రాజకీయ నాయకులు సెటైర్లు వేయడంలో, వ్యంగ్య బాణాలు సంధించడంలో ముందుంటారు. అవకాశం దొరికితే ఆడుకుంటారు. ఇలాంటి నాయకులు ప్రతి పార్టీలోనూ ఉంటారు. ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ జైలుకు వెళతాడని బీజేపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు.
అందులోనూ ఈడీ విచారణ జరిపింది కాబట్టి తప్పనిసరిగా జైలుకు వెళతాడని అనుకుంటున్నారు. నిన్న ఈడీ విచారణ తరువాత అరెస్టు చేస్తారని మీడియా అంచనా వేసింది. కానీ అది జరగలేదు. కానీ జైలుకు వెళ్లడం గ్యారంటీ అంటున్నారు.
అలా అనుకుంటున్న బీజేపీ నాయకుల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నాడు. ఆయన కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఓ సలహా ఇచ్చాడు. కేటీఆర్ జైలుకు వెళ్లేముందు కొన్ని వస్తువులు మర్చిపోకుండా తీసుకెళ్లాలని చెప్పాడు. ఏమిటవి?
నాలుగు జతల దుస్తులు తీసుకెళ్లమని చెప్పాడు. జైలులో హాయిగా ఉండదు కాబట్టి దుప్పటి తీసుకెళ్లాలట. పరిశుభ్రత ముఖ్యం కాబట్టి టవల్ తీసుకెళ్లాలట. జైలులో ఉన్నప్పుడు ఎమోషనల్‌గా ఫీలవుతారు కాబట్టి కర్చీఫ్ ఉంచుకోవాలట. సబ్బు తీసుకెళ్లాలట. జైలు భోజనం ఫైవ్ స్టార్ హోటల్ భోజనం కాదు కాబట్టి ఊరగాయ దగ్గర ఉంచుకోవాలట.
ప్రస్తుతం చలికాలం కాబట్టి స్వెటర్ తప్పనిసరిగా ఉంచుకోవాలని రాజాసింగ్ సలహా ఇచ్చాడు. గులాబీ పార్టీ పాలనలో తాను కూడా జైలుకు వెళ్లినప్పుడు ఏమేమి తీసుకెళ్లాడో ఇప్పుడు అదే కేటీఆర్‌కు చెప్పినట్లుగా ఉంది. ఒకవేళ కేటీఆర్ నిజంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే రాజాసింగ్ చెప్పినట్లు పరిస్థితి ఇంత ఘోరంగా ఉండకపోవచ్చు.
సరే… రాజాసింగ్ వ్యంగ్యాన్ని కాస్త పక్కకు పెడితే ఏసీబీ, ఈడీ విచారణలతో కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఏసీబీ ఇంతకుముందు విచారించింది. నిన్న ఈడీ విచారించింది. రేపు మళ్లీ ఈడీ విచారణ ఉంది. అంతిమ ఫలితం ఎలా ఉంటుందో మరి.
RAJASINGH BAAGA CHEPPADU
edho mithrudu kabatti oka salaha ichi choosadu…. KTR vinakapothe aayana karma
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు