సైలెంట్ అయినవారిపై స్పెషల్ ఫోకస్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు తాజా మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్లిపోవడానికి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేసి వెళ్లిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన నాయకులు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు తాజా మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్లిపోవడానికి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేసి వెళ్లిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన నాయకులు పార్టీమీద అలకపూనడానికి వారికి ఏదో ఒక కారణాలు కొన్న ఉన్నాయి. అసంతృప్తితో ఉన్నారు అని అనుకోవడానికైనా అవకాశం ఉంది. ఆళ్ల నాని విషయంలో అలాంటిది తక్కువ. అయినా ఆయన కూడా పార్టీతో అనుబంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నారు.

ప్రస్తుతానికి వేరే పార్టీల్లో కూడా చేరడం లేదు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో ఇలా సైలెంట్ గా ఉంటూ, హటాత్తుగా పార్టీని వీడిపోయే అవకాశం ఉన్న నాయకులు ఇంకా ఎంత మంది ఉన్నారో దృష్టి సారించాల్సిన అవసరం జగన్ కు ఏర్పడింది.

వైసీపీ నుంచి ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, కిలారు రోశయ్య, పెండెం దొరబాబు రాజీనామాలు చేశారు. వారంతా పార్టీ తమకు అన్యాయం చేసిందని ఏదో ఒక కారణాలు చెప్పుకున్నారు. కానీ.. ఆళ్ల నాని విషయంలో అలా ఏం లేదు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా సైలెంట్ గానే ఉంటున్నారు. హఠాత్తుగా రాజీనామా నిర్ణయం వచ్చేసింది.

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టిపెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను పిలిచి వారితో భేటీ అవుతున్నారు. భరోసా ఇస్తున్నారు. పార్టీని ఐక్యంగా, బలంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రెండో వైపున నాయకులు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లడం ఇబ్బందికర పరిణామమే.

జగన్ కాస్త మేలుకుని పార్టీలో ఇంకా ఎవరెవరు సైలెంట్ గా ఉంటున్నారో ఆ నాయకుల్ని ప్రత్యేకంగా పిలిపించి వారితో చర్చించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పార్టీని కాపాడుకోవడానికి ఈ చర్య చాలా అవసరం అంటున్నాయి.

ఓటమి తర్వాత చాలా మంది నాయకులు సైలెంట్ గానే ఉంటున్నారు. కొందరు మాత్రమే ఆర్భాటంగా ప్రతిదానికీ స్పందిస్తున్నారు. ఈసైలెంట్ గా ఉండే నాయకులతో అధినేత మాట్లాడి.. వారి అసంతృప్తిని దూరం చేసేందుకు ప్రయత్నించాలని పలువురు అంటున్నారు.

19 Replies to “సైలెంట్ అయినవారిపై స్పెషల్ ఫోకస్!”

  1. “ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం” Chandrababu ని కాళ్ల వెళ్లా పడి హోదా అడుక్కు0టున్న “Leven ల0గా” గాడు .. ఫర్నీచర్ దొ0గ

  2. నీ పెళ్లాం ర0కు మొగుడు silent అయ్యాడు.. పార్లమెంటుకు కూడా పోవడం లేదు..మొ గో డి వే అయితే ముందు ఆ సంగతి తేల్చు..

  3. జగన్ నోరు విప్పే కొద్దీ, వెగటుగా అనిపిస్తుంది ప్రజలకు, అనుకూల మీడియా, కార్యకర్తలకు తప్ప. ఏ నాయకుడు వాళ్ళ తరాల కోసం న్యాయంగా కష్టపడి పని చేస్తాడో అనే సీబీఎన్ ను గెలిపించారు. జగన్ ది కష్టపడే గుణం కాదు, సుఖపడే గుణం మటుకే.

  4. ₹11 రూపాయల ప్రశ్న.. ఇప్పుడూ వీడ్ని లోపల బెంగుతే పార్టీ తరపున ఎవరూ ప్రచారం చేస్తారు?

    ఆవిడ కేమో 3 గం.. కూ మీటింగ్ లు ఎక్కువ..

    మరీ ఎవరూ?

  5. అలా అయితే దాదాపు వైసీపీ 160 ఎమ్మెల్యే , 20 మంది ఎంపీ అభ్యర్థుల మీద దృష్టి పెట్టాలి..

  6. దువ్వాడ మీద artical రాయలేదు ఎందుకురా అదే TDP JSP అయితే వారం రోజులు వదులుతావా థూ నీ యధవ బ్రతుకు

Comments are closed.