ప‌వ‌న్ పంథాపై జ‌న‌సేన శ్రేణుల ఖుషీ

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథాపై జ‌న‌సేన శ్రేణులు ఖుషీగా ఉన్నాయి.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథాపై జ‌న‌సేన శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. ఇదే సంద‌ర్భంలో భాగ‌స్వామ్య ప‌క్షం, కూట‌మిలో పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్న టీడీపీ మాత్రం ఆందోళ‌న‌గా వుంది. ప‌వ‌న్ కోణంలో చూస్తే, ఆయ‌న పంథా స‌రైన మార్గంలోనే వెళుతోంది. అధికారంలో వుంటూనే, త‌న‌పై వ్య‌తిరేక‌త ప‌డ‌కుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముందు చూపుతో జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు. ప‌వ‌న్‌కు రాజ‌కీయ అనుభ‌వం లేద‌ని అనుకుంటున్న టీడీపీ నేత‌ల‌కు ఆయ‌న ఏదో ఒక రూపంలో షాక్ ఇస్తున్నారు.

ప‌వ‌నేమో త‌న పార్టీని బ‌లోపేతం చేసుకుంటున్నార‌ని, అలాగే ఏవైనా దుర్ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిలా మాట్లాడ్డంపై జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మెచ్చుకుంటున్నారు. టీవీ డిబేట్ల‌లో కూట‌మి భాగ‌స్వామి పార్టీగా జ‌న‌సేన అధికార ప్ర‌తినిధులు దీటుగా స‌మాధానాలు ఇస్తున్నారు. ఎటొచ్చి ఇబ్బంద‌ల్లా టీడీపీకే.

బీజేపీ విష‌యానికి వ‌స్తే, అధికారాన్ని అనుభ‌విస్తూ, మ‌రోవైపు తామ‌రాకుపై నీటి బొట్టులా ఆ పార్టీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. తిరుప‌తిలో దుర్ఘ‌ట‌న జ‌రిగినా, ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఇప్ప‌టి వ‌ర‌కూ అక్క‌డికి వెళ్ల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే, ఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకుని, త‌న‌కు తానుగా సంఘ‌ట‌నా స్థ‌లాల వ‌ద్ద‌కు వెళుతున్నారు. ప‌వ‌న్ అడుగుల‌పై ఇప్ప‌టికిప్పుడు వ్యాఖ్యానించ‌లేం.

అయితే ప‌వ‌న్ మాత్రం భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని న‌డుచుకుంటున్నార‌నే అభిప్రాయాన్ని అంద‌రిలో క‌లిగించ‌డంలో స‌క్సెస్ సాధించారు. జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేసుకుని, భ‌విష్య‌త్‌లో తానే సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌బ‌డాల‌నే ఆలోచ‌న ఆయ‌న‌లో ఉన్న‌ట్టు, ప‌వ‌న్ అడుగుల్ని చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతోంది. రాజ‌కీయ అజ్ఞాని అనే ద‌గ్గ‌రి నుంచి, తెలివైన పొలిటీషియ‌న్‌గా ప‌వ‌న్ పిలిపించుకోవ‌డం కాలం తీసుకొచ్చిన మార్పుగా భావించొచ్చు.

9 Replies to “ప‌వ‌న్ పంథాపై జ‌న‌సేన శ్రేణుల ఖుషీ”

  1. పవన్ అజ్ఞాని అని, అన్నియ మహా జ్ఞాని నువ్వు అనుకుంటే సరిపోదు

  2. ఎప్పటికి అయినా ఎన్టీఆర్ తర్వాత సీఎం కుర్చీ లో కూర్చోబోయే మరో నటుడు పవన్ కళ్యాణ్ మాత్రమే…. ఆలస్యం అవ్వచ్చు గాని జరగడం మాత్రం పక్కా….

  3. ఫుట్ బాల్ ను ప్లేయర్స్ తంతూ ఉంటూ ఎటుపోతుందో దానికే తెలీదు.. అలాంటిదే వీడి పరిస్థితి…ఇంకా ఇంతకంటే ఎక్కవ రాయలేను కూటమి కార్యకర్తగా .!

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. కనీసం పోలవరం నేషనల్ హై వేస్ రైల్వేస్ ప్రాజెక్ట్ లు కియా లాంటి ఐదు ఆరు పరిశ్రమలు తెచ్చే వరకైనా కూటమి కలిసే ఉండాలి కాంగ్రెస్ ని బీజేపీ ని సొంతం గ ఎదగనీయకూడదు వాళ్ళు పవన్ గారి వద్దకో బాబు గారి వద్దకో వచ్చే లాగా పరిస్థితులు తీసుకు రావాలి వైసీపీ ని మూయించేయాలి వీలయితే అసెంబ్లీ కి టీడీపీ జనసేన విడివిడి గ పోటీచేసిన పార్లమెంట్ కి మాత్రమ ఇద్దరి ఎజెండా అభివృద్ధి సంక్షేమమే కాబట్టి కలిసి పోటీచేయడం మేలు మొత్తం 25 మంది ఎంపీ లు వీళ్ళ చేతిలో ఉంటే ఇప్పటి లాగె శాశించొచ్చు

Comments are closed.