దూసుకొస్తున్న వైసీపీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పూర్తిస్థాయిలో గ్రామీణ నేప‌థ్యం ఉన్న రాష్ట్రం. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల‌కు పైగా గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రాజ‌కీయంగా ప‌ట్టు సాధిస్తే అధికారాన్ని ద‌క్కించుకోవ‌చ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పూర్తిస్థాయిలో గ్రామీణ నేప‌థ్యం ఉన్న రాష్ట్రం. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల‌కు పైగా గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రాజ‌కీయంగా ప‌ట్టు సాధిస్తే అధికారాన్ని ద‌క్కించుకోవ‌చ్చు.

ప‌ల్లెల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని ప‌సిగ‌డితే చాలు… అధికారం ఎవ‌రిదో చెప్పొచ్చు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌ల్లె, ప‌ట్ట‌ణం అనే తేడా లేకుండా ప్ర‌తి చోటా కూట‌మి సునామీ సృష్టించింది.

అందుకే 164 అసెంబ్లీ స్థానాల్ని సాధించ‌గ‌లిగింది.

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌జ‌లే అంతిమ నిర్ణేత‌లు. ప్ర‌జాకోర్టులో వారే అంతిమ తీర్ప‌రులు. ఈ వాస్త‌వాన్ని ఎప్ప‌టికీ గుర్తించుకుంటూ, భ‌య‌భ‌క్తుల‌తో న‌డుచుకునే వారికే భ‌విష్య‌త్ వుంటుంది.

లేదంటే ఆద‌రించిన వారే, మూల‌న కూర్చోపెడ‌తారు. విజ‌య గ‌ర్వాన్ని నెత్తికెక్కించుకోకుండా, విన‌యంగా, ప్ర‌జాసేవ‌లో త‌రించే వారికి ఎప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ వుంటుంది.

ఇప్పుడీ విషయాల‌న్నీ… పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో మాట్లాడుకోవాల్సి వ‌స్తోంది. స‌రిగ్గా రెండున్న‌రేళ్ల క్రితం రాజ‌కీయంగా పాతాళానికి ప‌డిపోయిన వైసీపీ… ఇప్పుడు భూమిపై నిలిచి, ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసురుతోంది.

తాజాగా వెల్ల‌డైన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు సాధించిన విజ‌యాలు… అబ్బుర‌ప‌రుస్తున్నాయి. కూట‌మి నేత‌ల వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి.

మొద‌టి విడ‌త‌లో మొత్తం 3,949 పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఇందులో 700కు పైగా పంచాయ‌తీలు ఏక‌గ్రీవం అయ్యాయి.

3,189 పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం ఎన్నిక‌ల్లో ఆయా రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు ఇవ్వ‌గా గెలుపొందిన వివ‌రాలేంటో చూద్దాం.

టీడీపీ 1,661, వైసీపీ 1073, జ‌న‌సేన 156 పంచాయ‌తీల్ని ద‌క్కించుకున్నాయి.

ఈ ఫ‌లితాలు చూస్తేనే ఎవ‌రికైనా వైసీపీ శ‌ర వేగంగా దూసుకొస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇటీవ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ నాయ‌కులే ఊహించ‌ని రీతిలో మంచి ఫ‌లితాల్ని న‌మోదు చేసుకున్నారు.

రాజ‌కీయంగా వైసీపీ దూసుకొస్తోంద‌నే చెప్ప‌డం కంటే, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా టీడీపీ ప‌ర‌ప‌తి దారుణంగా ప‌డిపోతోంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి తెలుసుకుందాం. కూట‌మి 25 స్థానాల‌కు గాను 21 చోట్ల గెలుపొందింది. ఇక్క‌డ 84 శాతం స్ట్ర‌యిక్ రేట్ కూట‌మి ద‌క్కించుకుంది.

