విశాఖ మేయర్‌కు విశేష అధికారాలు లభించబోతున్నాయి. విశాఖ కార్పొరేషన్ 120 వార్డులతో రాష్ట్రంలోనే అతి పెద్దదిగా ఉంది. సుమారు ఐదు వేల కోట్ల వార్షిక బడ్జెట్‌తో జీవీఎంసీ పాలన సాగనుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమికి భారీ మెజారిటీతో జనాలు పట్టం కట్టారు.
విశాఖ మేయర్‌కు ఈ క్రమంలో మరిన్ని విశేష అధికారాలు దఖలు పడబోతున్నాయి. ఆమె స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. రూ.50 లక్షల వరకు అభివృద్ధి పనులకు మేయర్ స్వయంగా ఆమోదముద్ర వేసే అధికారం లభించబోతోంది.
స్టాండింగ్ కమిటీలో మొత్తం కూటమి సభ్యులే ఉండబోతుండటంతో అభ్యంతరాలు కూడా ఎక్కడా వ్యక్తమయ్యే అవకాశం లేదని అంటున్నారు.
విశాఖ ప్రథమ పౌరురాలిగా మేయర్‌కు మరో ప్రత్యేక హోదా లభిస్తుంది. అలాగే అనేక కమిటీలలో మేయర్ సభ్యురాలిగా ఉంటారు. వైజాగ్ బే సిటీ ప్రాజెక్టుకు సంబంధించిన కమిటీలో ఆమె మెంబర్‌గా కీలక పాత్ర పోషిస్తారు.
విశాఖ కార్పొరేషన్‌కు ఎనిమిదో మేయర్‌గా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న శ్రీవాణి అతి చిన్న వయసులో ఈ హోదాలోకి వచ్చిన వారిగా చెబుతున్నారు. ఆమెకు ముందు చాలా మంది మేయర్లుగా చేసినా, ఆనాడు బడ్జెట్ తక్కువ, వార్డులు తక్కువ. ఇప్పుడు విశాఖ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కార్పొరేషన్ పాత్ర కీలకంగా మారుతోంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన మేయర్‌కు ఉన్న విశేష అధికారాలతో ఆమె కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విశాఖలో దాదాపుగా ముప్పై లక్షల మంది జనాభా ఉంది. ఈ మధ్యనే తాగునీటి సమస్య కూడా నగరంలో తలెత్తింది. అందువల్ల భవిష్యత్తుపై జనాల్లో బెంగ ఉంది.
ఈ పరిస్థితుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జీవీఎంసీ కొత్త పాలకవర్గం కృషి చేయాలని అంతా కోరుతున్నారు. అలాగే విశాఖలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వైజాగ్ మేయర్ శ్రీవాణి కాదు..శ్రావణి
ఇంత irresponsible journalism “ఏంట్రా అరికట్లా?
Inka Nayam ….. Vadhuvu Kalyani ani raya ledu 🤪 😁