బాబులో భయం: తమ్ముళ్లు టార్గెట్ రీచ్ అవుతారో లేదో?

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థిని బరిలో నిలబెడితే తెలుగు తమ్ముళ్లు దానిని విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళగలరా లేదా అనే సందేహాలు అధినేత చంద్రబాబు నాయుడులో కలుగుతున్నాయి. Advertisement ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ…

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థిని బరిలో నిలబెడితే తెలుగు తమ్ముళ్లు దానిని విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళగలరా లేదా అనే సందేహాలు అధినేత చంద్రబాబు నాయుడులో కలుగుతున్నాయి.

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆయన ఇదమిత్థంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. పార్టీ అభ్యర్థి ప్రకటన రోజురోజుకు ఆలస్యం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఫిరాయింపజేసి తెలుగుదేశానికి అనుకూలంగా ఓట్లు వేయించే బాధ్యత ఎవరు తీసుకుంటారనేది పార్టీలో ఇంకా తేలలేదు.

ఉమ్మడి విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర నాయకులతో విడతలు విడతలుగా సమావేశాలు నిర్వహించినప్పటికీ, అందుకు ఎవరూ తాము పూనిక వహిస్తామనే భరోసా చంద్రబాబుకు ఇవ్వలేదు. అందుకే తెలుగుదేశం అభ్యర్థి ప్రకటన విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

విశాఖ కార్పొరేషన్ పరిధిలోని కొందరు కార్పొరేటర్లు వైసిపి నుంచి జంప్ చేసి కూటమి పార్టీలలోకి చేరగానే తెలుగుదేశం నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా తాము గెలిచేసుకున్నట్లే అని డాంబికాలు పలికారు. గంటా శ్రీనివాసరావు లాంటి నాయకులైతే ఏకంగా ఇకపై రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన కూటమి పార్టీల అభ్యర్థులే విజయం సాధిస్తారంటూ ఆర్భాటంగా ప్రకటించడం ఇక్కడ గమనార్హం.

ఇలాంటి నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ప్రకటన మాత్రం మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే వస్తోంది. కొన్ని రోజులుగా ఇవాళ టిడిపి అభ్యర్థి ప్రకటన ఉంటుంది.. రేపు ప్రకటన ఉంటుంది.. అనే లీకులతో రోజులు నెట్టుకొస్తున్నారే తప్ప.. అసలు పోటీ గురించి నిర్ణయం ఇంకా జరగలేదు అని తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులతో చంద్రబాబు నాయుడు సమావేశమైనప్పుడు సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. వైసిపి నుంచి ఎన్ని ఓట్లు తమకు పడే అవకాశం ఉన్నదో లెక్కలు వేసే ప్రయత్నం చేశారు. అలాగే స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు అందరికీ వైసీపీ ప్రజాప్రతినిధులను ఫిరాయింపజేసి వారిని ప్రలోభపెట్టే బాధ్యతను అప్పగించారు. ఈ బాధ్యత విషయంలో వారికి నిర్ణయించిన టార్గెట్లను పూర్తి చేయగలమనే విశ్వాసం పలువురు వ్యక్తం చేయలేకపోయారు.

అలాంటప్పుడు పోటీకి దిగితే తల బొప్పికడుతుందని అసెంబ్లీ ఎన్నికలలో ఘనమైన విజయం సాధించిన తర్వాత ఈ ఎన్నికల్లో ఓడిపోతే అది ప్రత్యర్థి పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పార్టీ భావిస్తోంది. దానికి బదులుగా అసలు పోటీకి దిగకుండా ఉండడమే బెటర్ అని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

చంద్రబాబుతో బయట ఈ సమయంలో తాము పోటీ చేయకుండా ఉండడమే మంచిదని లేకుంటే పరువు పోయే ప్రమాదం ఉందని కూడా కొందరు నేతలు సూచించినట్లు సమాచారం. దాంతో బరిలోకి దిగే ధైర్యం చేయలేక చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతానికి ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పోటీ చేయాలా వద్దా నిర్ణయించాలని సూచించారు. అంటే ఫిరాయింపులు సాధ్యమవుతాయో లేదో వీరు బేరాలు లెక్క తేల్చాలి అన్నమాట.

18 Replies to “బాబులో భయం: తమ్ముళ్లు టార్గెట్ రీచ్ అవుతారో లేదో?”

  1. మనము సక్రమమైన మార్గంలో గెలుస్తే కదా భయపడక పోవటాన్ని.. దొడ్డి దారోడు ఎప్పుడూ భయం తోనే ఉంటాడు

  2. అప్పుడు లక్షల కోట్లు అప్పు చేసి కేవలం 2 లక్షల కోట్లకి మాత్రమే బటన్ నొక్కి. మిగతా 8 లక్షల కోట్లు నువ్వే నొక్కి ఊరూరు ప్యాలస్లు కట్టుకుని paraదాల్లో daakkunte

    ప్రజలు serious గానే 11 ఇంచులు ది0పారు..

    ఇప్పుడు అసెంబ్లీ కి పోయే ‘దమ్ములేని ల0గా గాడికి ఇప్పుడు ప్రజా ప్రతినిధులు దింపే వంతు.. ఎన్ని ఇంచులు అనేదే Q

  3. చంద్రశేఖర్ రెడ్డి బియ్యం మాఫియాని కట్టడి చేసే ప్రయత్నంలో సీబీన్ / నాదేండ్ల

    ఉంటే, అదే ద్వారంపూడి ముఠాని పురంధేశ్వరి / లావు శ్రీకృష్ణ దవరాయులు

    లు తీసుకెళ్లి కేంద్ర మంత్రిని కలవడంలో అర్ధం ఏంటి.

    50 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన సంగతి ఈMPలకు తెలియదా … ఏమి జరుగుతుంది రా ఏపీ లో .అయోమయం గందరగోళంగా ఉంది .

  4. మరో బ్లాక్ బ్లాస్టర్ చిత్రం

    బాపట్ల సూర్య లంక బీచ్ రిసార్ట్స్ రా స లీ ల లు

    వీడియో విడుదలకు సర్వం సిద్ధం చేస్తున్న వీ శాం తి వర్గం

Comments are closed.