ఇక 175 అసెంబ్లీ స్థానాల్లో 164 చోట్ల విజ‌యాల్ని న‌మోదు చేసుకుని, ఏకంగా 93.7 శాతం స్ట్ర‌యిక్ రేట్‌ని కూట‌మి త‌న ఖాతాలో వేసుకుంది.

ఇదే విష‌యాన్ని ఎంతో గ‌ర్వంగా సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే చెబుతుంటారు.

ఇప్పుడు స్థానిక పోరులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే, ఆ స్ట్ర‌యిక్ రేట్ ఎక్క‌డికి పోయింద‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దాదాపు 94 శాతం విజ‌యాల్ని సొంతం చేసుకున్న కూట‌మి…పంచాయ‌తీ పోరులో మాత్రం అందుకు త‌గ్గ‌ట్టు ఫ‌లితాల్ని సాధించ‌లేక‌పోయింద‌న్న‌ది వాస్త‌వం.

ఇదే సంద‌ర్భంలో ఇక వైసీపీ ప‌ని అయిపోయింద‌ని భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్న టీడీపీ నాయ‌కుల వెన్నులో వ‌ణుకు పుట్టించేలా ప‌ల్లెల్లో వైసీపీ ఫ‌ర్మామెన్స్ చూపింది.

చాప‌కింద నీరులా వైసీపీ బ‌ల‌ప‌డుతోంద‌నేందుకు ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి? ప‌ల్లెల్లో వైసీపీ 30 శాతానికి పైగా విజ‌యాల్ని న‌మోదు చేసుకుంది. ఇదేమీ సాధార‌ణ విజ‌యం కాదు.

ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారుల్ని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ముప్పుతిప్ప‌లు పెట్టారు. అడ్డంకుల్ని , బెదిరింపుల్ని , కేసుల్ని, జైళ్ల‌ను దాటుకుని సాధించిన విజ‌యం కావ‌డం వ‌ల్లే, ఇవాళ టీడీపీ భ‌య‌ప‌డుతోంది.

వైసీపీ సాధించిన విజ‌యం ఎంత విలువైన‌దో, ప్ర‌ధానంగా టీడీపీకి బాగా తెలుసు. ఎందుకంటే, ఎలాగైనా ప‌ల్లెల్లో వైసీపీ ఏమీ లేద‌ని నిరూపించ‌డానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ చేయ‌ని అరాచ‌కం అంటూ లేదు.

అందుకే ఆ పార్టీని ఇప్పుడు భ‌యం వెంటాడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఇస్తున్న ఆద‌ర‌ణ‌తో వైసీపీ మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంది.

ముఖ్యంగా అధికారంపై కొండంత ధైర్యాన్ని, న‌మ్మ‌కాన్ని పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వైసీపీకి ఇచ్చాయి. గ్రామీణులు అండ‌గా నిలిస్తే, అధికారాన్ని అందుకోవ‌డం పెద్ద ప‌నేమీ కాది.

ఇదే సంద‌ర్భంలో కూట‌మి అప్ర‌మ‌త్త‌మై న‌డుచుకుంటే, ప‌రిస్థితి మ‌రోలా వుంటుంది. రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుందో కాల‌మే జ‌వాబు చెప్పాలి.

2 Replies to “దూసుకొస్తున్న వైసీపీ!”

  1. అయితే మానోడు ఇంకో రెండేళ్లు అతి నిజాయితీగా కళ్ళూ+గుద్దా మూసుకుని ప్యాలెస్ లో పడుకున్నా అధికారం ప్యాలెస్ వెతుక్కుంటూ వస్తుంది.. సజ్జలూ.. 2.0రప్పా రప్పా ట్రైనింగ్ స్టార్ట్ చేస్కో.. లిమిటెడ్ సీట్స్ అని బోర్డు పెట్టు. దండుకో..  

    ప్యాలెస్ పెళ్ళాం అధికార్ల బట్టలు ఎలా ఊడదీయాలి,

    సినిమా ఎలా చూపించాలి అనే వాటిపైన ట్రైనింగ్ ఇస్తుంది.

Comments are closed.