పంచాయ‌తీల్లో జ‌న‌సేన అట్ట‌ర్ ప్లాప్‌!

తాను లేక‌పోతే టీడీపీ అధికారంలోకి వ‌చ్చేది కాద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే అంటుంటారు. తామంటే అంత‌ని, ఇంత‌ని జ‌న‌సేన నేత‌లు మాట‌లు కోట‌లు దాటేలా మాట్లాడుతుంటారు.

తాను లేక‌పోతే టీడీపీ అధికారంలోకి వ‌చ్చేది కాద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే అంటుంటారు. తామంటే అంత‌ని, ఇంత‌ని జ‌న‌సేన నేత‌లు మాట‌లు కోట‌లు దాటేలా మాట్లాడుతుంటారు.

మాట‌ల్లోనే స‌త్తా, చేత‌ల్లో మాత్రం ఏమీ వుండ‌ద‌ని ముఖ్యంగా టీడీపీ నేత‌లు వెక్కిరించ‌డానికి జ‌న‌సేనే అవ‌కాశం క‌ల్పించింది.

ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల మొద‌టి విడ‌త ఫ‌లితాలు దాదాపు వెల్ల‌డ‌య్యాయి. రాజ‌కీయ పార్టీల గుర్తుల‌తో సంబంధం లేకుండా పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డాన్ని దృష్టిలో పెట్టుకుని, కూట‌మిలో పొత్తు ప్ర‌స్తావ‌న రాలేదు.

అయితే పంచాయ‌తీ ఎన్నికల్లో వైసీపీని టీడీపీ ఏ ర‌కంగా అయితే ప్ర‌త్య‌ర్థిగా, శ‌త్రువుగా చూసిందో, అదే రీతిలో జ‌న‌సేన‌ను కూడా ట్రీట్ చేసింది. ఎన్నిక‌ల్లో మిత్ర‌ప‌క్ష‌మ‌నే మాటే వుండ‌ద‌ని టీడీపీ త‌న చ‌ర్య‌ల ద్వారా రుజువు చేసింది.

వైసీపీ అభ్య‌ర్థుల్నే కాదు, జ‌న‌సేన వారి నామినేష‌న్ల‌ను టీడీపీ అడ్డుకుంది. మిత్ర‌ప‌క్ష అభ్య‌ర్థుల‌ని కూడా చూడ‌కుండా, కొన్నిచోట్ల జ‌న‌సేన వారిపై య‌థేచ్ఛ‌గా దాడులు జ‌రిగాయి.

ఈ నేప‌థ్యంలో ఏక‌గ్రీవాల‌తో సంబంధం లేకుండా జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులు రాష్ట్ర వ్యాప్తంగా 156 పంచాయ‌తీల్లో మాత్ర‌మే గెలుపొంద‌డం గ‌మ‌నార్హం.

మొద‌టి విడ‌త‌లో 3 వేల‌కు పైగా పంచాయ‌తీల్లో ఎన్నిక‌లు జ‌రిగితే జ‌న‌సేన కేవ‌లం 150కి పైగా మాత్ర‌మే గెలుపొంద‌డం ద్వారా, త‌న‌కు అంత సీన్ లేద‌ని నిరూపించుకున్న‌ట్టైంది.

ఈ ఫ‌లితాల్ని చూపుతూ జ‌న‌సేన‌ను మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అవ‌హేళ‌న చేస్తున్నారు. ఈ మాత్రం సంబ‌రానికి , టీడీపీని ఉద్ధ‌రించామ‌నే అవాకులు చెవాకులు దేనిక‌ని టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు నిల‌దీస్తున్నారు.

ఇదే సంద‌ర్భంలో టీడీపీ 1600 కు పైగా పంచాయ‌తీల్లో పాగా వేయడాన్ని జ‌న‌సేన‌కు చూపుతూ, ఇదీ త‌మ స‌త్తా అని దెప్పి పొడుస్తున్నారు.

పంచాయ‌తీ ఎన్నికల్లో స్వేచ్ఛ‌గా నామినేష‌న్లు వేసుకోవ‌చ్చ‌ని స్వ‌యంగా ప‌వ‌న్‌క‌ల్యాణే ట్వీట్ చేయ‌డాన్ని జ‌న‌సేన శ్రేణుల‌కు టీడీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పొత్తు మాటే లేద‌ని, అలాంట‌ప్పుడు బ‌లాన్ని చూపి వుంటే బావుండేద‌ని జ‌న‌సేన‌కు టీడీపీ చుర‌క‌లు అంటిస్తోంది.

ఇప్ప‌టికైనా త‌మ బ‌ల‌మేంటో తెలుసుకుని, టీడీపీ గురించి నోరు జార‌డం మానేస్తే మంచిద‌ని ఆ పార్టీ యాక్టివిస్టులు హిత‌వు చెబుతున్నారు.