సినిమా థియేటర్లలో ఫెయిల్ అయిన తర్వాత ఫేస్ చేయడం ఒకెత్తు. అలా ఫెయిలైన సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫేస్ చేయడం మరో ఎత్తు.
ఇప్పటికే ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఈ విషయంలో ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు ఆదర్శ కుటుంబం వంతు.
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన తర్వాత ఈ సినిమాను నెటిజన్లు మరోసారి చీల్చిచెండాడడం ఖాయం.
ఇప్పటికే ఈ సినిమాపై చాలా విమర్శలు చెలరేగాయి. మరెన్నో వివాదాలు చుట్టుముట్టాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఓ సాంగ్‌ను తమ అనుమతి లేకుండా వాడేశారంటూ ఓ చిన్న నిర్మాత లబోదిబోమన్నాడు.
అటు తన పాత్రను భయంకరంగా కుదించేశారంటూ నటి పూజిత పొన్నాడ ఇంటర్వూలిస్తోంది. ఇక త్రివిక్రమ్ టేకింగ్-మేకింగ్‌పై విమర్శలు సరేసరి.
దీనికితోడు సరిగ్గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు కొన్ని రోజుల ముందు సినిమా నుంచి మాంచి రొమాంటిక్ సాంగ్‌ను యూట్యూబ్‌లో వదిలారు. ఓవైపు ఆ పాట స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతుండగానే, ఇటు ఏకంగా సినిమా అందుబాటులోకి రానుంది.
దీంతో మరోసారి ఈ సినిమాపై ట్రోల్స్, సెటైర్లు తెరపైకొచ్చేలా ఉన్నాయి.
ఒకప్పుడు తనదైన శైలి హాస్యానికి, కడుపుబ్బా నవ్వించే కామెడీకి పేరుగాంచారు త్రివిక్రమ్. ఆదర్శ కుటుంబంలో కూడా అలాంటి సీన్లు బోలెడన్ని ఉంటాయని ఆశించారు ప్రేక్షకులు.
పైగా వెంకటేశ్‌తో కాంబో కాబట్టి కచ్చితంగా ఉంటాయని అనుకున్నారు.
కానీ త్రివిక్రమ్ రేంజ్ కామెడీ ఎపిసోడ్లు ఇందులో లేవు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

రణబాలి కి రాయలేదే ఇలా…
Cinema bane undi ra babu…nuvu 2.5 rating ichavu ante… cinema lo matter undani …. kani e cinema ni pangattukuni yenduku degrade chestunaro ardam kavadam ledu
Veeniki Trivikram mida edupu modati ninchi. Enduku ala kullipothav ra nayana.