప్పుడు మౌనాన్ని ఆశ్ర‌యించారు.

వైసీపీ హ‌యాంలో ఎవ‌రైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ల‌బ్ధి పొందారో, వాళ్లే ఇప్పుడు మౌనాన్ని ఆశ్ర‌యించారు. సీఎంగా జ‌గ‌న్ ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు ద‌గ్గ‌రై, ప‌లుకుబ‌డిని ఉప‌యోగించుకుని ర‌క‌ర‌కాల ల‌బ్ధి పొందిన నాయ‌కులే కాని నాయ‌కులు చాలా మందే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు న‌ష్ట‌పోయింద‌ల్లా, అమాయ‌క కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులే. దివంగ‌త వైఎస్సార్‌పై అభిమానంతో ఆయ‌న కుమారుడైన జ‌గ‌న్ వెంట న‌డుస్తున్నారు.

అయితే ప్ర‌యోజ‌నాలే ప్రాతిప‌దిక‌గా జ‌గ‌న్‌తో అనుబంధాన్ని పెంచుకున్న నాయ‌కులు, కొంద‌రు కీల‌క అధికారులు భారీగా ల‌బ్ధి పొందారు. ఇలాంటి వాళ్ల‌తో ఇప్పుడు త‌మ ఆస్తుల్ని ప‌రిర‌క్షించుకోడానికి కూట‌మితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నోళ్లున్నారు. మ‌రికొంద‌రు అస‌లు త‌మ ఉనికే తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. బ‌హుశా జ‌గ‌న్‌కు ఇలాంటి వాళ్ల గురించి ఇప్ప‌టికైనా తెలుస్తున్న‌దో, లేదో మ‌రి!

కానీ టీడీపీ ఘోర ప‌రాజ‌యం పొందిన‌ప్పుడు, వైసీపీ నేత‌ల్లా త‌ప్పించుకుని తిర‌గ‌లేదు. వైసీపీపై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ, చంద్ర‌బాబునాయుడికి అండ‌గా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు నిలిచారు. వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందిన ప‌రిస్థితుల్లో కార్య‌క‌ర్త‌లు మాత్రం ధైర్యంగా ఉన్నారు. కానీ నాయ‌కుల‌తోనే అస‌లు స‌మ‌స్య‌. ఎందుకంటే జ‌గ‌న్‌పై అభిమానం కంటే, ఆయ‌న అధికారాన్ని ప్రేమించే వాళ్లే ఎక్కువ‌గా వెంట ఉన్నారు.

జ‌గ‌న్ బ‌ల‌హీన‌త ఏంటంటే, త‌న‌ను పొగిడే వాళ్లంతా, త‌న వాళ్లే అని భావించే ర‌కం. అధికారం పోయిన నేప‌థ్యంలో ఒక్కొక్క‌రుగా దూర‌మ‌వుతున్నారు. ద‌గ్గ‌రి బంధువైన మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి జ‌న‌సేన‌లో చేరాక‌, ఇక మిగిలిన నాయ‌కుల గురించి మాట్లాడ్డానికి ఏముంటుంది? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. పోరాటాల‌కు జ‌గ‌న్ పిలుపు ఇస్తే, త‌మ‌ను కాకుండా ఎంచుకో అనే రీతిలో గతంలో ప‌ద‌వులు అనుభ‌వించిన‌, ఆస్తుల్ని సంపాదించిన నేత‌లు త‌ప్పించుకు తిరుగుతున్నారు. ఇలాంటి దొంగ నేత‌ల్ని జ‌గ‌న్ గుర్తిస్తున్నారో, లేదో మ‌రి!

34 Replies to “దొంగ నేత‌ల్ని గుర్తించావా జ‌గ‌న్‌!”

  1. లిస్ట్ లో ఫస్ట్ పేరు జగనే ఉంటుంది..

    ఎందుకంటే.. బెంగుళూరు లో కూర్చుని కాంగ్రెస్ తో మంతనాలు చేస్తున్నాడు కదా..

    గంతకు తగ్గ బొంతలు.. అధినాయకుడు జెండాలు కలిపేద్దామని చూస్తున్నాడు.. నాయకులు జెండా రంగులు మార్చేసుకొంటున్నారు.. ఎత్తిపోయిన పార్టీ కి గుమ్మడికాయ దిష్టి కొట్టడం కూడా దండగే..

    1. ఏరా బాబు నువ్వు జగనన్న కాంగ్రెస్ వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చూసావా తెలియకుండా అనవసరంగా మాట్లాడక నీలాగా మూడు జండాలు మోసే రకం కాదు మేము ఒకటే నినాదం జై జగనన్న జై వైఎస్ఆర

  2. “దొంగ నేత‌ల్ని జ‌గ‌న్ గుర్తిస్తున్నారో, లేదో మ‌రి!”..are you asking him to look in the mirror..

    do not call jagan as దొంగ

    :-p

  3. jalaga ni abhimaninchadiniki vaademanna swaantantra samarayodhudaa?andaru adhikaaram kosame untaaru.ee vishayam kuda teleeka laksha kotlu dengi tinnadantava? aa amayaka chakravarti?

  4. మన జగన్ గడే పెద్ద గజదొంగ ఈ గ్రేట్ గడికి గ్యాస్ ఎక్కువ అయ్యింది

  5. లాభపడిన వారు పది మంది ఉంటే, నష్టపోయిన వారు వేలల్లో ఉంటారు.

    ఆ పదిమంది పోతే నష్టం లేదు నష్టపోయిన వారికి సహాయం చేస్తే చాలు

  6. 11+11+11+11+11+11+11+11+11+11+9=119 రోజుల క్రితం ప్రకటించిన కోటి రూపాయలు / కొట్టేసిన ఫర్నిచర్ ఎప్పుడు ఇస్తాడో ఒక ఆర్టికల్ రాయవచ్చుగా .!

    భారత దేశంలో కార్యకర్తల పార్టీ అని చెప్పుకొనే హక్కు ఉన్న ఏకైక పార్టీ నా/మా తెలుగు దేశం రా పేటీఎమ్స్! ఇందుకే కాలర్ ఎగరేసుకొని చెపుతాం జై తెలుగుదేశం అని.

  7. If they know that the party or their leader will work hard for the betterment of the people, they will stay. Where as our JAGLAQ wants to come to power with the sole motto of LOOTING THE STATE & KEEP HIMSELF OUT OF JAIL. There is no future for A.P if he ever wins again.

  8. ఇతను మారే రకం లా కనపడ్డం లేదు అందుకే ఇంక ప్రజలు కార్యకర్తలు నమ్మరు

  9. కామెడీ బాగుంది. అన్నకి అద్దం ఒకటి పంపించు, దొంగల్ని బాగా గుర్తుపడతాడు,😜😜😜

  10. నేతే అందరినీ దోచేసే గజదొంగ ఎం పర్లెదులే GAగారు మీరు బెంగ పెట్టుకోవద్దు

Comments are closed.