‘ఇంటర్ డిస్కంటిన్యూ..’ గొప్ప రీజన్ చెప్పిన పవన్!

నేను చదువుకోలేక కాదు.. మార్కులు తెచ్చుకోలేక కాదు.. బాగా చదివేవాడిని.. నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు.

కిందపడ్డా సరే.. పైచేయి నాదే అనడం అంటే బహుశా ఇదే కావొచ్చు. ఇంటర్మీడియట్ తో చదువు మానేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఆ తర్వాత కూడా కనీసం తానొక పట్టభద్రుడిని అనిపించుకోవాలని ప్రయత్నించలేదు. ఎందరో మహామహులు కూడా ఓపెన్ వర్సటీల విద్యావిధానంలో డిగ్రీలు చదువుతుంటారు. పీజీలు చేస్తుంటారు. కానీ.. పవన్ కల్యాణ్ అలాంటి ఆలోచన కూడా చేయలేదు.

కానీ పుస్తకాలు చదవడం తనకు గొప్ప ఆసక్తి అని, వేలకొద్దీ పుస్తకాలు చదివినట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. అదంతా ఓకే గానీ.. తాను ఇంటర్మీడియట్ తో చదువు ఎందుకు ఆపేశానో.. ఆయన చాలా గొప్ప రీజనింగ్ చెప్పుకున్నారు. తాను కోరుకుంటున్న చదువు క్లాసు పుస్తకాల్లో లేదని, అందుకే చదువు మానేశానని అంటున్నారు.

విజయవాడలో పుస్తకమహోత్సవం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ అతిథిగా హాజరయ్యారు. పుస్తకాలు చదవడం అంటే తనకున్న ప్రేమను తన ప్రసంగంలో బయటపెట్టారు. ఎవరైనా పుస్తకాలు అడిగితే కొనిస్తానని, అంతే తప్ప తన దగ్గరున్న పుస్తకాలు మాత్రం ఇవ్వనని, కోటిరూపాయలైనా ఇస్తాను గానీ.. పుస్తకాలు ఇవ్వనని ఆయన చెప్పుకొచ్చారు. అదంతా పక్కన పెడితే.. ఇంటర్ తో ఆపేయడానికి చెప్పిన రీజనింగే తమాషా!

‘నేను చదువుకోలేక కాదు.. మార్కులు తెచ్చుకోలేక కాదు.. బాగా చదివేవాడిని.. నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు. క్లాస్ రూంలో లేదు. అందుకే మానేశా’ అని పవన్ చెప్పుకున్నారు. తాను కోరుకుంటున్నది క్లాసు పుస్తకాల్లో లేదని పదిహేడేళ్ల ప్రాయంలోనే అర్థం చేసుకోవడం.. ఆ తర్వాత సినిమా రంగ ఎంట్రీ ఇవ్వడం బహుశా కోరుకున్న దానికోసమేనా అని జనం నవ్వుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ మాటలు.. విద్యారంగాన్ని, విద్యావ్యవస్థను అవమానించేలా ఉన్నాయని పలువురు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ.. ఇలా విద్యావ్యవస్థను అపహాస్యం చేసేలా, విద్యార్థులను యువతరాన్ని చదువుల పట్ల విముఖత పెంచేలా, తప్పుదారి పట్టించేలా మాట్లాడడం అనేది దుర్మార్గం అని పలువురు అంటున్నారు.

32 Replies to “‘ఇంటర్ డిస్కంటిన్యూ..’ గొప్ప రీజన్ చెప్పిన పవన్!”

  1. Cry….cry….until you……… ఐన నిన్న pawan kalyan గారు పుస్తకాల గొప్పతనం గురించి , book reading వల్ల యువత కు కలిగే లాభాలు, వచ్చే అవకాశాలు గురించి ఎంత చక్కగా వివరించారో అందరూ విన్నారు GA……మీకు మాత్రమే కడుపుమంట తో కళ్లు మూసుకుని పోయాయి….అంతే GA….

  2. Pawan kalyan గారు పుస్తకాల గొప్పతనం గురించి, book reading వల్ల యువత కు కలిగే లాభాలు, వచ్చే అవకాశాలు గురించి ఎంత చక్కగా వివరించారో అందరూ విన్నారు GA…..

  3. Pawan kalyan గారు పుస్తకాల గొప్పతనం గురించి ఎంత చక్కగా వివరించారు GA….

  4. అంతే కదా..

    మన జగన్ రెడ్డి అయితే ముఖ్య మంత్రి స్థానం లో ఉండి.. మూడు పెళ్ళాల గురించి మాట్లాడొచ్చు.. చంద్రముఖి అంటూ శబ్దాలు చేయొచ్చు.. ప్రత్యర్థుల ఇంట్లో భార్యల గురించి మాట్లాడొచ్చు..

    ఇవన్నీ స్కూల్ పిల్లలకు చదువుల పట్ల ఆసక్తి పెంచుతాయి.. కాబోలు..

    పైగా మన వెబ్సైటు లో చెడుగుడు ఆడుకున్నాడు అంటూ ఆర్టికల్స్ వదిలాము మనం.. ప్రత్యర్థులను చీల్చి చెండాాడాడు అంటూ మురిసిపోయేవాడివి..

    ..

    జగన్ రెడ్డి ఇంత చండాలం గా మాట్లాడుతున్నా.. అప్పుడు ఆ “పలువురు” నిద్రపోయారు కాబోలు..

    కానీ.. ప్రజలు మాత్రం ప్రతి తప్పు కి ఒక సీటు కత్తరించుకొంటూ పోయారు..

      1. నీకు నచ్చితే ఉండు.. లేకపోతే వేరే రాజధాని చూసుకుని వెళ్ళిపో..

        ఇకపై అమరావతే ఆంధ్ర రాష్ట్ర రాజధాని..

        నువ్వు నీ జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా.. అమరావతి నుండి ఇటుక ముక్క కూడా పీకలేరు..

        నా రాజధాని .. నా అమరావతి..

  5. Pawan is neither first one nor last one, who skipped school and became big. Why do you surprise? He gave some important life lessons, read Eenadu article to understand.

  6. నాకు, అతి మంచితనం.. అతి నిజాయితీ.. అని జగన్ మాత్రం చెప్పుకొ వచ్చు!! మరి 17 CBI/ED కె.-.సులున్న నీకు నిజాయితీ ఎమిటిరా అని నువ్వు అడిగావా?

    .

    మాస్క అడిగిన డాక్టర్ సుదాకర్ ని పిచ్చాస్పత్తిరికి పంపించావ్, పెస్ బూక్ పోస్ట్ పెట్టిన రంగనాయకమ్మ మీద CID కెసు పెట్టి ఊరు వెల్లగొట్టవ్, మరి మీలొ మంచితనం ఎక్కడ ఉంది అని అడిగావా GA గురువిందా?

  7. Veedu Oka vela pass ayi degree chadivnte, aa Google ki nene idea icha, Facebook ki linking idea nene icha anevaademo…abbo fali ayina sanyasi ki emi raa elevation..

  8. ippudunna vidya vyavastha aa rojullo yelo vunndaani kantae, ayana cheppina paristhithi ipudu alaanae vundi in education system, children not learning what they need, First need to change the education system

  9. సన్నాసి మాటలు సీరియస్ గా తీసుకొని పిల్ల సైనిక్స్ చదువు మానెయ్యరు కదా? అసలే ఇల్లిటరేట్ గాళ్లతో (2019-24)రాష్ట్రం నాశనం అయింది ..

Comments are closed.