సంక్రాంతి సినిమాల విడుదల దగ్గరకు వస్తోంది. ఈ సినిమాల బిజినెస్ లు అన్నీ క్లోజ్ అయ్యాయి. దిల్ రాజు నిర్మించిన భారీ సినిమా గేమ్ చేంజర్, మీడియం సినిమా సంక్రాంతికి వస్తున్నాం రెండూ కలిసి కాంబో లెక్కన ఇచ్చేసారు.
ఆంధ్ర (సీడెడ్ మినహా) మిగిలిన ఏరియాలు అన్నీ కలిపి 80 కోట్లకు ఇచ్చారు. ఇందులో గేమ్ ఛేంజర్ 65 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం సినిమా 15 కోట్ల లెక్కన ఇచ్చారు. ఏపీ లో వైజాగ్ ఏరియాను నిర్మాత దిల్ రాజే పంపిణీ చేసుకుంటారు.
ఇవే రెండు సినిమాలు కలిపి సీడెడ్ ఏరియాకు 27 కోట్లకు విక్రయించారు. 22 కోట్లు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం 5 కోట్లకు ఇచ్చారు. ఈ సినిమా నైజాం ఏరియాలో నిర్మాత దిల్ రాజే స్వయంగా విడుదల చేసుకుంటున్నారు.
ఈ రెండు సినిమాల సంగతి ఇలా వుంటే, బాలయ్య నటించిన డాకూ మహరాజ్ సినిమాను నైజాం ఏరియాకు 18 కోట్లకు విక్రయించారు. ఏపీ ఏరియాను (సీడెడ్ మినహా) 40 కోట్లకు ఇచ్చారు. ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. మొత్తం మీద మూడు సంక్రాంతి సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగానే బిజినెస్ సాధించాయి.
బిజినెస్ ఎంత అయినా పర్లేదు…కొనుక్కున్నోళ్ళు తడి గుడ్డ యేసుకొని కూర్చో వొచ్చు… ఎందుకంటే, తెలుగోళ్ళం ,,ఆ ఎమౌంట్ ఒక లెక్క కాదు…మొదటి రోజే,,మొదటి ఆట కే మొత్తం ఇచ్చినా ఇచ్చేస్తాం
Pushia 2 telugu breakeven kaa ledu after super duper hit
Bollywood lo pushpa 2 movie 800 crores collect chesindhi