వారణాసి విడుదల.. కొనసాగుతున్న సందిగ్దత

రాజమౌళి-మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది వారణాసి సినిమా. ఈ సినిమా చెప్పిన తేదీకి రావట్లేదనే మేటర్ అందరికీ తెలిసిందే.

రాజమౌళి-మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది వారణాసి సినిమా. ఈ సినిమా చెప్పిన తేదీకి రావట్లేదనే మేటర్ అందరికీ తెలిసిందే. మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, అంతా దీనికే ఫిక్స్ అయిపోయారు.

అదే టైమ్‌లో కొత్త విడుదల తేదీపై కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడిన ఈ చిత్రాన్ని జులై చివర్లో విడుదల చేస్తారనే ప్రచారం కొనసాగుతోంది. ఒకవేళ జులై నెలాఖరుకు రాకపోతే, ఆగస్ట్ 15 స్లాట్‌కి వారణాసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఓవైపు ఇలా అంచనాలు, ఊహాగానాలు సాగుతుంటే.. మరోవైపు యూనిట్ మాత్రం వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతం అందరూ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పగా.. ప్రస్తుతం సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్‌తో యూనిట్ బిజీగా ఉంది. డబ్బింగ్ పనులు మాత్రం ఇంకా ప్రారంభించలేదు.

మరోవైపు వారణాసికి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో ఈవెంట్ చేసి అప్పుడే ఏడాది అయిపోయింది. దీనిపై కూడా కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ గట్టిగా పడ్డాయి. ఏడాది గడిచినా ఇంకా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వలేదంటూ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు.

ఇలా ఓవైపు ఎంత హంగామా నడుస్తున్నప్పటికీ, మరోవైపు యూనిట్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టింది. సీజీ వర్క్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విడుదల తేదీ ప్రకటించాలనుకుంటున్నారు.

One Reply to “వారణాసి విడుదల.. కొనసాగుతున్న సందిగ్దత”

Comments are closed.